Showing posts with label Na hrudayavasi o yesayya. Show all posts
Showing posts with label Na hrudayavasi o yesayya. Show all posts

06 August 2023

Na hrudayavasi o yesayya నా హృదయవాసి ఓ యేసయ్యా


నా హృదయవాసి ఓ యేసయ్యా 
నను నడిపించు నా దైవమా (2) 
ప్రణమిల్లెదను నీపాదసన్నిధిలో 
పాడి స్తుతించెద నీనామము (2) ||నా హృదయ||

1.సొంతవారే స్వార్థపరులై క్రుంగదీసెనే
అన్యాయపు తీర్పుకే గురిచేయగా (2)
యేసయ్యా నా అంతరంగ మూగ భావమే (2)
విలపించెను నీ పాదాల చెంత
నిత్య కృపతో నను నిలబెట్టిన దైవమా (2) ||నా హృదయ||

2.దారిచెడి గమ్యమునకు మరుగాయేనే
విశ్వాస యాత్రలో నా పరుగు నిలిచెను (2) 
యేసయ్యా నా ఆర్తధ్వని నీకు చేరగా (2) 
ప్రతిధ్వనించెను నీ ప్రేమ స్వరము
స్థిర రాజ్యముకు నన్ను చేర్చె ఓ మార్గమ (2) ||నా హృదయ||

3.మమ్మును గొనిపోవ త్వరలో రానుంటివే
చిరకాలము నీ సన్నిధిలో నిలుపుటకై (2) 
యేసయ్యా నీ ఆగమనము నే తలంచగా (2) పరవసించెను నా అంతరంగము 
నీ కౌగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై (2) ||నా హృదయ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...