Showing posts with label telugu christian songs. Show all posts
Showing posts with label telugu christian songs. Show all posts

24 May 2025

Namo yesu naadha నమో యేసునాధా నాధా


నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత

సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||

1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ
వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||

2. ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా
పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||

3. సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను
మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||

04 August 2024

Santhoshinpare priyulara సంతోషింపరె ప్రియులారా

349 
రక్షణానందము 
(చాయ: ఎంతో సుందరమైనవి)
రా - కళ్యాణి, తా - త్రిపుట 

సంతోషింపరె ప్రియులారా - యేసుని చెంత - సంతసింపరె మనసార = ఎంతో ప్రేమించి య - నంతు డొసగెను సుతుని - వింతగ బ్రతుకువ - సంత శోభను దాల్చె = అంతరంగములో వసించిన - చింత లెల్లను వాడ బారెను -  గంతు లిడుచును నూత్నజీవ ¹ల - తాంతములు పూయంగ దొడగెను ||సంతో||

1.సిలువలో వలరారిన - యేసునిప్రేమ - ఫలియించె హృది వనమున = కలుష మెల్లను బాపు -- కలువరిలో భక్తి - పలవులు చిగిరించి - చెలుని పాద పద్మములు = అలుముకొని యా రాధనంబున - మలయ మారుత వీచికలపై - మలపు గొనుచు సమర్పణంబును సులలితముగా జేయ దొడగెను ||సంతో||

2.పాపతాపము తొలగెను - జీవితపు తు-ఫానులన్నియు నణగెను = ప్రాచీన సర్పము - పగబట్టి పడగెత్తి - పంతమున ననుడాసి - పటువున కఱవంగా = పాప మరణపు విఱుగుడగునా - ప్రభుని యమృత రక్తసారము - ప్రాణ భిక్షను బెట్టెను మరి - పగతుని యోడించె న హాహా ||సంతో||

3.యాత్ర పథమున యేసుడు - ప్రకాశింప రాత్రియె - పగలాయెను = నేత్రములు వికసింప - ధాత్రి నా బసలోప - విత్ర వాక్యములో వి-చిత్ర కృపలను గాంచి = గాత్ర వీణను మీటి దేవుని - స్తోత్ర గీతము పాడి పుణ్య - క్షేత్ర పథమున బోవ యేసుడు - మిత్రుడై నడిపింప దొడగెను ||సంతో||

4.సిరిసంపదలు యున్నను - లేకున్నను - కఱుణావరములు తరుగవు = పైరు పంటలు గాని - పరువు ప్రతిష్టలు - కఱువైనగానినే మురియుదు మదిలోన = గిరులపైనను - పరుగు లిడుటకు ⁴హరిణ పాదము లొసగె యేసుడు వెఱతునా చింతింతునా క - ల్వరిని ప్రేమలు కురియుచుండగ ||సంతో||
- ఏ. బి. మాసిలామణి
________________________________
¹పూవులు. ²గాలికెరటములపై. ³అడుచు. ⁴లేడి 

11 September 2022

Entha pedda poratamo | ఎంత పెద్ద పోరాటమో

ఎంత పెద్ద పోరాటమో - అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము - విజయమనేది తథ్యము (2)

వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||

యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత|

12 June 2022

Vandanam triyekuda ghana | వందనం త్రియేకుడా ఘన

వందనం త్రియేకుడా - ఘన మహిమ నీకెగా (2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే ||వందనం||

1.ఈవులె-న్నెన్నో దయచేసితివి - నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (2)
నీ పాద సేవ చేయుటకన్నా - విలువైన భాగ్యం లేదు (2) నాకూ ||వందనం||

2.అవసరతలు ఏవైన తీర్చెడి - యెహోవా యిరే నీవే (2)
నా కోరికంతా ఏ క్షణ మైనా - నీవేగా నా యేసూ (2) ఆమెన్ ||వందనం||

3.మా సర్వమంతా నీవే నయ్యా - నీకే గా అంకితం చేసితిమీ (2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా - నీ ఆజ్ఞ పాటించెదమూ (2) స్తోత్రం ||వందనం||

16 April 2022

Moodunalla Muchata Kosam | మూడునాళ్ళ ముచ్చట కోసం

మూడునాళ్ళ ముచ్చట కోసం - ఈ మనిషి పడే తపన చూడరా (2)
నీటిబుడగలాంటి జీవితం - ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)

మనిషికి తన మనసే చేరసాలరా - మమతలు మమకారాలు బంధాలురా (2)
వల్లకాటి వరకేరా భవబంధాలు - నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
కల్లలైన కళలు మానుకో - ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ||

ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము - అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం - అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)
నిత్యమైన సుఖము వెదకరా - నిరతము ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||

తప్పిదములు దాచువాడు వర్దిల్లడు - అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)
జిగటగల ఊభినుండి పైకి లేపి - నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)
తీర్పు తీర్చబడకమునుపే - తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||

08 April 2022

Sthuthi simhasanaseenuda | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - అత్యంత ప్రేమామయుడా (2)
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా (2)
ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే (2)
 
1. ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త - బలవంతుడగు దేవా - నిత్యుడగు తండ్రి (2)
సమాధాన కర్తయగు అధిపతి నీవే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే. (2)
ఆరాధనా నీకే (2)
 
2. మా రక్షణకర్త మారని మా దేవా - మాలోన వసియించు  మహిమా స్వరూప (2)
మహిమా ఘనతా ప్రభావము నీకే.. ఆరాధన నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే (2) ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

06 November 2020

Raja Jagamerigina Na Yesu | రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన 
మన బంధము అనుబంధము - విడదీయగలరా
ఎవరైనను మరి ఏదైనను.                  
                                                        ||రాజ||
1. దీన స్థితియందున - సంపన్న స్థితియందున 
    నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే 
    నిత్యము ఆరాధనకు నా ఆధారమా 
    స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా      
                                                        ||రాజ||
2. బలహీనతలయందున- అవమానములయందున
    పడినను కృంగినను - నీ కృపకలిగి యుందునే 
    నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా        
                                                       ||రాజ||
3. సీయోను షాలేము - మన నిత్య నివాసము
    చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే
    నిత్యము ఆరాధనకు నా ఆధారమా 
    స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా      
                                                      ||రాజ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...