Showing posts with label Kanti paapanu kaayu. Show all posts
Showing posts with label Kanti paapanu kaayu. Show all posts

10 September 2022

Kanti paapanu kaayu | కంటి పాపను కాయు రెప్పలా

కంటి పాపను కాయు రెప్పలా - నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా - దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా - నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా - నాకు నీవే చాలయ్యా ||కంటి||

1.మార్పులేని మత్సరపడని - ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే - ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ - ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ - ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||

2.ఢంబము లేని హద్దులెరుగని - ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను - మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ - ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ - ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| 

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...