Showing posts with label 040 శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్త. Show all posts
Showing posts with label 040 శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్త. Show all posts

17 August 2021

Shudhi Shudhi Shudhi Sarvashaktha | శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్త ప్రభు

40
Holy, Holy, Holy, Lord God Almighty

1.శుద్ధి, శుద్ధి, శుద్ధి ! సర్వశక్త ప్రభు 
ప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుము 
శుద్ధి, శుద్ధి, శుద్ధి ! కృపగల దేవా ! 
ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా !

2. శుద్ధి , శుద్ధి , శుద్ధి ! అని పరమందుఁ 
బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు 
శెరపుల్ ఖెరూబులు సాష్టాంగపడి 
నిత్యుఁడవైన నిన్ నుతింతురు .

3. శుద్ధి , శుద్ధి , శుద్ధి ! తేజరిల్లు దేవ 
పాపి కన్ను చూడలేని మేఘ వాసివి 
అద్వితీయ ప్రభు , నీవు మాత్రమేను 
కరుణ , శక్తి , ప్రేమరూపివి .

4. శుద్ధి , శుద్ధి , శుద్ధి ! సర్వశక్త ప్రభు 
సృష్టి జాలమంత నీ కీర్తిఁబడును 
శుద్ధి , శుద్ధి , శుద్ధి ! కృపగల దేవ 
ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా !
– రెజినాల్డ్ హెబర్ 
  అను : జేకబ్ చేంబర్లేన్.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...