Showing posts with label Bro. Anil Kumar. Show all posts
Showing posts with label Bro. Anil Kumar. Show all posts

02 November 2022

Parakramamu gala baladyuda| పరాక్రమము గల బలాడ్యుడా

పరాక్రమము గల బలాడ్యుడా

పరాక్రమము గల బలాడ్యుడా ..... 
నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
అరె దేనిని గూర్చి భయపడకు... 
భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ
హే దహించు అగ్నైన నీ దేవుడే - నీ ముందు వెళ్తుంటే భయమెందుకు
నీ కంటే బలమైన ఆ జనములు - నీ ముందు నిలువలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం -  స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

1.నీ వలని భయమును ప్రతి జనమునకు 
నీ ప్రభువు పుట్టించెను ...ఊ
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు లోపరచి ఎలేయను
అరె ఈ దేశ వైశాల్యమంతా నువడుగు వేసే ప్రభు జండా స్థాపించను ను ను
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ...

2.దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును ... ఊ
పాడైనదాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును హూ
తన రాజ్య మకుటంగా తన రాజ్య దండంగా ప్రభు నిన్ను నియమించెను
శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ను ను
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా ..ఆఅ ఆ..

3.నీ కొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతము గుండెను ..ఊ
నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చెయించును హూ
గుడార స్థలములను విశాలపరచింక కుడి ఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును ను ను
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా....ఆఅ ఆ...

4.ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దు లేర్పరచెను ... ఊ
సరిహద్దులలో నీకు సమాధానం ప్రభువెపుడు కలిగించును
గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును
ఏ కీడు రాకుండా తన చెయ్యి తోడుంచి అభివృద్ధి కలిగించును ను ను
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా....ఆఅ ఆ...

5.అనేక జనములకు ప్రభు నిన్ను దీవేనగా నియమించెను
సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును
ఆకాశ ధననిధిని ప్రభు తెరచి ఎల్లపుడు సమృద్ది నీకిచ్చును
తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును ను ను
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా.....ఆఅ ఆ.. 
నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే
అరె దేనిని గూర్చి భయపడకు... 
భయపడకు.. హూ.. హూ భయపడకు...ఊ భయపడకు...ఊ
హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు
నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం - స్వాధీనం ఓ... హో .. 
స్వాధీనం ఓ హో ఓ హో - స్వాధీనం ఓఓ ... ఓ ఓ
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ - టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్
పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ

DOWNLOAD MP3 SONG HERE 👇

02 January 2022

Sarva Shareerula Devudaa | సర్వ శరీరుల దేవుడా

సర్వ శరీరుల దేవుడా - నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో - భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే

లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల||

ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా||

అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||

మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా||

గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా||

దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా||

నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా||

యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా||

యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా||

కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా||

పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...