Showing posts with label Ayyo Idi Dukhamu Prabhu lyrics. Show all posts
Showing posts with label Ayyo Idi Dukhamu Prabhu lyrics. Show all posts

27 May 2021

Ayyo Idi Dukhamu Prabhu | అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ

అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ 
నయ్యో యిది యెంత దుఃఖము 
చయ్యన యెహోవా సింహా సనము చుట్టు 
వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు 
దురాత్మల కగు నిత్య ఖేద  ||మయ్యో||

1.తల్లి పిల్లలు గూడుదు రచట దండ్రి తాత లచట
గలియుదు రెల్ల కాల మటుల నుండ
కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||

2.అన్నదమ్ములచట డ్గూడుదురు రక్క సెలియలందు
గలియుదు రెన్నడు మరి చూడ రాని
యెడగల స్థలములకు బోదు  ||రయ్యో||

3.భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు 
కలియుదురు రందు కార్య భేదమువలన
సర్వ కాలము మరి కూడజాల||రయ్యో||

4.క్రీస్తు మత ప్రబోధకులు సమస్త శిష్యులు
కూడుదు రచట వాస్తవ స్థితు లెరుగబడిన
వలనను విడబడుదు రంద ||రయ్యో||

5.శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతులందు
గలియుదు రిష్టము గాని భిన్నులగుచు
నిక మరి యెన్నటికి గూడ ||రయ్యో||

6.అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు
భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక
బాధల పాల్బడక పోరు ||అయ్యో||

7.సాధు సజ్జనంబు లెల్ల సకల దూతల తోడ
గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి
నిత్యులగుదు రాహా యిది యెంత విజయము
ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...