Showing posts with label Mahima ghanatha sthuthi prabhavamu. Show all posts
Showing posts with label Mahima ghanatha sthuthi prabhavamu. Show all posts

10 May 2023

Mahima ghanatha sthuthi మహిమ ఘనత స్తుతి ప్రభావము

మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ.
నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !

1.బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు (2)
నీ జ్ఞానమును - వివరింపతరమా (2)
నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము

2.వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీ మంతుడా
శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీ మహిమైశ్వర్యమిమ్ము

3.అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
నీ కసాద్యమైనది లేదే యెహోవా
నీ సర్వశక్తిని - వివరింపతరమా
నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు

4.శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
కొలువగలేము నీ - ఘనప్రేమను
సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము

5.ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
అగపె ప్రేమను - వివరింప తరమా
అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...