Showing posts with label జక్కి దేవరాజ్. Show all posts
Showing posts with label జక్కి దేవరాజ్. Show all posts

26 August 2021

Ninnu Vembadincheda Nee Kaadi | నిన్ను వెంబడించెద నీ కాడి

నిన్ను వెంబడించెద – నీ కాడి మోయుదున్
నీదు పాదముల చెంత – నే నేర్చుకొందును (2)
మాదిరి నీవే – నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా (2) ||నిన్ను||

పాపాంధకారం లో నుండి – రక్షించి వెలిగించితివి (2)
పరిశుద్ధమైన పిలుపుతో – నీ వెంబడి రమ్మంటివి (2)
నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను||

లోకాశలన్ని నీ కోసం – నేనింక ఆశించను (2)
లోపంబులేని ప్రేమతో – నీ కోసం జీవింతును (2)
నీ కోసం జీవింతును ||నిన్ను||

పవిత్రపరచుకొందును – అర్పించు కొందును (2)
కష్టాలు శ్రమలు రేగినా – నిను వీడిపోనయ్యా (2)
నిను వీడిపోనయ్యా ||నిన్ను||

ప్రేమ సువార్త ప్రకటింప – భారంబు మోపితివి (2)
సత్యమార్గంబు చాటగ –పంపుము నా ప్రభువా (2)
పంపుము నా ప్రభువా ||నిన్ను||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...