Showing posts with label అలల పైనే నడచినా. Show all posts
Showing posts with label అలల పైనే నడచినా. Show all posts

14 March 2025

Alala paine nadachina అలల పైనే నడచినా నాదు యేసయ్యా

అలల పైనే నడచినా నాదు యేసయ్యా- ఆదు కోవయ్యా ..(2)
గలిబిలిని నా కలవరములను – తొలగచేసిన కలుషహరుడా (2)
నాదు యేసయ్యా… ఆదు కోవయ్యా… నాదు యేసయ్యా

1.శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2)
ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా ||ఆదు||

2. నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను (2)
గట్టుచూడగా చాల దూరము – ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని ||ఆదు||

3. అలలు నాపై విసరి కొట్టగా – నావ నిండుగా నీరు చేరెను (2)
బ్రతుకులెంతో భారమాయెను – రేవు చేరే దారి లేదా ||ఆదు||

4. మాట మాత్రపు సెలవు చేత – సూటిగా అద్భుతములెన్నో (2)
చాల చేసిన శక్తి మంతుడా – జాలి చూపి మమ్ము బ్రోవుమా ||ఆదు||

5. చిన్న జీవిత నావ నాది – నిన్నేగురిగా పయనమైతిని
ఎన్నోశోధన లెన్నో భయములు – కన్నతండ్రి కానరావా ||ఆదు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...