పదివేలలో అతి శ్రేష్ఠుడా - శుద్ధుడా మహిమాన్వితుడా
పల్లవి:
మనసు మార్చు పరమ తండ్రి - నీదు ఆత్మతో నేను నిండా
మనసు మార్చు పరమ తండ్రి - నీదు రూపులో నేను మారా
నీదు మహిమతో నేను నిండా
పనికిరాని పాత్రను నేను - పడిపోయిన పామరుండన్
మంచిలేని పాపిని నేను - చీకటి నిండిన అపవిత్రుడను
నీదు సన్నిధిన్ నేను వదలి - నీదు స్మరణను నేను మాని
మలినం నిండి మార్గము తప్పి - చెదరివున్న దోషాత్ముడను
సౌఖ్యము కోరి క్షేమము మరచి - దైవ ఆజ్ఞన్ నేను విడిచి
కానరాని దూరం పోయి - ఒంటరినైనా అనాధుడను