Showing posts with label కరుణా సంపన్నుడా ధీరుడా. Show all posts
Showing posts with label కరుణా సంపన్నుడా ధీరుడా. Show all posts

04 March 2022

Karuna sampannuda dhiruda | కరుణా సంపన్నుడా ధీరుడా

కరుణాసంపన్నుడా KARUNASAMPANUDA || HOSANNA MINISTRIES NEW SONG || Pastor.John Wesley ||

కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)
నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీకోసమే నా జీవితం ||కరుణా||

1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2)
అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే
ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2)
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||

2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2)
నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే
అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2)
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||

3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2)
నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2)
తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...