Showing posts with label 138 యేసు నామమే పావనము. Show all posts
Showing posts with label 138 యేసు నామమే పావనము. Show all posts

30 April 2022

Yesu naamame pavanamu | యేసు నామమే పావనము

138 
యేసు నామము పావనము
రా - ఆనంద భైరవి, తా - అట

యేసు నామమే పావనము - మాకు - యేసు గద నిత్య జీవనము = దాస జన ¹హృద్వికాసమైయెల్ల - దోసములకు వి - నాశకరమైన ||యేసు||

1.సాధు మానసోల్లాసములు యేసు - నాధు గుణ చిద్విలాసములు = బోధఁ గొను వారి - బాధ వెడలించి - మాధుర్యమగు ముక్తి - సాధనములిచ్చు ||యేసు||

2.²భక్త జన లోక పూజ్యములు ³రక్త - సిక్త పాదపయోజములు = ⁴ముక్త రాజ్యాభి - షిక్తుఁడౌ సర్వ - శక్తి యుతుఁడైన - సామియగు క్రీస్తు ||యేసు||

3.దీన జన నిత్య ⁵తోషణము - సిల్వ - మ్రాని ప్రభు మృత్యు ఘోషణము = ⁶పానకము జుంటి - తేనియల ⁷స్వాదు - వీనులను ⁸గ్రోలు - మానవుల కెల్ల ||యేసు||

4.పాపులకు మంచి ⁹పక్షములు - ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు = పాప ¹⁰సందోహ - కూపమునఁ గూలు - కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||
                  – పురుషోత్తమ చౌదరి
--------------------------------------------
¹మనస్సును వికసింపజేయునది. ²భక్తజనుల సమూహముచేత పూజింపబడదగినది. ³రక్తముచేత తడపబడిన పాదపద్మములు. ⁴ముక్తి రాజమునకు రాజుగా నభిషేకింపబడినవాఁడు. ⁵సంతోషము.  ⁶పానకముయొక్క పూదీనెయొక్క. ⁷మధురము. ⁸త్రాగు. ⁹సహాయములు. ¹⁰సమూహమనెడు నూతిలో.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...