Showing posts with label నీ దయలో నీ కృపలో కాచితివి. Show all posts
Showing posts with label నీ దయలో నీ కృపలో కాచితివి. Show all posts

08 October 2021

Nee Dayalo Nee Krupalo | నీ దయలో నీ కృపలో కాచితివి

నీ దయలో నీ కృపలో - కాచితివి గతకాలము 
నీ దయలో నీ నీడలో - దాచుమయా జీవితాంతము 
నీ ఆత్మతో నను నింపుమా - నీ సేవలో ఫలియింపగా 
దేవా ... దేవా ... || నీ దయ || 

1. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా -
ప్రాణ హితులే.. నన్ను విడచి.. వెలిగ నను చూడగ (2)
ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు - నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) 
ఏమి అద్భుత ప్రేమయా - ఏ రీతి పాడనయా 
నీవె నా మార్గము - నీవె నా జీవము 
నీవె నా గమ్యము - నీవె నా సర్వము 
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ॥నీ దయ ||

2. ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి - 
వట్టి పాత్రను.. మహిమతో నింపి.. మార్గము నీవైతివి (2) 
నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని - నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) 
నా మది నిండెను ఆశతో - నే పాడెద స్తుతి గీతం 
నీవె నా తోడుగా - నీవె నా నీడగా 
ఆత్మతో నింపుమా - శక్తి నా కొసగుమా 
నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా || నీ దయ ||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...