Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

04 June 2026

పాపులకు సఖుండు మన ప్రాపు Paapulaku sakhundu mana prapu

293
పాపుల స్నేహితుడు
రా - మోహన, తా - ఏక 

పాపులకు సఖుండు - మన ప్రాపు యేసె సుమండి - భువి - పాపులకు సఖుండు ||పాపులకు||

1.రండి రండి మిత్రులార - నిండు ధైర్య పడండి వేగమె = దండైన యండ మన - కుండు యేసుండని ||పాపులకు||

2.దాహ మణంచు దేవ వాక్యము - దేహధారులార రండి = దేహీ యన విహీనుల - సాహాయ్యము నోహో యని ||పాపులకు||

3.ద్రవ్య మించుక లేని విక్రయ - మయ్య యీ యేసయ్య రక్తము = చేయలే మయ్య మన - మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||

4.నిండు మనసు గలిగియే - సండఁజేర రండి వేగమె = నిండు ప్రియుండు న - ఖండ పురుషుండని ||పాపులకు||

5.నింద లన్ని పొంది ప్రభుని - మందలో వెలుఁగొందరే తఱిఁ = పొం దుగ నిందలో - నుందు రానందమున ||బాపులకు||

31 May 2026

ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె Prabhukreesthu yesu preminche

262
క్రైస్తవ సంఘ బాధ్యతలు 
(చాయ: యేసువంటి ప్రియ బంధుడు)
రా - ఆహిరి, తా - ఆది 

ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును - పరిమళ వాసనగానుండ = ప్రభువు చిత్తమును పరిగణించుటయె - సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||

1.దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు - గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని - సంఘమ - నీ బాధ్యతగాదా? ||ప్రభు||

2.యువకులు రేపటి సంఘము నందున - నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలఁ జేయను వారిని - సంఘము - నీ బాధ్యత గాదా? ||ప్రభు||

3.బాప్తిస్మమును కృపా ప్రసాదములు - ప్రభు వెంచెను పరిశుద్ధముగ = ఘనముగ వాటిని గైకొన నిరతము - సంఘము - నీ బాధ్యతగాదా! ||ప్రభు||

4.దేవుడు జతపర్చిన దాంపత్యము - భావములర బంధుత్వములున్ = సవ్యంబుగసరి జేయఁగ వాటిని - సంఘ మ - నీ బాధ్యతగాదా? ||ప్రభు||

5.పామర జనములు ప్రభు నెఱుంగక - పెడ మార్గంబుల దిరుగగను = మానుగ రక్షణ మార్గము జూపుట - సంఘ మ - నీ బాధ్యతగాదా? ||ప్రభు||

6.క్రైస్తవ దాతృత్వము నందెదుగుట - కర్తను కీర్తించుట యౌను = దశమ భాగములు దాత కొసంగను - సంఘ మ - నీ బాధ్యత గాదా? ||ప్రభు||
- ఎం. ఎల్. మోజెస్ 

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము Parishudhathmuda lemmu

268
సభ కాపరుల కొరకు ప్రార్ధించుట 
(ఛాయ: పరిశుద్ధాత్మను కోరుము)
రా - కళ్యాణి, తా - ఆది 

పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ - సంఘముపై నీ - వర దీవెనల నుంచుమీ చిరుత కాలపు సభ కా - పరు లొంది నీ యగ్ని - యరుల నెదిరించి చా - టిరి నీదు సత్యంబు ||పరి||

1.బలుఁడా యీ కాలంబునన్ - దివారాత్ర - ములు నీదు సేవకులున్ = నలు దిక్కులను దిరిగి - విలసిల్లు నీ వార్త - పలు జనాంగములకుఁ బ్రకటించు చుందురు ||పరి||

2.ప్రతిదేశము దిప్పుడు - ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు = అతులుండు నీ పుత్రుఁ - డాజ్ఞాపించిన యట్లే - యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ గుము ||పరి||

3.పరిశుద్ధాత్మ బలంబును - వాక్యపు ధృతినిఁ - బడసిన బోధకులను = ఇరుల శక్తిని ద్రోసి - నరులను నీ తట్టు = మరలఁ జేసెడువారిఁ - ద్వరలోఁ బంపుము దేవ ||పరి||

4.నీ యాత్మ కాంతితోడఁ - బూర్వము వలెనే - డాయంగ మముఁ జేయుమా = యే యడ్డున్నను బాపి - యెలమి నింగిని జీల్చి - దాయుము మము స్వేచ్ఛ - దయచేసి నీ యొద్దఁ ||పరి||

5.జను లెల్ల నీ వాక్యపు - శక్తి నెఱింగి - ఘనపరపఁ ద్వరచేయుము = పెను సంఘములు లోక - మున నాటి యిశ్రాయేల్ - జనపు నిద్రను బాపు - జయ మొందు నీ వాక్కు ||పరి||

6.ఇల సంఘమున నెడారుల్ - కప్పుము దేవ -  తొలఁగించు మాటంకము = అల నీ వాక్యమునకు - నడ్డంబు లేమియు - గలుఁగకుండఁగ నిమ్ము - ఘన సంఘాధ్యక్షుండ ||పరి||

7.నీ సంఘమును నబద్ధ - బోధలనుండి - నిర్మలంబుగఁగావుమా = గాసిఁజేసెడు జీత - గాండ్లను బాపి నీ - భాసిల్లు నుద్యాన - వనముగ నుంచుమా ||పరి||
- కడియం గాబ్రియేలు 

30 May 2026

పరిశుద్ధాత్మా పావురమా Parishudhathma pavurama

 248
పరిశుద్ధాత్ముడా - దిగిరమ్ము 
(ఛాయ: చూచుచున్నాము నీ వైపు)
రా - కమాసు, తా - త్రిపుట 

పరిశుద్ధాత్మా పావురమా - నీ దాసులపై - కరుణతో నరుదెంచుమా = పరిశుద్ధుడగు యేసు - పరమున కరిగి యా -  దరణకర్తగ నిన్ను - దయచేసె గద మాకు ||పరి||

1.తండ్రి కుమారాత్మల - యేకాత్మవై - యుండిన పావనుడా = నిండార నీ యాత్మ - నండగ మాకొసగి - దండిగ వరముల - దయచేయు మోదేవ ||పరి||

2.విధిగ వేదము జదివిన - వేమారుసద్బోధల నాలించినా = సదయుడ నీ శక్తి - హృదయాల లేకున్న - కదలింపబడలేని - కలుషాత్ములము తండ్రి ||పరి||

3.సత్యస్వరూపా రమ్ము - మమ్ముల సర్వ - సత్యములో నడుపుము = సత్యాత్మా నీ శక్తి-సంపత్తితో దైవ - కృత్యము లొనరింప - గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||

4.వాక్యమందలి భావముల్ - లోతుగ దరచి - వచియింప దరమె మాకు = వాక్యోప దేశివిగా - వచ్చి మాలో నిలచి - వాక్యమందలి జీవ - భావాలు దెలుపుమా ||పరి||

5.సాధక బాధకముల - నిలయంబైన - సంసార సాంద్రములో = ఆదరణ కర్తవుగా - నరుదెంచి మా సర్వ - బాధల దొలగించి - మోదంబు గూర్చుమా ||పరి||
- వి. డి. జాన్ సుందర రావు 

పరిశుద్ధాత్మ ప్రభుని Parishudhathma prabhuni

 247
పరిశుద్ధాత్ముని ప్రాపు 
(ఛాయ: అన్ని కాలంబుల)
రా - కాంభోజీ,  తా - అట 

పరిశుద్ధాత్మ ప్రభుని - వరదివ్యశక్తిబం - ధురము ధరణికిజీవ - సంజీవము - పరమౌన్నత్యంబైన - పరలోక సువిశేష - పరమార్థములు దెలుపు నెఱిమార్గము ||పరి||

1.ఆపత్కాలమునందు - ప్రాపయి మానవజాతి - కాపయి సంరక్షించి - ఏపారును = పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు -  పాపజాతికి దీప రాశియై రహియించు - కృపయు కనికరములు గుంఫించి - మధురాతి - ప్రభగా భాసిల్లెడు పరమార్థము - అపభ్రంశకార్యముల కెపుడు తావీయక - సుపురోగతిని జూపి శోధించును ||పరి||

2.బండలనుపమించు - గుండియల కదలించు - నిండుశక్తి ఘటించు నీతి బెంచు = ఎండిన యెదలను నిండించు రక్షణో - ద్దండ విలసిత భాగ్య దానమ్ములు - దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి- మెండుగా నాదరము మేళవించి - మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల - నుండి పాపిని గాచు నండయౌచు ||పరి||

3.శాంతి సమాధాన - సౌజన్యభావమ్ము - కాంతిమంతము గల్గు కారుణ్యము = అంతములేనట్టి - ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు = ఎంతో సంతోషముతో - అంతుబొంతులేని వి - క్రాంతి బలత్యాగముల - గావింప జేయు - చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు - శాంతిలేని జనతకు - సౌఖ్యాస్పదము ||పరి||

పరిశుద్ధాత్మునిఁ బొందుము Parishudhathmuni bondhumu

250
పరిశుద్ధాత్మునిఁ బొందుడి 
(ఛాయ: పరిశుద్ధాత్ముని గోరుము జీవమా)
రా - కళ్యాణి, తా - అట 

పరిశుద్ధాత్మునిఁ బొందుము - ప్రభువిచ్చెడు - వరసహాయునిఁ బొం దుము = పరిశుద్ధవర్తనకు - పరమసాహాయ్యంబుఁ - పరముఁజేరువఱకు - పరి పూర్తిగా దొరకు ||పరి||

1.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - మన రక్షణ - పరిపూర్ణమై యుండును = పరమ రక్షకుఁడిచ్చు = పరిపూర్ణ రక్షణను - పరమానందముతోడఁ - పరగఁగైకొను మిపుడే ||పరి||

2.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - బైబిలువాక్య - పరమసారము తేటగుఁన్ = పర మండలపుఁ తండ్రి - పరిశుద్ధచిత్తంబు - పొరపాటులేకుండ - విరివిరిగాఁ దెలియును ||పరి||

3.పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ - బ్రార్థనలందుఁ - పరమ పాటవ మబ్బును = సరిగాఁ బ్రార్థించెడు - సరణియుఁ దెలియును - వరములను బొందుటకు - తెరువులభియించును ||పరి||

4.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - శోధనములఁ-పరమ విజయము గల్గును = దురితంపు శోధనలఁ - దొలగింప నా ప్రభువు - పరమశక్తినొసంగి - కరుణతో జయమిచ్చు ||పరి||

5.పరిశుద్ధాత్మునిఁ గల్గిన - జీవితమెల్లఁ-పరిశుద్ధముగ నుండును = పరిశుద్ధ జీవితము - కరము సాధ్యంబగును - పరిశుద్ధాత్ముని శక్తిన్ - వర్తింపఁగలమట్లు ||పరి||
- మండపాక కేశవరాయ శర్మ 

05 April 2026

పరలోకమే నా స్వాస్థ్యము Paralokame naa swasthyamu


పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో

1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను

2. సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును

3. నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను

4. పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును

5. ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె

03 March 2026

పాపిని కృప జూపవయ్యా Paapini krupa jupavayya

329 
క్షమాపణ వేడుట 
రా - కమాసు, తా - త్రిపుట 

పాపిని కృప జూపవయ్యా - దాపు జేరితిని యేసయ్యా = పాప భారము క్రింద శ్రమపడి - కృంగియున్నాను యేసయ్యా ||పాపి||

1.వేష భాషలతోడ నిండి - మోసపోయితిని యేసయ్యా = దోసిలొగ్గి నిన్ను చేరితి - దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||

2.నీతి లేని నాదు జీవిత - మేల నికనయ్యా యేసయ్యా = నీతి గరపి బ్రోవు మయ్యా - నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||

3.నీదు సిలువలోని ప్రేమ - నెంచదర మౌన? యేసయ్యా = నాదు కలుష మంత బాపి - కనికరింపు మా యేసయ్యా ||పాపి||

4.నీదు రక్తధారలేయిల - పాపికాశ్రయము యేసయ్యా = నీతిమంతుల జేయుమయ్యా - నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||

5.దాపుగోరినవారలకు నీ - ప్రాపుజూపితివి యేసయ్యా = పాపశాపము బాపి నిత్య - జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||

6.శాంతి గోరువార లెల్లనీ - చెంతకరగినచో యేసయ్యా - చింతలెల్ల దీర్చగలవు - శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||

7.పరమరక్షక నీదు ప్రేమ - నెరుగ తరమౌన యేసయ్యా = పరుల మైన మమ్ము బ్రోవ - వేచియున్నావా యేసయ్యా ||పాపి||

8.నాదు హృదయము నీదెసుమ్మా - నీవె గైకొనుమా యేసయ్యా = శుద్ధ హృదయము జేసి నను నీ - సుతునిగా జేయు యేసయ్యా ||పాపి||

- సిరిపురపు కృపానందము 

01 December 2024

Padudi geethamulu halleluya పాడుడి గీతములు హల్లేలూయా

పాడుడి గీతములు హల్లేలూయా - మీటుడి నాదములు హల్లేలూయా
పాపరహితుడు హల్లేలుయా - పాపవినాశకుడు హల్లేలుయా

కన్య మరియ గర్బమందున ఆ.....
వెలసినావా పుణ్య పురుషుడా ఆ.....
నీవు పుట్టినావు పశువుల పాకలోన

పశులశాల వెలసిపోయెను ఆ....
పావనుండు జననమెుందగా ఆ.....
ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను

ఉల్లమందు సంతసించిరి ఆ.....
యేసు ప్రభుని పూజ చేసిరి ఆ.....
పయణించిరి గొల్లలు ప్రభు జాడకు

ఆకాశమున వింత గొల్పెను ఆ....
అద్బుత తారను గాంచిరి ఆ....
పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు

నక్కలకు బొరియలుండెను ఆ....
పక్షులకు గ్లూళ్శు వెలసెను ఆ....
నీవు తలవాల్చుటకు స్థలము లేదాయె

ఆలకించు మా ప్రార్థన ఆ.....
ఆత్మశుద్ది కలుగజేయుమా ఆ....
బాల యేసు నా హృదయంలో జన్మించమా

04 November 2024

Pillanaina nannu judumi పిల్ల నైన నన్నుఁ జూడుమీ

538
బాల ప్రార్థన 
రా - ముఖారి, తా- త్రిపుట 

పిల్ల నైన నన్నుఁ జూడుమీ = ప్రియ మైన యేసు - పిల్ల నైన నన్నుఁ జూడుమీ = చల్లని రక్షకుఁడ వనుచు - సత్య వార్తఁ దెలుపుచుండ - నుల్ల మందు నిన్ను నమ్మి - కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||

1.నిన్ను నమ్మి యున్నవాఁడను - ఘన దేవ తనయ - నన్ను దాఁచు నీ నీడను = తిన్నని హృదయంబు నాకుఁ - జెన్నుగా నొసంగి యిపుడు - సన్నుతింప నిమ్ము - నన్ను - సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||

2.ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా - స్వరూప - ప్రేమలోన నడచు చుంటివి = ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ - బ్రేమచేత బ్రాణ మిచ్చి - ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||

3.పరమ జనకు చిత్త మెప్పుడు-పరమేశ పుత్ర - బిరబిరగను జేయఁగా నిమ్ము= కరుణ మీర నాత్మచేత - వరవరంబు లొసఁగి నాకు - నరిలలోన నిన్నుఁ గొలువ - ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||

4.బలము మీర నన్ను నిలుపుము - తుల లేనివాఁడ - బలము గల్గు నీదు చేతుల = నిలను నీకు ఫలము లిచ్చి - యెలమి నిన్ను గొప్పఁ జేయ - సలలిత ముగ - నడువ నిమ్ము - చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||
- పులిపాక జగన్నాధం

13 October 2024

Parama thandri ninnu పరమ తండ్రి నిన్ను

కృతజ్ఞతార్పణల పండుగ
577
ఉత్సవ కీర్తన 
రా - జంఝాటి  తా - ఏక 

పరమ తండ్రి నిన్ను మే మీ - పరస కాలము = స్వరము లెత్తి యింపు గాను - స్మరణఁ జేతుము ||పరమ||

1.నిరుపమాన దేవ నిన్ను - నిరత ప్రేమతో = హరువుగా నుతింతు మేము - హర్స రవముతోఁ ||పరమ||

2.అవని సంభ్రమములలోన - నవఘళించము = అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ||

3.వేయి నాళ్లు లోకమునను - వెలయుకంటెను = శ్రేయ మొక్కనాఁడు నిన్ను - సేవ జేయుట ||పరమ||

4.ఉచితమైన నీ గృహమున - నచల భక్తితో = రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||పరమ||

5.మనసునందు సత్యబోధ - మనస్కరించుచు = మనెడు తరిని విడము నీదు - ఉనికిపట్టును ||పరమ||

6.గొరియ పిల్ల యొక్క ప్రేమ - గూర్చి భక్తితోఁ = గొరత లేక చేతు మెపుడు - గొనబు గానము ||పరమ||

8.శాంతజలము నొద్ద మమ్ము - శాంతి పరచుము = సంతతమును నీవు మమ్ము - సంతరించుము ||పరమ||

9.దినము లన్ని మేము నిన్ను - దీన మనసుతో = వనరు మాని సంతసమున - వినతి చేతుము ||పరమ||
– యెషయా వీర మార్టిన్ 

18 August 2024

Parishudhathmuda prabhuva varada పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! వరదా!

246 
పరిశుద్ధాత్మకొరకై ప్రార్థన 
(చాయ: తనువునాదిదిగో గైకొనుమి)
రా - యదుకుల కాంభోజి, తా - త్రిపుట 

పరిశుద్ధాత్ముఁడ ప్రభువ! - వరదా! మా హృదయమం - దిరముల వసి యింపుమా = అరుదైన నీదివ్య - తరశక్తులను దాల్చి - త్వరగా మాపై దిగుమా కరుణాబ్ధివై యిపుడు ||పరిశుద్ధాత్ముఁడ||

1.పరమండలాగ్నివై - యరుదెంచి మా హృదయాం - తర దురితతూలం బును = దరికొల్పి పరిశుద్ధ పఱచి మా -  యాత్మల మా వరరక్షకునకు న-ర్పణ ముగా నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||

2.కాంతులీనెడు దీప - కలికవైవచ్చి మా - స్వాంతంబులఁగప్పిన = యంతు లేని యవిద్యా - ధ్వాంతంబుఁ జోపి సు - స్వాంతులేగెడు సత్య సరణిఁ జూపింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||

3.చలువఁ గూర్చెడు మంచు-జల్లురూపమున మ - మ్ముల నెల్ల దీవింపుమా = ఫలశూన్యంబైన యా - ఆత్మలకు నీ బల మొసఁగి-ఫలవంతములుగ గే-వలుఁడా యొనరింపుమా ||పరిశుద్ధాత్ముఁడ||

4.పరమ పారావతమా!-పక్షములు విప్పి మా - శిరములపైని చాఁచి = పరమందు నీ సంఘ - పరిశుద్ధులకువలెనె - ధరనున్న మాకు నీ - వరముల నిడుమయ్య ||పరిశుద్ధాత్ముఁడ||

5.దివినుండి భువికి నా - రవముతో వీతెంచు - పవమానాకారుండవై = నవ జన్మసంప్రాక్తికవరోధమొనరించు -  భవదుఃఖాంబుద పటలిఁ బాఱఁ దోలుము కృపచేఁ ||పరిశుద్ధాత్ముఁడ||

6.అందమౌ నీమోము - నందుఁ జిందెడు తేజ-మందఱు వీక్షింపగా = విందవై వచ్చి మా - డెందంబులకు నిత్యా -  నందంబుఁగూర్చి మా - వందనంబులు గొనుమా ||పరిశుద్ధాత్ముండ||
- దాసరి మోజెస్

Parishudhathmuda deva prabhuva పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా

244
పరిశుద్ధాత్మా, రమ్ము 
(చాయ: తనువు నాదిదిగో) 
రా - ఆనందభైరవి, తా - అట 

పరిశుద్ధాత్ముఁడ దేవ! - ప్రభువా నీ కరుణ మా - పైన వర్షించు మయ్య = వరుఁడా నీ భక్తుల-మనముల నాత్మల - బలపర్చి రక్షించి-మరి స్వస్తి నిడు మయ్య ||పరి||

1.బలమౌ నీ వెలుఁగుచే - బలు దేవ భాషల - ప్రజల కందర కైక్యముఁ = గలిగించి విశ్వాస - మున వారి నొనఁగూర్చి - వెలయుచుండెడు నీకే - విన తుల్ సల్పుదు మయ్య ||పరి||

2.బలమౌ దుర్గమా మిగుల - పావనంబగు వెలుఁగా! - ప్రభువా దేవుని జ్ఞానము = కలిగించి మదితోడఁ - బిలువఁ దండ్రీ యంచు - వెలుగు సత్య మునౌ నీ - బల వాక్య మిడు మాకుఁ ||పరి||

3.విపరీత బోధలను - వేరౌ బోధకులను - విడువ మా కిడు సాయము = కృప నొప్పు యేసే మా - గురు వంచు మది నమ్మి - యపనమ్మికను మాని - యవనిం బ్రతుక నిమ్ము ||పరి||

4.పరిశుద్ధతకు నూటా - నెర నెమ్మదికి కర్తా - జరిగింప నీ యాజ్ఞలన్ = త్వర నొందు చరణములు - స్థిర డెందమును నిమ్ము - పరిశోధనలు గలుగ - భయమొంద నీయకుము ||పరి||

5.మరణ జీవంబు ల - స్థిర యోధులను బోలి - పరుగెత్త నీ దారినే = తిరతఁ దప్పిన వేళ - దేహంబునకు శక్తి - గరిమతో నిడి సిద్ధ - పరచుము మము ప్రభువా ||పరి||
- కడియం గాబ్రియేలు

21 July 2024

Prabhuva neeve nadu sharanam ప్రభువా నీవే నాదు శరణం

ప్రభువా నీవే నాదు శరణం -
ఆశ్రయించితి నీ చరణములే (2)
అపవాది క్రియలందు బంధీనైతిన్..
కృప చూపి నను విముక్తుని చేయుమా..
విపరీతి గతి పొందియుంటిన్
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా||

1.మరణ ఛాయలు నాపై క్రమ్ము కొనెను-
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము (2)
చెదరిన నీదు ప్రతి రూపం -
నాపై సరి చేసి ముద్రించు దేవా(2) ||ప్రభువా||

2.నీ న్యాయ విధులన్ని భంగ పరచి -
గాయపరచితి నేను అపరాధిని (2)
పరితాపమును పొందుచుంటి -
నాదు పాపము క్షమియించు దేవా(2) ||ప్రభువా||

3.పాప భారము తొడ అరుదించితి -
సేద తీర్చుము శాంతి జలములతో (2)
నీ ప్రేమ రుధిర శ్రవంతి -
శాప భారము తొలగించు దేవా(2) ||ప్రభువా||

శరణం యేసు చరణం (4) ||ప్రభువా||

16 May 2024

Parishudhathma nithyathma పరిశుద్ధాత్మ నిత్యాత్మ

237
పరిశుద్ధాత్మ స్తుతి 
రా - బిలహరి,  తా - అట 

పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా =  దురతేచ్ఛలను దూర - పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

1.నిత్యంపు వెల్గుచే - నింపు జ్ఞానాత్మ = సత్యంపు శుభ వార్త - సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

2.జీవమార్గంబున - జీవింప నేర్పి = త్రోవఁ దప్పిన వారి - భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

3.పాపాంధకారంబుఁ - బాపు నీ వెలుఁగుఁ = జూపి మింటికి నడిపి - కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||

4.భక్తుఁడు శోధింపఁ - బడుచుండునేని = యుక్తిఁ దెల్పెడి సర్వ - శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

5.తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||
- బేతాళ జాన్

28 April 2024

Paschatapamu bondumu పశ్చాత్తాపము బొందుము

333
పశ్చాత్తాప పడుటకు ప్రేరణ
(చాయ: పరిశుద్ధాత్మను గోరుము)
రా - ఆనంద భైరవి, తా - అట

పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము = పశ్చాత్తాపములేని - ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్గు - నిత్యమౌ నరకంబు ||పశ్చాత్తా||

1.ఎంత పాపవైనను - జీవము క్రీస్తు - చెంత పార్థనఁ జేయుము = సంతోషమును మన - శ్శాంతిని నొసఁగున - నంతుఁడైన విమ-లాత్ముఁ డాదరించు ||పశ్చాత్తా||

2.జారచోరకార్యము - లేవైనను - బారఁదోలును వేగము = నారాజ్యమును వెదకు - నరు లందఱకు జీవ - ధార లెచ్చెదనని - కోరి కర్త వచించె ||పశ్చాత్తా||

3.వినుము ప్రభువు వాక్యము - జీవము నీవు - గనుము రక్షణ భాగ్యము = తనువు నిత్యముగాదు - నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు - ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తా||

4.దిక్కుమాలిన దానవే - జీవము ప్రభుని - మ్రొక్కి పరమును జేరవే = నిక్కమిది నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||

5.బలములేని దానవే - జీవమ యాత్మ - బలము బొందుము వేగమే = యిలను విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము ||పశ్చాత్తా||

6.మందపోషకుఁడు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుఁడు థీరుఁడు = వందిత సత్సంఘ - మందుఁ జేరిన సత్యా - నందంబు నిత్యంబు - నొందుచు నుందువు ||పశ్చాత్తా||
- మోర్త ప్రకాశము 

08 August 2023

Premamaya yesu prabhuva ప్రేమమయా యేసు ప్రభువా

ప్రేమమయా - యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును - ప్రభువా 
అనుదినమూ - అనుక్షణము - నిన్నే స్తుతింతును - ప్రభువా ||ప్రేమ||

1.ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై ||ప్రేమ||

2.ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు 
ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే ||ప్రేమ||

3.శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా 
శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా ||ప్రేమ||

12 May 2023

Parama yerushalema పరమ యెరుషలేమా

పరమ యెరుషలేమా - పరిశుద్ధ భూషణాలతో
వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా
ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ
ఆమెన్ హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ

1.నా గొర్రెలు నా స్వరము వింటాయి -
అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి (2)
అన్నాడు ప్రభు యేసు - అనుసరించు ప్రభు యేసుని ||పరమ||

2.రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొని -  ప్రేమతోడ పిలచిన కోడిపోలి (2)
పిలిచాడు ప్రభు నిన్ను - వెనుదియ్యకు ప్రభునుండి ||పరమ||

3.తన గర్భాన పుట్టిన బిడ్డను - ఏ తల్లైనా మరచినా మరువవచ్చును (2)
ప్రభు నిన్ను మరువడు - మరువవద్దు ప్రభు యేసుని ||పరమ||

4.శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో - శోధనలలో
విశ్వాసం కాపాడుకో (2)
ప్రభుకొరకు సిద్ధపడుమా - గొర్రెపిల్ల జీవకన్యకా ||పరమ||

11 May 2023

Parishudha agnini pampumu పరిశుద్ధ అగ్నిని పంపుము

పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా
పరిశుద్ధ ఆత్మతో నింపుము దేవా -
మా ప్రాణ ఆత్మ శరీరములను
పరమాగ్నితో నింపి వెలిగించుమా -
పరిశుద్ధ అగ్నిని పంపుము దేవా

1.పెంతెకొస్తు పండుగనాడు పంపిన ఆ ఆత్మను
మేడ గదిలో శిష్యులపై వ్రాలిన ఆ ఆత్మను (2)
యీ అంత్య దినములందు మా అందరిపై కుమ్మరించి, నీ శక్తితో నీ బలముతో మమ్మును బలపరచుము (2)
||పరిశుద్ధ||

2.నీ ఆత్మని కుమ్మరించి ప్రవచన వరమీయుమా -
నీ చిత్తము మాకు తెలుప దర్శనములు చూపుమా (2)
నీ వాగ్దానములతో మమ్ము తృప్తి పరచుము - నీ ఆత్మ కార్యములను మాలో చేయుము (2)
||పరిశుద్ధ||

3.ఆత్మలేని వారు నీ వారు కారంటివి -
నీవెవరో యెరుగనని గెంటివేయుదనంటివి (2)
పవిత్రాత్మను నేడే మాపైన కుమ్మరించి -
పరిశుద్ధుల గుంపులో చేర్చుము పరిశుద్ధుడా (2)
||పరిశుద్ధ||

06 May 2023

Prematho yesu piluchuchunnadu | ప్రేమతో యేసు పిలుచుచున్నాడు



ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము
రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము

1. పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను
శాపగ్రహియాయె సిలువలో
శాపగ్రహియాయె సిలువలో పరుగిడి రమ్ము

2. ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము

3. సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము

4. తప్పిన గొర్రెను రక్షంప
తనదు రక్తమును చిందించె
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము

5. తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము

6. తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము

7. ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...