Showing posts with label ముంగమూరి దేవదాసు. Show all posts
Showing posts with label ముంగమూరి దేవదాసు. Show all posts

24 September 2022

Mithruda rarammu maithritho|మిత్రుడా రారమ్ము మైత్రితో పార


మిత్రుడా రారమ్ము - మైత్రితో పార - మార్ధికమైన - మాటల్ వచింతు - మన్ననతో విను ||మిత్రు||

1.పూర్వజన్మము నందు - పూర్తిగా పాపిని అందుకె యీ బాధ -పొందుచున్నాను - అనియిట్లు మనస్సులో - అనుకొననే వద్దు -అది నిజమే యైన - అదికూడ పోగొట్టు రక్షకుడున్నాడు - తత్ క్షణమెరమ్ము - ఆయన మానవుడైనట్టి దేవుండు ఈ మాట నమ్మిన - ఎంత ధన్యుండవు = మనస్సులో ముద్రించు కొని శాంతి పొందుము ||మిత్రు||

2.ఈ జన్మమునుగూడ - ఎన్నెన్నో పాపాలు చేసియున్నందున - చివరకు నరకంబె అని .. ఆత్మయందున - ఆలోచనెందుకు అవి సిల్వపైయేసు అంతరింపజేసి ఆ వృత్తాంతంబును - ఆనందముగ నమ్మి సుఖముగ నుండుము - సూక్ష్మమార్గంబిది ఎంద రెన్నియన్న ఏమాటల్ వినవద్దు = దేవవాక్కె నిజము - దిక్కులుచూడకు ||మిత్రు||

3.తల్లిదండ్రుల్ చేసిన - తగని కార్యంబులు నామీదికె పొర్లి - నను జంపుచున్నవి ఆ శాపమును నేను - అడ్డగింపలేను అని పల్కుచును నీవు - అదరిపోకూడదు పాపమని తెలియని - పాపాలు - ఎన్నెన్నో చేయబట్టి యిన్ని - చిక్కులు ననుజుట్టె అని లేని పోనట్టి వనుకొనకుండుము = నీ పాపములకంటె - నీ తండ్రి దయ గొప్ప ||మిత్రు||

4.నీ పాపశాపాలు - నీ సర్వవ్యాధులు మోసికొన్నట్టి శ్రీ - యేసు దేవుడు ముందె నీకీడు పోగొట్టి - నీకెన్నియో · మేళ్ళు సంపాదనము చేసె - సర్వోపకారుడు దేవుండు మానవుడు దివిలోన భువిలోన - నినుబట్టి పాపివి - నినుజూడనేవద్దు ప్రభు యేసునిబట్టి- పరిశుద్ధుడవు నీవు = ఆయనను జూచిన - అంతయు సరియౌను ||మిత్రు||

5. ఇంటిలోనిపోరు - ఇంకిపోవునుగాక- వాదాలు బేదాలు - వాడి పోవునుగాక కలహాలు నీటను కలిసిపోవునుగాక యుద్ధాలు క్రమముగ ఉడిగిపోవునుగాక - అన్ని పాపాలును అంతరించునుగాక - సర్వ దేశములందు - శాంతి కలుగును గాక నాగరికత ప్రతి - నరుని కబ్బునుగాక దేవుని మ్రొక్కుట తేజరిల్లునుగాక ఆయన బోధలె - అలుము కొనునుగాక ప్రజలందరికిని దైవ - భక్తి పెరుగునుగాక మంచిజీవిని - కనికరించు చుందురుగాక పాడిపంటలు ప్రతి - వాని కుండును గాక వెలుగు, నీరు, గాలి - కలుగజేసిన తండ్రి = మనయందరివలన - ఘనత నొందునుగాక ! ||మిత్రు||

6.దివ్యదేవుడు నిన్ను - దీవించునుగాక భూమి చేసినవాడు - పోషించును గాక రక్షకుండౌ క్రీస్తు - రక్షించునుగాక పరమ వైధ్యుడు స్వస్థ పరచుచుండును గాక పనులన్నిటిని - సఫల - పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు - తెచ్చుచుండునుగాక అంతాన మోక్షంబు - అందజేయును గాక = విజయము ఈ పాట - వినువారికామెన్ ||మిత్రు||

21 April 2022

Randu vishwasulaara randu| రండు విశ్వాసులారా రండు

214    
పునరుత్థాన విజయము
రా - శంకరాభరణం,  తా - ఆది

రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషంబును గల్గి మెండుగ నెత్తుడి రాగముల్ నిండౌ హర్షము మనకు నియమించె దేవుఁడు విజయం, విజయం, విజయం, విజయం ||విజయం||

1.నేటి సమయ మన్ని యాత్మలకును - నీ టగు వసంత ఋతువగును - వాటముగఁ జెరసాలను గెలిచె - వరుసగ మూన్నాళ్ నిద్రించి = సూటిగ లేచెన్ - యేసు - సూర్యుని వలెన్ ||విజయం||

2.కన్ను కన్నుకానని చీఁకటి - కాలము క్రీస్తుని కాంతిచే -  నిన్నాళ్లకు శీఘ్రముగఁ బోవు - చున్నది - శ్రీ యేసుని = కెన్నాళ్ల కాగని - మన - సన్నుతుల్ భువిన్ ||విజయం||

3.బలమగు మరణ ద్వారబంధ - ములు నిన్ బట్టకపోయెను - వెలుతురు లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను - కా - వలియు ముద్రయు ||విజయం||

4.పన్నిద్దరిలోపల నీ వేళ - సన్నుతముగ నీవు నిలిచి -  యున్నావు మానవుల తెలివి - కెన్నఁడైన నందని =  యౌన్నత్య శాంతిని - న - నుగ్రహింతువు ||విజయం||
                 – ముంగమూరి దేవదాసు

23 December 2021

Devaloka sthothraganam | దేవలోక స్తోత్రగానమ్ దేవాది

దేవలోక స్తోత్రగానమ్ - దేవాది దేవునికి నిత్యదానమ్ = దేవలోకస్తోత్ర గానమ్ - దీనులకు సుజ్ఞానమ్ - గావించు వర్తమానమ్ - క్రైస్తవాళి కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల విధానమ్ భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవేష్ట జనమ్ - క్షేమము సమాధానమ్ - క్రీస్తు శిష్య కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట - ప్రధానమ్ సర్వలోక రక్షణార్ధమ్ - చాటించుట ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్ - సర్వలోక కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

దేవ లోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమస్థానమ్ దేవలోక సంస్థానమ్ - దేవుని మహిమస్థానమ్ - పావనకీర్తి ప్రధానమ్ భక్త సంఘ కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

జనక పుత్రాత్మ ధ్యానం - నరాళి జగతి చేయు తీర్మానం జనక పుత్రాత్మ ధ్యానం - జగతి చేయు తీర్మానం - నెనరు దెచ్చు సంధానం నీనా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్
DOWNLOAD MP3 SONG HERE 👇

28 November 2021

Sthuthiyu mahimayu neeke | స్తుతియు మహిమయు నీకే

572
ఔదార్యము
రా - కాంభోజి, తా - రూపకము

స్తుతియు మహిమయు నీకే - క్షితికిన్‌ దివికిన్‌ నీటి - వితతికిన్‌ కర్తవై - వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు - హితుడా మా ప్రేమ నీ - కెట్లు చూపుదును ||స్తుతియు||

1.పసిడి వర్ణపుటెండ - భాగ్యధారల వాన - విసరు మంచిగాలి - విరియు పుష్పములు = రసమొల్కు పండ్లు నీ - రమ్య ప్రేమన్‌ చాటున్‌ - ప్రసరించు కోతలో - ఫలనుందు వీవు ||స్తుతియు||
 
2.నెమ్మదిగల యిండ్లు - నిజ సౌఖ్య కాలములు - ఇమ్మహి ఫలియించు - నైశ్వర్యాధికముల్‌ = ఇమ్ముగ గలిగిన - హృదయులమై వందనమ్ములు ఋణపడి - యున్నాము నీకు ||స్తుతియు||
 
3.దురితంబు లొనరించి - దౌర్భాగ్య స్థితి నున్న - ధరణికి నీ పుత్రున్ - ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ - వరము లమర్చిన - పరమోపకారి ||స్తుతియు||
 
5.జీవంబు ప్రేమను - జేవఁ గల్గించెడు - పావనాత్మను మాకై - పంపితివి = దీవెన లేడు రె - ట్లావరింపను మమ్ము - నీ విమలాత్మ వా - నిని గుమ్మ రించు ||స్తుతియు||
 
6.నరులకు విమోచ - నము గల్గె పాపంబుల్ - పరిహార మాయెఁ గృ - పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు -  స్ధిరమాయె మేము నీ - కొరకేమి తేగలము - పరిపూర్ణ జనకా ||స్తుతియు||
 
6.మాకై వాడుకొనెడి - రూకల్‌ వ్యర్ధంబగును - నీకై యప్పుగనిచ్చు - నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య - శ్రేష్ఠ ధన నిధియై పై - లోకంబు నందుండు - లోపంబు లేక ||స్తుతియు||
 
7.జీవంబు వస్తువులు - శ్రేయస్సు దాన స్వ - భావంబు శక్తియు - భాగ్యంబులు = నీ వలననే లభ్యమై వెలయుచున్నవి - నీ వాసమే మాకు - నిత్యానందంబు ||స్తుతియు||
                             - ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

08 January 2021

Nannu diddumu chinna | నన్ను దిద్దుము

325
పాపి మరలుట
(ఛాయ: భీకరుండౌ మా యెహోవా)
రా - కమాను,  తా - త్రిపుట

నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా =నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయనా ||నన్ను||

1.దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా =నేను కారు మూర్ఖపు పిల్లనై - కారడవి దిరిగితి నాయనా ||నన్ను||

2.మంచి మార్గము లేదునాలో - మరణ పాత్రుడనాయనా =నేను  వంచితుండ నైతిని ప్ర - పంచ మందున నాయనా ||నన్ను||

3.చాలామారులు తప్పిపోతిని -మేలు గానక నాయనా =నా చాలా మొఱ్ఱల నాలకించుము - జాలిగల నా నాయనా||నన్ను||

4.జ్ఞానమంతయు బాడుచేసి - కాననైతిని నాయనా నీవుజ్ఞానము గల తండ్రి వంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||

5.కొద్ది నరుడను దిద్ది నను నీ - యెద్ద జేర్చుము నాయనా =నీ యొద్ద జేర్చి బుద్ధిచెప్పుము - మొద్దు నైతిని నాయన ||నన్ను||

6.ఎక్కడను నీ వంటి మార్గము - నెఱుగ నైతిని నాయనా= నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను||

7.శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా=యె న్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను||

8.వాసిగా నే బాపలోకపు - వాసుడ నో నాయనా= నీ - దాసులలో నొకనిగా నను - జేసి కావుము నాయనా ||నన్ను||
                             - ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

02 August 2020

Deva samsthuthi cheyave | దేవ సంస్తుతి చేయవే

12
యెహెూవా దేవుని స్తుతి
(103 – వ దావీదు కీర్తన)
రా - ఆనందభైరవి,  తా - ఆది

  దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ - మంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా = దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని - పావన నామము నుతించుమా - నా యంతరంగము - లో వసించు నో సమస్తమా ||దేవ||

1.జీవమా, యెహోవా నీకుఁ - జేసిన మేళ్లన్ మరవకు = నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు - లేవియున్ లేకుండఁ జేయును - కారణముచే ॥దేవ॥

2.చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను - జీవ కిరీటముగ వేయును - నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||

3.యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనె క్రొత్త = యౌవనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు - భావమును సంతుష్టిపరచునుగా - కారణముచే ॥దేవ॥

4.ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయ మిచ్చున్ = విభుండు మార్గము తెలిపె, మోషేకుఁ - దన కార్యములను - విప్పె నిశ్రా యేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||

5.అత్యధిక ప్రేమ స్వరూపి - యైన ధీర్ఘ శాంతపరుండు - నిత్యము వ్యాజ్యంబు చేయఁడు - ఆ కృపోన్నతుఁడు - నీ పయి నెపుడు కోప ముం చఁడు - ఆ కారణముచే ॥దేవ॥

6.పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు = భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ॥దేవ॥

7.పడమటికిఁ దూర్పెంత యెడమో - పాపములకును మనకు నంత = యెడము కలుగజేసియున్నాఁడు - మన పాపములను - ఎడముగానే చేసియున్నాఁడు - ఆ కారణముచే ||దేవ||

8.కొడుకులపైఁ దండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల = యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల - యెడల జాలిపడును దేవుండు - కారణముచే ॥దేవ॥

9.మనము నిర్మితమయిన రీతి - తనకుఁ దెలిసియున్న సంగతి = మనము మంటి వారమంచును - జ్ఞాపకముచేసి - కొనుచు కఱుణ జూపుచుండును - ఆ కారణముచే ॥దేవ॥

10.పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన - వాస పుష్పము వలెనె నరుఁడుండు - నరు నాయువు తృణ - ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ॥దేవ॥

11.పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితోఁ గైకొను జనులకు = నిరతమును గృప నిలిచి యుండునుు - యెహోవా నీతి - తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ॥దేవ ॥
                            - ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

14 July 2020

Yentha goppa bobba puttenu | ఎంత గొప్ప బొబ్బపుట్టెను

207 
సిలువ మరణము
రా - పంతువరాళీ, తా - అట

ఎంత గొప్ప బొబ్బపుట్టెను - దానితో రక్షణ మంతయును సమాప్త మాయెనుు = ఎంత గొప్ప బొబ్బపుట్టెను - యేసునకు కల్వరి మెట్టను సంతసముతో సిల్వగొట్టగ - సూర్యుడంధకార మాయెను ||ఎంత||

1. గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు = పలుకు భాషయు నొక్కటైనను - పలు విధములగు భాషలాయెను - నలు దెసలకును జనులు పోయిరి - కలువరి పై కలిసికొనిరి ||ఎంత||

2. పావనుండగు ప్రభువు మన కొఱకై - యా సిలువ మీద చావునొందెడు సమయ మందున = దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి యనియా - రావముగ మొఱ బెట్టెను యె - హోవయను దన తండ్రి తోను ||ఎంత||

3. అందు దిమిరిము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు = నిందవాయువు లెన్నో వీచెను - కందు యేసుని యావరించెను - పందెముగ నొక కాటువేసెను - పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||

4. శాంతమాయె నటంచు బలుకుచును - ఆ రక్షకుడు తన - స్వంత విలువగు బ్రాణమును వీడెన్ = ఇంతలో నొక భటుడు తనదగు - వీటితో ప్రభు ప్రక్క బొడువగ - చెంత జేరెడి పాపులను ర - క్షించు రక్తపుధార గారెను ||ఎంత||
                – ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

04 June 2020

Thanuvu naa didigo | తనువు నా దిదిగో

440
స్వసమర్పణము
రా - యాదుకులకంభోజి, తా - త్రిపుట

  తనువు నా దిదిగో గై - కొనుమి యో ప్రభువా నీ - పనికి బ్రతిష్టించుమీ = దినములు క్షణములు - దీసికొని యవి నీదు - వినతిన్ బ్రవహింప జే - యను శక్తి నీయుమీ ||తనువు||

1.ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పని చేయ జేతు లివిగో = యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు - దనముతో బరు గెత్త - వినయ పాదము లివిగో  ||తనువు||

2.స్వర మిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము = మరియు పెదవు లివిగో - మహనీయ మైన నీ - పరిశుద్ధ వార్తతో - బరి పూర్ణముగ నింపు ||తనువు||

3.వెండి పసిడి యివిగో - వీస మైనను నా కై - యుండ వలె నని కోరను = నిండైన నీ యిష్ట - నియమంబు చొప్పున - మెండుగ వాడ బరి - మితియౌ జ్ఞానం బిదిగో  ||తనువు||

4.నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా యిష్టమిక  గాదది =  నా యిచ్ఛ యున్నట్టి - నా హృదయ మిదిగో నీ - కే యియ్యది రాజ - కీయ సింహాసనమా ||తనువు||

5.ఉన్న నా  ప్రేమ నీ - సన్ని ధానమున నే - నెన్నడు ధార వోయన్ - నన్ను నీ వానిగ - నాధా గైకొను మపుడు - చెన్నుగ నీ వశమై - స్థిరముగ నుండెద ||దనువు||
ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

03 June 2020

Neeve yani nammika | నీవే యని నమ్మిక

145
 యేసే మార్గము
రా - మోహన,  తా -మిశ్రచాపు

నీవే యని నమ్మిక - యేసు నాకు - నీవే యని నమ్మిక -  నీవే మార్గంబు - నీవే సత్యంబు - నీవే జీవంబు - నీవే సర్వంబు || నీవే ||

1.పెడదారిని బోవగ - నామీదికి - ఇడుమ లెన్ని యొ రాగ = అడవిలోబడి నేను - ఆడలుచు నుండగ - తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు ||నీవే||
 
2.కారు మేఘము పట్టగ - నా మనస్సులో - కటిక చీకటి పుట్టగ = ఘోరా పదలు చేరి - దారియని భ్రమపడగ - తేరిచూడగల్గు - తేజోమయ మార్గంబు ||నీవే||
 
3.లేనిపోని మార్గంబులెన్నో యుండ - జ్ఞానోపదేశంబు = మానుగ జేయుచు - వానిని ఖండించి - నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు ||నీవే||
 
4.నరలోకమునుండి పరలోకంబు - వరకు నిచ్చెనగా నుండి = నరులకు ముందుగ - నడచుచు ముక్తికి - సరిగా కొనిపోవు సు - స్థిరమైన మార్గంబు॥నీవే|| 
 - ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

01 June 2020

Naakemi koduva naadudunda | నాకేమి కొదువ

14
యెహోవా నా కాపరి
(23 - వ దావీదు కీర్తన)
రా – సావేరి,  తా – త్రిపుట

నాకేమి కొదువ - నాధుడుండ నింక = శ్రీకరుండగు దేవుడే నా - శ్రేష్ఠ పాలకుడు - నా - యేక రక్షకుడు గనుక ||నా కేమి||

1.తనివి దీరన్ మే - ళ్లనుభవింప - నేను = నను సదా మేళ్లనెడి పచ్చిక - నదిమి మృదువుగ - బండు - కొన జేయును గనుక ||నాకేమి||

2.ఎంత శోధన - యెండ యున్న = నాకు నెంతకు నోరిగర దెపుడు - శాంత జలములు - నా - చెంతనే యుండున్ గనుక ||నాకేమి||

3.తప్పిపోయిన నన్ - దారిం బెట్టి - నన్ను = తెప్పరిల్ల జేసి నాకు దీరు నలసటను - నా - తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||

4.నీతి మార్గమునన్- నిల్పున్ నన్ను - ప్రభువు = నీతి లేని నాకు దన సు - నీతి దయచేయున్ - స్వ - నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||

5.చావు చీకట్ల - శక్తి యుండు - ఆహా = లోయలో బడి పోవలసినను - నే వెరవకుందు - నా - దేవుండే తోడు గనుక ||నాకేమి|| 

6.మీద బడునట్టి - శోధనలన్ - ధరను = నా దరికి రానీక దండము - నన్ను బ్రోచుచును - నా - కాదరణ యౌను గనుక ||నాకేమి|| 

7.పగ వారల్ సిగ్గు- పడునట్లుగ - నా = జగము యెరుగని  సౌఖ్య భో - జన మగపరచును - హా - తగిన దే పెట్టున్ గనుక ||నాకేమి||

8.తన యాత్మానంద - తైలంబుతో - ప్రభువు = నను దినము తలయంటి విసుగు - కొనక తుడుచును - నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||

9.పలువిధములైన భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగ వెడలునట్టి - వెల గల గిన్నె - నా - కలిమిగా జేయున్ గనుక ||నాకేమి||

10.బ్రదుకంతటన్ గృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గ - నా - పదలు సంపదలౌ గనుక ||నాకేమి||

11.దురితంబు లుండు - ధరణి నాకు నిజము = నిరవు కాదిక నెప్పటికి నా - పరమ దేవుని - మం - దిరమె నా యిల్లు గనుక ||నాకేమి||
  - ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

30 May 2020

Naakintha Protsaha | నా కింత ప్రోత్సాహా

348
క్రీస్తునందలి నా యానందము
రా - కళ్యాణి, తా - త్రిపుట
(చాయ: దారుణమగు మరణ)

నా కింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట - కే కర్త ఘనమైన - హేతువై యుండు = నాకు గల యున్నత కతమ్మే - నాధుఁ డగును నేను మురియు - శ్రీకరంబగు నామ మేది - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

1.ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కలిపిరి - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥ 

2.నేను నా విధు లెల్ల - నిశ్చయంబుగ నెఱుఁగ - జ్ఞాన మిచ్చుచునుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యధార్థ - పరునిగాఁ గావించి యవినా - చే నెరవేర్పించు నెవరు - సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

3.ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - యెవరు నా శోకంబు - నెగురం గొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్ఛను - నీడ్చి సేదను దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥ 

4.మరణంబులో నాకుఁ - జిర జీవ మెవ్వారు - మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు = విరివిలేని మహిమ సేలు - దరిని నుండఁగ నన్నుఁ జెంతను - స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వఁబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥

5.నన్ను రక్షింప మర ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న ప్రభునందు = నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును - చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు - సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥
-   ముంగమూరి దేవదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...