Showing posts with label భాసిల్లెను సిలువలో పాప క్షమా. Show all posts
Showing posts with label భాసిల్లెను సిలువలో పాప క్షమా. Show all posts

13 April 2021

Bhasillenu siluvalo papa భాసిల్లెను సిలువలో పాప క్షమా

భాసిల్లెను సిలువలో పాప క్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా  ||భాసిల్లెను||  

1.కలువరిలో నా పాపము పొంచి -
సిలువకు నిన్ను యాహుతి చేసి (2)
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| 
 
2.దోషము చేసినది నేనెకదా - 
మోసముతో బ్రతికిన నేనెకదా(2) 
మోసితివా నా శాపభారం (2)   ||భాసిల్లెను||  

3.పాపము చేసి గడించితి మరణం - 
శాపమెగా నేనార్జించినది (2)
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||  

4.నీ మరణపు వేదన వృధా గాదు 
నా మది నీ వేదనలో మునిగెను (2)
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
  
5.ఎందులకో నాపై ఈ ప్రేమ - 
అందదయ్యా స్వామీ నా మదికి (2)
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| 
 
6.నమ్మిన వారిని కాదన వనియు - 
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని (2)
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...