Showing posts with label J. Show all posts
Showing posts with label J. Show all posts

02 March 2023

Jeevapradatha lyrics | జీవ ప్రధాతవు

Jeevapradatha - జీవ ప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh 

జీవ ప్రధాతవు నన్నురూపించిన శిల్పివి నీవేప్రభూ (2)
జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు (2)
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను (2)
జాలి హృదయుడ నాపై చూపిన వీడని నీ ప్రేమను 
ఏమని పాడెదనో ఏమని పొగడెదను ||జీవ||
 
1.శుభకరమైన తొలిప్రేమను నే మరువక జీవింప కృపనీయ్యవా (2) 
కోవెలలో నీ కానుక నేనై కోరికలో నీ వేడుక నేనై 
జత కలిసి నిలిచి జీవింప దలచి కార్చితివి నీ రుధిరమే (2)
నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్య (2)||జీవ||
 
2.నేనేమైయున్నా నీకృప కాదా నాతో నీసన్నిధిని పంపవా (2)
ప్రతికూలతలు శృతిమించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను
పాత్రునిగాచేసి బలపరచినా యేసయ్యా ||జీవ||
 
3.మహిమను ధరించిన యోధులతో కలసి దిగివచ్చెదవు నాకోసమే (2) 
వేల్పులలోన బహుఘునుడవు నీవు విజయవిహారుల ఆరాధ్యుడవు 
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడుపొందని ఆత్మాభిషేకముతో
నింపుము నా యేసయ్యా ||జీవ||

06 February 2023

Jeevamaina yesu naalo జీవమైన యేసు నాలో ప్రవహించాలి

జీవమైన యేసు నాలో ప్రవహించాలి
నిత్య జీవమైన యేసు నాలో ప్రవహించాలి (2)

ఆ జీవమే నిత్య జీవమిచ్చును ఆ జీవమే రక్షణను ఇచ్చును (2)
ఆ జీవమే స్వస్థత నిచ్చును (2)
ఆ జీవమే విడుదల నిచ్చును (2) ||జీవమైన యేసు||

ఆ జీవమే నిత్య ఆదరణ ఇచ్చును ఆ జీవమే ధైర్యము ఇచ్చును (2)
ఆ జీవమే బలమునిచ్చును (2)
ఆ జీవమే ఆలోచనిచ్చును (2) ||జీవమైన యేసు||

ఆ జీవమే శిష్యులను చేయును ఆ జీవమే సాక్ష్యులను చేయును (2)
ఆ జీవమే అభిషేకమిచ్చును (2)
ఆ జీవమే ఉజ్జివమిచ్చును (2) ||జీవమైన యేసు||

05 June 2022

Junte thene kanna teeyanidi | జుంటె తేనె కన్నా తీయనిది

జుంటె తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అయినది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
యేసు నీ నామము

సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండల కన్నా చల్లనిది
యేసు నీ నామము

యేసూ అసాధ్యుడవు నీవు
మరణాన్ని జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె||

ఆకాశము కన్నా విశాలమైనది
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము ||జుంటె||
--------------------------------------
Junte tene kannaa teeyanidi
Vendi pasidi kannaa minna adi
Pongi porlu chunna prema needi
Yesu nee naamamu

Surya kaanthi kannaa prakaashamainadi
Pandu vennela kannaa nirmalamainadi
Manchu kondala kannaa challanidi
Yesu nee naamamu

Yesu asaadhyudavu neevu
Maranaanne jayinchina jeerudavu
Sarvannee shaasinche yodhudavu
Neeku saati lerevaru

Rakshakaa neevegaa maa balamu
Devaa maa daagu sthalamu neeve
Neeve nijamaina devudavu
Pranamilli mrokkedamu ||Junte||

Aakaashamu kannaa vishaala mainadi
Vishwamanthatilo vyaapinchiyunnadi
Uhalakandani unnathamainadi
Yesu nee naamamu

Lokamanthatiki rakshana maargamu
Janulandarini brathikinchu jeevamu
Sarva kaalamulo nivasinchu sathyamu
Yesu nee naamamu ||Junte||
DOWNLOAD MP3 SONG HERE 👇

17 April 2022

Jayinchinaadu Yesu Raju | జయించినాడు యేసు రాజు


జయించినాడు యేసు రాజు - సిలువ మరణమును.
నిలిచినాడు జీవమై - ఇలలో దైవము..
లేఖనములు ప్రవచనములు - చెప్పినట్టుగా..
లేచినాడు ప్రభు తిరిగి - మూడవ దినమున..

దైవ పుత్రుడు - పరిశుద్దుడు - పరమాత్ముడు యేసు
సర్వశక్తుడు -సర్వోన్నతుడు - జయశీలుడు యేసు

1. నా సృష్టికర్తయు - నా ప్రాణదాతయు
నా జీవదాతయు - సర్వాధిపతియు
నా రక్షణ దుర్గము - నా మోక్ష ద్వారము
తను చూపిన మార్గమే - పరలోక మార్గము
నా ప్రాణము నీవే.. నా గానము నీవే - 
నా ధ్యానము నీవే - యేసయ్య (2) 

దైవ పుత్రుడు.. పరిశుద్దుడు.. పరమాత్ముడు యేసు
సర్వశక్తుడు.. సర్వోన్నతుడు.. జయశీలుడు యేసు (2)
Lyrics: V.K. Elias
Vocals: Jayasudha

27 March 2022

Jeevithamlo neela undalani | జీవితంలో నీలా ఉండాలని

జీవితంలో నీలా ఉండాలని - యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక - చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో||

కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే నడవాలని - నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని - నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి - నీ దరికి చేరాలని (2) ||తీరునా||

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో (2)
నీలాగే బ్రతకాలని - నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని - నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి - నీ దరికి చేరాలని (2) ||తీరునా||

06 February 2022

Jeevaharamu rammu | జీవాహారము రమ్ము


278
జీవాహారము
రా - ముఖారి, తా - ఆది
(చాయ: నాకై చీలిన యుగయుగముల)

జీవాహారము రమ్ము - చిరజీవాన్నము నిచ్చి - జీవిత క్షుద దీర్చుము = జీవనపథములో - చీకటి పడువేళ - జీర్ణించు కొనిపోవు - జీవితాశలఁ బెంచ ||జీవా||

1.విందుగృహమునకేగి - వీక్షింతు భ్రమతో నీ - వివిధ సుభోజ్యంబులన్ = విచ్ఛిన్నమైన నీ - విమల దేహపు విందు - వికలంబౌ మనసుతో - వినుతించి, తినుచుందు ||జీవా||

2.రుధిర ధారలలోన - ఋజువౌ నీ ప్రేమలు - రూపుమాయును పాపము = ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత - ఋణభారములు దీరి - రుచి యించు నా బ్రతుకు ||జీవా||

3.భవదీయ స్మరణార్థం - పతితుల శరణార్థం - ఫలియించు యీహోమము = ప్రభువా నాయాత్మలో - ప్రతిబింబమై వెలసి - పానార్పణంబౌను - ప్రతిరక్త బిందువు ||జీవా||

4.ఆత్మంతఃపురములో - ఆంతర్య గదిలోన -  ఆరాధింతు నీ నామము = అలనాటి నీ రక్త - నవనిబంధన నేడు - అపురూపమై నాలో - నవతరించును దేవా ||జీవా||
                - ఏ . బి . మాసిలామణి

02 January 2022

Jayaprabhu Yesune Vembadinchuchu | జయప్రభు యేసునె వెంబడించుచు

462
యేసును వెంబడించుము
రా – శకరాభరణం,  తా – ఆది

జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||

1.ఆదరణయు అధికబలమును - ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూపగ ||జయప్రభు||

2.ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో ||జయప్రభు||

3.మా ప్రభు జూముము నీదు మార్గపు - మాదిరి జాడలను - నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును యీ కృపాదినమున ||జయ ప్రభు||

4.మా కొరకై నీవు నడచిన - మార్గము జూడగను - మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు ||జయప్రభు||

5.ఇహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము? - ఎవరిని ప్రేమింప వశమె? - విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని గొలువగ ||జయప్రభు||
ఎ. చార్లెస్ కిన్సింగర్


Jeevithanthamu nee neetho | జీవితాంతమూ నే నీతో నడవాలని

జీవితాంతమూ నే నీతో నడవాలని - 
ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యమూ నేనుండాలని - 
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనస్సంత నీవే నిండాలని - 
తీర్చుమయ్య నా ప్రభు ఈ ఒక్క కోరిక

పడితినయ్య పడితిని నీ ప్రేమలోనే పడితిని -
యేసయ్య ఓ యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదయ్య (2)
దారి తప్పి యున్న నన్ను వెదకి రక్షించినావయ్య (2)

1.నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను - 
నీవు లేని నా స్వనీతి వ్యర్ధమాయెను
నరుని నమ్ముటే నాకు మోసమాయెను -
భయముతోటి నా కన్ను నిద్ర మరిచెను
మనసులోన మానిపోని గాయమాయెను - 
నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం ||పడితి||

2.లోక భోగాట్టాలకు నే పొంగిపోతిని.. 
దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2)
చెడ్డదైన బ్రతుకు సరిజేయ చూసితి - 
ప్రయాసం వ్యర్ధమై నే నీరసిల్లితి (2)
ముగిసిపోయెననుకొంటి నా ప్రయాణము - 
నీ ప్రేమ ఇచ్చే నాకు ఓ కొత్త జీవితం ||పడితి||

08 December 2021

Jeevanadhila Nee Premalo | జీవ నదిలా నీ ప్రేమలో

జీవనదిలా నీ ప్రేమ నాలో ప్రవహిస్తుంటే - 
త్రోవచూపే నీ మాట నన్ను నడిపిస్తుంటే 
చింతకు చోటెక్కడ - ఓటమి జాడ ఎక్కడ (2)
అసాధ్యమైనవన్నీ నీ నామములో అన్ని సాధ్యమే (2) ||జీవనదిలా||

1. నా ముందు నడిచే నా దైవమా -  విందు శాలకు నడిపినావు - నీ కౌగిలిలో నా కన్నీరు - తొలగెను అది నా భాగ్యము (2)
ఊహకు అందని నీ ప్రేమ - లాలించును నన్ను తల్లిలా (2)||జీవనదిలా||

2. చేయి విడువని నా ప్రియుడా - నీ స్పర్శతో నా హృదయం పొంగెను - కన్నులు తెరచి నిను చూడగా - వింతైన దృశ్యం పులకించే నన్ను (2)
జీవింతును యేసయ్యా నీ నీడలో - పాలించుము నన్ను తండ్రిలా (2) ||జీవనదిలా||

DOWNLOAD MP3 SONG HERE 👇

16 November 2021

Jagamantha Veligi Poyenu | జగమంత వెలిగి పోయెను

జగమంత వెలిగి పోయెను - జనులంత మురిసిపోయెను
జగదేక దైవసుతుడు - జగమందు జననమొందెను

మరియమ్మ గర్భమునందున - మన యేసుడు ఉదయించెను (2)
మన పాప భారం భరియింపను (2)
మనకై శ్రీయేసు జనియించెను (2) ||జగమంత||

పశువుల పాకయందున - ప్రభుయేసు జనన మొందగ (2)
పరలోక దూత గణములు (2)
ప్రణుతించిరి ఆ బాలుని (2) ||జగమంత||

తూర్పున తార గాంచియు - తూర్పు దేశపు ఆ జ్ఞానులు (2)
తార వెంబడి యేసుని చేరిరి (2)
తనివి తీర పూజించిరి (2) ||జగమంత||
DOWNLOAD MP3 SONG HERE 👇

19 October 2021

Jeevithanthamu varku neeke | జీవితాంతము వరకు నీకే

442    
సమర్పణ గీతము
రా - యమునాకళ్యాణి, తా -త్రిపుట
(చాయ: నన్ను దిద్దుము)

జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని = నీవు నాతో నుండి - ధైర్యము - నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం|| 

1.ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన = అన్ని పోవును నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ||జీవితాం||

2.అన్ని వేళల నీవు చెంతనె మార్గమందున - యున్న యను భవమీయవె = తిన్నగా మార్గమందున నీ - పూనినడచెద రక్షకా || జీవితాం||

3.నేత్రములు మిరుమిట్లు గొలిపెడి - చిత్ర దృశ్యములున్నను = శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ॥జీవితాం ॥

4.నాదు హృదయమునందు వెలుపట - నావరించిన శత్రులన్ = చెదర గొట్టుము రూపుమాపుము - శ్రీఘ్రముగ నారక్షకా || జీవితాం||

5.మహిమలో నీవుండు చోటికి - మమ్ము జేర్చెదనంటివే = ఇహము దాటినదాక నిన్ను - వీడనంటిని రక్షకా ||జీవితాం||

6.పాప మార్గము దరికి బోవక - పాత యాశల గోరక = ఎపుడు నిన్నే వెంబడింపగ - కృప నొసంగుము రక్షకా ||జీవితాం||
                                  - సి.డి. శుభామణి

27 August 2021

Jeevan Parameshwar Kee Aaradhana | जीवित परमेश्वर की आराधना

गीतकार: डेविड बाग़

जीवित परमेश्वर की आराधना
जिंदगी भर मैं करता रहूंगा (2)
नया जीवन दिया यीशु
उस प्यार को कैसे भूलू (2) ||जीवित||

कहां जाऊं किधर जाऊं
हर स्थान मैं विराज है
यीशु नाम में मेरा मुक्ति है
यीशु नाम में मेरा शांति है (2)
मेरा जीवन का स्रता है तू
सारे पृथ्वी का मालिक है तो (2) ||नया जीवन||

मेरे सारे गुनाहों को
अपना क्रूस पर वह ले लिया
अपना लहू बहा के यीशु
मुझे शुद्ध और पवित्रा कर दिया (2)
मैं कभी ना तुझे त्यागूंगा
मैं कभी ना तुझे भूलूंगा (2) ||नया जीवन||

18 July 2021

Jyothiga mamu jeyumo deva | జ్యోతిగ మము జేయుమో దేవా

444
జ్యోతిగ మము జేయుము
రా - ఆనంద భైరవి, తా - చాపు
(చాయ: గొప్ప దేవ నాకు తండ్రివ)

జ్యోతిగ మము జేయుమో దేవా - యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా - జ్యోతిగ మము జేసి మాలో - క్రీస్తు మార్గము బయలు పరచి - నీతి ప్రేమలతోడ హృదయము - నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||

1.మా కుటుంబము లోన నీ వెలుగు - ప్రసరించు నట్లుగ - నాదు బ్రదుకును శుద్ధి జేయుమయ్యా = మా కుటుంబములోని వారలు - మానకను నీ వెలుగు జూపగ - మమ్ము నీ మార్గంబునందున - మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||

2.సంఘమున నీ కీర్తి కనపడగ - పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి జేయు మయా = భంగపరచెడి కక్షలన్నిటి - బాధపరచెడి శక్తులన్నిటి - పార దోలగ శక్తినిడి నీ - భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||

3.నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో - మా చుట్టునున్నవి - నీ కొరకు కనిపెట్టుచున్నవయా = అన్నివేళల నీ సువార్తను - అందరికి ప్రకటింప మనసున - నాశనిడి నీ వార్త వెలుగును - అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||

4.సమయమును వరముల నొసంగితివి - మా రక్షకా ధన - సంపదను నీవే యొసంగితివి = విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి - వీర త్యాగార్పణములతో నీ - వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||
 - పి.డి. శుభామణి

24 June 2021

Jeevana Tholi Sandhya Neethone | జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం - 
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2) 
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది(2) 
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన||

1. నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు - 
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2) 
నిరీక్షణ లేని ఇతరుల వోలె దుఃఖించను నేను -
నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను (2) 
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన||

2. నా పూర్వికులెందరో ఎప్పుడో గతించారు - 
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2) 
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా -
నా వేష భాషయులన్నియు నీకే సమర్పించితినయ్య (2) దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||
DOWNLOAD MP3 SONG HERE 👇

24 May 2021

Jai Jai Jai Jai Yesu Prabhu | జై జై జై జై యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా

జై జై జై జై యేసు ప్రభు - మాకై రానున్న ప్రభువా 

1.పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు సాక్షులుగా నుందు రనిన ||జైజైజైజై||

2.అంద్రియ సీమోనును చూచి - మెస్సీయాను
కనుగొంటిమని తెచ్చెనతని యేసు కడకు ||జైజైజైజై||

3.పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను
ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగెన్ ||జైజైజైజై||

4.మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము
దుష్టునికి లోకము ప్రభుని ఎరుగవలెన్ ||జైజైజైజై||

5.దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింప
బడినందున ధైర్యముతో చాటించెదము||జైజైజైజై||

6.ప్రభుని వాక్యము మన హృదయములో వసియించు 
చున్నందున - వాక్యమును ప్రకటించెదము ||జై జై జై జై||

7.నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
 చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ ||జైజైజైజై||
DOWNLOAD MP3 SONG HERE 👇

18 May 2021

Jayabherini Mroginthama | జయభేరిని మ్రోగింతమా


జయభేరిని మ్రోగింతమా - జయ విజయ భజనలతో
జయశృంగము నేడెత్తిన - జయమేసుని నామమమున
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

1.అమవాస్యలు దాటెను ఆహా - అరుణోదయమాయె మహా 
భ్రమ భావంబు మార్చిన - శ్రీపతి యేసుని నామమున
||జయభేరిని||
2.పాతాళము గెలువబడెన్ - పరలోకము తెరువబడెన్
సాతానుని ఇల గెలిచెనయ - ఆ క్రీస్తేసుని నామమున
||జయభేరిని||
DOWNLOAD MP3 SONG HERE 👇

18 January 2021

Jeevaharamu Kreesthe | జీవాహారము క్రీస్తే జీవాధిపతి


జీవాహారము క్రీస్తే జీవాధిపతి శ్రీ యేసే (2)
జీవాహారము క్రీస్తే

1.ఆయన రుదిరం ఇలలో - జీవామృతమే మనకు (2)
ఆయన కార్యము సఫలము చేయగా - 
పాపికి మోక్షము సమకూర్చి ||జీవా||

2.ప్రభు యేసుని కృప మనపై -  అపురూపము అది అమరం (2)
పావన ధామము.. నూతన జీవము.. 
ప్రేమకు పెన్నిధి ప్రియతమము ||జీవా||

3. ఆత్మాంతరమున మనము - ఆరాధింతుము ప్రభుని (2)
ఆయన నామము.. అమృత పానము.. 
జీవన మార్గము శుభకరము ||జీవా||
_________________________
Jeevaharamu kreeshte - jeevadhipathi sreeyese (2)
Jeevaharamu kreeshte

Aayana rudhiram ellalo - jeevamruthame manaku (2)
Aayna karyamu saphalamu cheyaga - paapiki  mokshamu samakoorchi  ||Jeeva||

Prabhu yesuni krupa manapai - apuroopamu adi amaram (2)
Paavna dhaamamu nuthana jeevamu - premaku  pennidhe priyathamamu ||Jeeva||

Aatmaantharmuna manamu - aaradhinthumu prabhunee (2)
Aayana Namamu Amrutha paanamu Jeevana Margamu shubhakaramu  ||Jeeva||
DOWNLOAD MP3 SONG HERE 👇

Jeevaharamu Neevani Jeeva | జీవాహారము నీవని జీవజలము


జీవాహారము నీవని - జీవజలము నీవేనని (2)
నీవే బ్రతికించాలని - యేసుప్రభు ప్రణమిల్లితిని 

1.ద్రాక్షావల్లివి నీవని నీలో తీగెను నేనని (2)
నీలో ఫలించాలని (2)
యేసుప్రభు ప్రణమిల్లితిని||జీవా||

2.గొర్రెల కాపరి నీవనీ నీస్వరమును నేనే విని (2)
నీవే నడిపించాలని (2)
యేసుప్రభు ప్రణమిల్లితిని ||జీవా||
________________________
Jeevaharamu neevani jeevajalamu neevenani (2)
Neeve brathikinchalani (2) 
Yesuprabhu pranamillithini||Jeeva||

Drakshavallivi neevani - neelo theegenu nenani (2) 
Neelo phaliyinchaalani (2)
Yesuprabhu pranamillithini ||Jeeva||

Gorrela kaapari neevani - nee swaramunu nene vini (2)
Neeve nadipinchaalani (2)
Yesuprabhu pranamillithini ||Jeeva||
DOWNLOAD MP3 SONG HERE 👇

10 December 2020

Jeevambunichhina Devuda | జీవంబునిచ్చిన దేవుడా నేపాడెద

జీవంబునిచ్చిన దేవుడా - నేపాడెద నీకు నిరంతము
హల్లెలూయ - హల్లెలూయ - 
పావనుండా నీకుపలుమారు నే - నింకేమి యియ్యంగ -
పాత్రుండనూ - హల్లెలూయ హల్లెలూయ 

వెలిగించినావు - వెలిగిచ్చినావు - గాలినిమాకై కలుగాజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరిపోసి కాపాడితివి
ఎంచలేక నే మంచి పనులు - 
హల్లెలూయ - హల్లెలూయ అని పాడెదన్ - 
హితుడా నీకే యీ స్తుతి గీతము 
హల్లెలూయ - హల్లెలూయ ||జీవంబు||

కరుణ కిరీట మిచ్చెవని - గడిగడికి నాతో నడిచేవని
కోపించువాడు కాడంచునా - పాపంబులెల్ల పాటించడు
ఎంచలేకా నే మంచి పనులు - 
హల్లెలూయ - హల్లెలూయ అని పాడెదన్ - 
హితుడా నీకే యీ స్తుతి గీతము 
హల్లెలూయ - హల్లెలూయ  ||జీవంబు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...