Showing posts with label yesanna songs. Show all posts
Showing posts with label yesanna songs. Show all posts

02 January 2023

Athi parishududa sthuthi | అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము


అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును 
నీవు నా పక్షమై నను దీవించగా -నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే -ఆశ్రయమైన నా యేసయ్యా
 
సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా 
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
 
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని 
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే 
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా 
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
 
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక 
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమున కలిసి ఉన్నావులె ప్రతి అడుగున 
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

19 January 2022

Neetho na Jeevitham santhoshame | నీతో నా జీవితం సంతోషమే

నీతో నా జీవితం సంతోషమే - నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే

భీకర ధ్వనిగలా మార్గమునందు - నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం - క్షణమైన విడువను నీతో సహవాసం (2)||ఆరాధ్యుడా||

సంతోషమందైనా శ్రమలయందైనను - నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు - శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||

ఆకాశమందుండి ఆశీర్వదించితివి - అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు - నూతన కృపలతో నను నింపుచున్నావు (2)||నీతో నా||

DOWNLOAD MP3 SONG HERE 👇

02 January 2022

Viluvainadhi samayamu o nesthama | విలువైనది సమయము ఓ నేస్తమా

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||

శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||

క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||

15 October 2021

Neeti Vaagula Koraku | నీటి వాగుల కొరకు


నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా(2)

1. పనికిరాని నను నీవు పైకి లేపితివి - 
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి(2)
నా అడుగులు స్థిరపరచి - బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
ఇలలో వెంబడింతు ప్రభూ  ||నా ప్రాణమ||

2.ఆంధకారపు లోయలలో నేను నడిచినను -
ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి(2)
కంటిపాపగ నీవు - నన్ను కాచితివి (2)
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Manaserigina Yesayya | మనసెరిగిన యేసయ్యా మదిలోన


మనసెరిగిన యేసయ్యా - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు

నిర్జీవ క్రియలను విడిచి - పరిపూర్ణ పరిశుద్ధతకై 
సాగిపోదును నేను - ఆగిపోలేనుగా 
సాహసక్రియలు చేయు - నీ హస్తముతో 
నన్ను పట్టుకొంటివే - విడువలేవు ఎన్నడు || మన || 

వెనుకున్న వాటిని మరిచి - నీ తోడు నేను కోరి 
ఆత్మీయ యాత్రలో నేను - సొమ్మసిల్లి పోనుగా 
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో 
నన్ను ఆదుకొంటివే - ఎదబాయవు ఎన్నడు || మన || 

మర్త్యమైన దేహము వదిలి - అమర్త్యతను పొందుటకై 
ప్రభుబల్లారాధనకు - దూరము కాలేనుగా 
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే 
నన్ను కౌగిలించెనే - వదలేవు ఎన్నడు || మన ||

DOWNLOAD MP3 SONG HERE 👇

13 August 2021

Saathwikuda Deenulanu Karuninche | సాత్వీకుడా దీనులను కరుణించే

సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య 
సమ్మతి కలిగిన మనస్సుతో - నిమ్మళముగా నేను బ్రతుకుటకు (2)
సమృద్ది అయిన కృపతో నింపుము - నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము (2)||సాత్వీ||

1. ఈర్ష్య ద్వేషాలతో పాడైన పుడమిపై - నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు (2)
అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో - సహనము కలిగించి నడుపుము ననుతుది వరకు(2)||సాత్వీ||

2. కలతల కెరటాలలో నాతోడుగా నిలిచావు - ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది(2) గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా - మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా(2)||సాత్వీ||
DOWNLOAD MP3 SONG HERE 👇

29 March 2021

Naa Sthuthi Pathruda Naa Yesayya | నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా

1. నీ వాక్యమే నా పరవశము
    నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
    నీ వాక్యమే నా పాదములకు దీపము (2)

2. నీ కృపయే నా ఆశ్రయము
    నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
    నీ కృపయే నా జావన ఆధారము(2)

3. నీ సౌందర్యము యెరూషలేము
    నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
    నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2)
LISTEN, LEARN, DOWNLOAD MP3 SONG HERE 👇

27 March 2021

Dayagala Hrudayudavu | దయగల హృదయుడవు నీ స్వస్త్యమును

దయగల హృదయుడవు నీ స్వస్త్యమును 
ఎన్నడు ఎడబాయవు - ఎడారిలో ఊటలను 
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును
                                              ||దయగల||
1. సత్యస్వరూపి.. నీ దివ్య వాక్యమే నాకు - జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు - జీవన గమనము(2)
శ్రేష్టమైన ఉపదేశముతో - 
జీవముగలిగిన సంఘములో -
నింపుచున్నావు దీవెనలతో నను - 
నడుపుచున్నావు సమృద్దితో (2)  ||దయగల||

2. పరిశుద్దుడా.. నీదివ్య యోచనలే నాకు - ఎంతో ఉత్తమము - పరిశుద్దుల సహవాసమే నాకు - క్షేమధారాము(2)
విశ్వాసమందు నిలకడగా - 
నీరాకడ వరకు మెలకువగా -
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను - 
నిశ్చలమైన నిరీక్షణతో (2) ||దయగల||

3. పరిపూర్ణుడా.. నీ దివ్య చిత్తమే - నాకు జీవాహారము -
పరవాసిగా జీవించుటే నాకు - నిత్య సంతోషము (2)
ఆశ్రయమైనది నీ నామమే - 
సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నాయేసయ్యా - 
నిను నిత్యము కీర్తించి ఘనపరతును(2) ||దయగల||

DOWNLOAD MP3 SONG HERE 👇

23 March 2021

Alpha Omegaina Mahimanwituda | అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా||

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే (2) ||అల్ఫా||

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా||

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||

19 March 2021

Naa Priyuda Yesayya Nee Krupa | నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే


నా ప్రియుడా - యేసయ్యా 
నీ కృప లేనిదే నే బ్రతుకలేను 
క్షణమైనా - నే బ్రతుకలేను || నా ప్రియుడా || 

1. నీ చేతితోనే నను లేపినావు 
    నీ చేతిలోనే నను చెక్కుకొంటివి 
    నీ చేతి నీడలో నను దాచుకొంటివి || నా ప్రియుడా ||

2. నీ వాక్కులన్ని - వాగ్దానములై 
    నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి 
    వాగ్దానములు - మార్పు లేనివి|| నా ప్రియుడా ||

3. ముందెన్నడూ - నేను వెళ్ళనీ 
    నూతనమైన మార్గాములన్నిటిలో 
    నా తోడూ నీవై - నన్ను నడిపినావు || నా ప్రియుడా ||

4. సర్వోన్నతుడా - సర్వ కృపానిధి 
    సర్వసంపదలు - నేలోనే యున్నవి 
    నీవు నా పక్షమై నిలిచి యున్నావు || నా ప్రియుడా ||

Download this Song Here 👇

15 March 2021

Nijamaina Drakshavalli Neeve | నిజమైన ద్రాక్షావల్లి నీవే

నిజమైన ద్రాక్షావల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ (2)||నిజమైన||

1. అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)
                                                 ||నిజమైన||
2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)
                                                 ||నిజమైన||
3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)
                                                  ||నిజమైన||

DOWNLOAD MP3 SONG HERE 👇

08 March 2021

Aadharana karthavu anadhuniga | ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు

ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు (2)

1.అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా
అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే
ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై (2) ||ఆదరణ||

2.నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే
నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు (2) ||ఆదరణ||

యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య
DOWNLOAD MP3 SONG HERE 👇

06 November 2020

Naa Hrudayana Koluvaina | నా హృదయాన కొలువైన

నా హృదయాన కొలువైన యేసయ్యా 
నా అణువణువు నిన్నే - 
ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణలో - ప్రణమిల్లెదనే 
నీ సన్నిధిలో పూజారుడా         ||నా హృదయాన||

1. అగ్ని ఏడంతలై - మండుచుండినను 
    అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను
    అగ్ని బలము చల్లారినే - శత్రు సమూహము అల్లాడెనే
    నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే 
    నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా ||నా హృదయాన||

2. అంతా వ్యర్ధమని - వ్యర్ధులైరెందరో
    నా గురి నీపై నిల్పినందుకే -నాపరుగు సార్థకమాయనే
    నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా  
    నాయందు నిలిచెనే నీపై విశ్వాసమే నన్నుబలపరచెనే
    నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును ||నా హృదయాన||

3. విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు 
    ఎరువు వేసింది ఎవ్వరైనను - వృద్ధి చేసింది నీవేకదా
    సంఘ క్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము  
    నియమించినావే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే 
    నా సర్వము నీకే అర్పింతును ||నా హృదయాన||

23 August 2020

Sarva Yugamulalo Sajeevudavu | సర్వయుగములలో సజీవుడవు

సర్వయుగములలో సజీవుడవు 
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును
కొనియాడదగినది నీ దివ్యతేజం - 
నా ధ్యానం నా ప్రాణం- నీవే యేసయ్యా 

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమలసంకెళ్ళైన శత్రువును కరుణించువాడవునీవే(2
శూరులు నీయెదుట వీరులు కారెన్నడు 
జగతిని జయించిన జయశీలుడా (2)           ||సర్వ||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవునీవే (2
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహుధీరుడా (2)           ||సర్వ||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహుతరములకు శోభాతిశయముగాజేసితివినన్ను2
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో 
శత్రువునణచిన బహుశూరుడా (2)              ||సర్వ||

15 August 2020

Yesu Rakthamu Rakthamu | యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము - అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము
 
1. ప్రతి ఘోరపాపమును కడుగును - 
    మన యేసయ్య రక్తము (2)
    బహు దు:ఖములో మునిగెనే - 
   చెమట రక్తముగా మారేనే  (2) ||యేసు||
 
2. మనస్సాక్షినిశుద్ధి చేయును - 
    మన యేసయ్య రక్తము (2)
    మన శిక్షను తొలగించెను - 
    సంహారమునే తప్పించెను (2) ||యేసు||
 
3. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును - 
    మన యేసయ్య రక్తము 
    మన ప్రధాన యాజకుడు - 
   మనకంటే ముందుగా వెళ్లెను(2) ||యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...