Showing posts with label rajulaku rajaina ee lyrics. Show all posts
Showing posts with label rajulaku rajaina ee lyrics. Show all posts

14 July 2020

Rajulaku rajaina ee | రాజులకు రాజైన యీ

181
క్రీస్తుని శ్రమల ధ్యానము
రా - కాంభోజి,  తా - రుపకము

రాజులకు రాజైన యీ - మన విభుని - పూజసేయుటకు రండి = యీ జయశాలి కన్న - మన కింక - రాజెవ్వరును లేరని ||రాజులకు||
 
1.కరుణగల సోదరుండై - యీయన - ధరణి కేతెంచె నయ్యా = తిరముగా నమ్ముకొనిన - మన కొసఁగుఁ - బరలోక రాజ్యమ్మును ||రాజులకు||
 
2.నక్కలకు బొరియ లుండె - నాకాశ - పక్షులకు గూళ్లుండెను = ఒక్కింత స్థలమైనను - మన విభుని - కెక్కడ లేకుండెను ||రాజులకు||
 
3.అపహాసములు సేయుచు - నాయన - యాననము పై నుమియుచుఁ = గృప మాలిన సైనికు - లందరును - నెపము లెంచుచుఁ గొట్టిరి ||రాజులకు||
 
4.కరమునం దొక్క రెల్లు - పుడకను - దిరముగా నునిచి వారల్ = ధరణీపతి శ్రేష్ఠుడా - నీకిపుడు - దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||
 
5.ఇట్టి శ్రమలను బొందిన - రక్షకునిఁ - బట్టుదలతో నమ్మిన = అట్టహాసముతోడను - బరలోక - పట్టణంబున జేర్చును ||రాజులకు||
 
8.శక్తిగల రక్షకుండై - మన కొరకు - ముక్తి సిద్ధముఁ జేసెను = భక్తితోఁ బ్రార్థించిన - మనకొసగు - రక్తితో నాముక్తిని ||రాజులకు||  

7.త్వరపడి రండి రండి - యీ పరమ - గురుని యొద్దకు మీరలు = దరికిఁ జేరిన వారిని - యీ ప్రభువు - దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు||
- ఎస్ . జేమ్సు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...