Showing posts with label Prabhu Yesu Na Rakshaka lyrics. Show all posts
Showing posts with label Prabhu Yesu Na Rakshaka lyrics. Show all posts

25 May 2021

Prabhu yesu na rakshaka | ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు

ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు 
నాకు నిరతము నే నిన్ను జూడ - 
అల్ఫయు నీవే - ఓమేగయు నీవే 

1.ప్రియుడైన యోహాను పత్మాసులో - 
ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2)
ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె 
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2) || ప్రభు ||

2.లెక్కలేని మార్లు పడిపోతిని - 
దిక్కులేనివాడ - నే నైతిని (2)
చక్కజేసి నా - నేత్రాలు దెరచి 
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము (2) || ప్రభు || 

3.ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని - 
యేసు నీ గాయము - రేపితిని (2)
మోసపోతి నేను - దృష్టి దొలగితి 
దాసుడ నన్ను - జూడనిమ్ము (2) || ప్రభు || 

4.ఎందరేసుని వైపు - చూచెదరో - 
పొందెదరు వెల్గు - ముఖమున (2)
సందియంబు లేక - సంతోషించుచు - 
ముందుకు - పరుగెత్తెదరు (2) ||ప్రభు||

5.విశ్వాసకర్తా  ఓ యేసు ప్రభూ - 
కొనసాగించువాడా - యేసు ప్రభూ (2)
వినయముతో నేను - నీవైపు జూచుచు - 
విసుగక - పరుగెత్త నేర్పు (2) || ప్రభు || 

6.కంటికి కనబడని - వెన్నియో - 
చెవికి వినబడని - వెన్నియో (2)
హృదయ గోచరము - కాని వెన్నియో 
సిద్ధపరచితివా - నాకై (2) || ప్రభు || 

7.లోక భోగాలపై  నా నేత్రాలు - 
సోకకుండునట్లు  కృపజూపుము (2)
నీ మహిమ దివ్య - స్వరూపమును - 
నిండార నను - జూడనిమ్ము (2) || ప్రభు || 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...