Showing posts with label 631 ఇదిగో నీరాజు వచ్చుచుండె. Show all posts
Showing posts with label 631 ఇదిగో నీరాజు వచ్చుచుండె. Show all posts

16 August 2020

Idigo Nee Raju Vachuchunde | ఇదిగో నీరాజు వచ్చుచుండె

631

ఇదిగో నీరాజు వచ్చుచుండె - సీయోను కుమారి  సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||

1.నీదురాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చు చుండె ||ఇదిగో|| 
 
2.రక్షణగలవాడుగ - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం - వచ్చు చుండె ||ఇదిగో|| 

3.స్వాతికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకె - వచ్చుచుండె ||ఇదిగో||

4.దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ||ఇదిగో||

5.ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో 
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ||ఇదిగో||

6.దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె ||ఇదిగో||

7.యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ||ఇదిగో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...