Showing posts with label నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని. Show all posts
Showing posts with label నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని. Show all posts

27 June 2021

Nee Chitthamune Neraverchutakai Nanu Ennukoni | నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి - నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే||

హృదయము బ్రద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా||

నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)
నా శత్రువుపై నాకు జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే ||దేవా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...