Showing posts with label Neevu na thodu unnavayya. Show all posts
Showing posts with label Neevu na thodu unnavayya. Show all posts

06 May 2023

Neevu na thodu unnavayya | నీవు నా తోడు ఉన్నావయ్యా


నీవు నా తోడు ఉన్నావయ్యా - నాకు భయమేల నా యేసయ్యా 
నీవు నాలోనే ఉన్నావయ్యా  - నాకు దిగులేల నా మెస్సయ్యా 
నాకు భయమేల.. నాకు దిగులేల.. నాకు చింతేల.. నాకు భీతి ఏల ||నీవు||

1.కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు -
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) 
అడిగిన వారికి ఇచ్చేవాడవు -
వెదకిన వారికి దొరికేవాడవు (2) 
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) 
దేవా దేవా నీకే స్తోత్రం (4)

2.వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు -
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) 
నేనే సత్యం అన్న దేవా -
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...