Showing posts with label Saageti Ee Jeevayathralo Regeti. Show all posts
Showing posts with label Saageti Ee Jeevayathralo Regeti. Show all posts

14 July 2021

Saageti Ee Jeevayathralo Regeti | సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి

సాగేటి ఈ జీవయాత్రలో - రేగేటి పెనుతుఫానులెన్నో
ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతిస్పర్శతో 

1. సుడిగుండాలెన్నో లోకసాగరాన - వడిగా నను లాగి పడద్రోసే సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే -  విడిపించ గలిగిన నాకున్న దిక్కు నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా 

2. వడగాడ్పులెన్నో నా పయనంలోన - నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన
తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే - కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా 

3. అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన- చెలరేగి విలవిలలాడించే సమయాన 
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే - కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...