Showing posts with label Natho neevu matladinacho. Show all posts
Showing posts with label Natho neevu matladinacho. Show all posts

23 December 2021

Natho neevu matladinacho | నాతో నీవు మాట్లాడినచో

నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా - నా హితుడా
నా ప్రాణనాధుడా - నా రక్షకా ఆ.. ఆ.. ఆ..

తప్పిపోయినను తరలి తిరిగినను
దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఒక్కమాట చాలు (3) ప్రభో ఆ.. ఆ..

చచ్చియుండి నేను చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్
కానలేదు నిన్ను కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నియాన్
ఒక్కమాట చాలు (3) ప్రభో ఆ.. ఆ..

యుద్ధమందు నేను మిద్దిమీద నుండి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి వీడినాను హద్దు మీరినను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
 ఒక్కమాట చాలు (3) ప్రభో ఆ.. ఆ..

కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను
వీడె నీదు ఆత్మ వీడె నీదు స్నేహం
గుడ్డి వాడనైతి తిరుగాలిసురుచుండి
దిక్కు లేకనే నీ దయను కోరుచుంటి
 ఒక్కమాట చాలు (3) ప్రభో ఆ...ఆ..

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...