Showing posts with label చార్లెస్ వెస్లీ. Show all posts
Showing posts with label చార్లెస్ వెస్లీ. Show all posts

23 April 2022

Kreesthu nedu lechenu aa aa aa| క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ

222 
Christ the Lord is Risen Today

1.క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ.

2.మోక్ష మియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుఁడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ 
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ.

3.బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ 
అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ 
గెల్చి ముక్తిఁ దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ.

4.క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారిఁ బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ.

5.యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ
యేసుఁడుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ 
మేము కూడఁ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ.

6.భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ 
మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ 
నీదె నిత్యజయము ఆ ఆ ఆ హల్లెలూయ.
                        – చార్లెస్ వెస్లీ
                  అను: జాన్ అబెర్లీ

20 August 2021

Daiva prema prudhviloni | దైవ ప్రేమ పృథ్విలోని

66
Love Divine, all love excelling

1.దైవ ప్రేమ పృథ్విలోని - యన్నిటిని మించును 
యేసు మాలో నివసించు - యది మా విముక్తియే 
నీ కమూల్య ప్రేమ యుండు - నీవు దాసుల మైన మమ్ముఁ 
గృపతో రక్షించుము.

2.మమ్ము సంరక్షించు శక్తి- నీకుండు,మా ప్రభువా 
ఎన్నఁ డెన్నఁ డేని నీదు - సన్నిధిని బాయుము 
నిన్ స్తుతించుచుండి మేము - సర్వదా సేవింతుము 
నిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ - మే మతిశయింతుము.

3.క్రొత్తగా మమ్ముసృజించి- పాప మెల్లఁ బాపుము 
మాకు స్వస్థత నొసంగి - గొప్ప రక్షఁ జూపుము 
భక్తి యభివృద్ధి పొంది - స్వర్గమందుఁ జేరగా 
వింత నొంది ప్రేమ స్తుతి - నీకర్పింతు మెప్పుడు
 - చార్లెస్ వెస్లీ
అను : ఎచ్ . హెన్రీ డేవిడ్

16 August 2021

Nrupaa Vimochaka Prabhu | నృపా విమోచకా ప్రభూ వేలాది

39 
O for a thousand tongues to sing

1.నృపా ! విమోచకా ! ప్రభూ - వేలాది నోళ్ల నీ -
 కృపా జయప్రభావముల్ - నుతింతు నెంతయున్

2.కృపాధికార ! దేవ ! నీ - సాయంబు జేయుమా
 భవత్ర్పభావ కీర్తులన్ - జాటంగ నెల్లడన్

3.భయంబు చింతఁ బాపును - హర్షంబు పాపికి
 సౌఖ్యంబు జీవశాంతులు - నీ నామ మిచ్చును

4.విముక్తి జేయు ఖైదిని - పాపంబు బాపును
 పాపాత్ము శుద్ధుజేయును - శ్రీయేసు రక్తము

5.జనాళి ! పాపు లెల్లరు -  శ్రీయేసున్ నమ్ముఁడి
 కృపావిముక్తులందుఁడి - సంపూర్ణ భక్రక్తమ

6.అర్పించె యేసు ప్రాణమున్ - నరాళిఁగావను
 యజ్ఞంపు దేవు గొఱ్ఱెపై - నఘంబు వేయుఁడి

7.సత్కీర్తి స్తోత్ర ప్రేమల - నభాన భూమిని 
సర్వత్ర దేవుఁడొందుగా - సద్భక్త పాళిచే
                                          - చార్లెస్ వెస్లీ

Sarvesha rammu nee Sannidhi | సర్వేశా రమ్ము నీ సన్నిధి కాంతి

34   
Come,Thou Almighty King

1.సర్వేశా ! రమ్ము నీ - సన్నిధి కాంతి నొ -
సంగు మాకు - సత్య సనాతన -
సర్వాధికారుఁడా - సదా మమ్మేలుము- సర్వోన్నతా!

2.నిత్యంపు వాక్యమా ! - నీదగు ఖడ్గము -
నిమ్ము మాకు - నీ నిజ భక్తులన్ - 
నీ వాక్య ప్రియులన్-  నింపు నీ యాత్మతో- నింపు మీర

3.రమ్ము మహాత్మ ! మా - కిమ్ము నీ యాత్మను -
రమ్ము వేగ - రక్తితో నిప్పుడు -
రమ్ము మా మధ్యకు- రక్షించు మమ్మును- రంజిల్లఁగన్

4.స్తోత్రం పవిత్రుఁడా !-  స్తోత్రంబు త్ర్యేకుండా - 
స్తోత్రం సదా - ధాత్రి నీ మహిమ - 
నేత్రంబులు గను - మీ, “త్రాహిమాం” యని - వేఁడు వారిది.
                                  - చార్లెస్ వెస్లీ
                     అను: ఒంగోలు దావీదు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...