Showing posts with label 133 ఓ బెత్లెహేము గ్రామమా. Show all posts
Showing posts with label 133 ఓ బెత్లెహేము గ్రామమా. Show all posts

29 April 2022

O bhethlehemu graamama | ఓ బెత్లెహేము గ్రామమా

133  
O Little Town of Bethlehem

1.ఓ బెత్లెహేము గ్రామమా! - సద్దేమిలేకయు 
నీవొంద గాఢనిద్రపై - వెలుంగు తారలు 
కానేమి, నిత్యజ్యోతి - జ్వలించు నీతమిన్ 
పెక్కేండ్ల భీతివాంఛలీ - రాత్రి తీరె నీలోన్

2.మరియకేసుపుట్టెను - నిద్రింప మర్త్యులు 
పై గూడి దూతల్వింతయౌ - ప్రేమన్వీక్షింతురు - 
చాటుడో వేగుచుక్కల్ - ఈ శుద్ధజన్మము 
దైవానకు నున్నతుల్ భువిన్ - శాంతంచు పాడుడీ

3.సద్దేమి లేక వెచ్చగా! - ఈ వింత దానము 
ఆరీతి దేవుడిచ్చుపై - వరాల్ నరాళికి
నరుండెరుంగకున్నన్ - ఈ పాపధాత్రిలో
దీనులంగీకరించిన - యేసుందుజొచ్చును

4.ఓ బెత్లెహేము పావన - వత్సా! మా పై దిగు 
పోగొట్టి పాపముల్ మాలో - నీ వేళ పుట్టుము 
సువార్త క్రిస్మస్ దూతల్ - చెప్పంగ విందుము 
మా యొద్ద నుండరమ్ము మా - 
ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.
                      – ఫిలిఫ్ బ్రూక్స్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...