Showing posts with label Christian marriage songs. Show all posts
Showing posts with label Christian marriage songs. Show all posts

12 December 2021

Ekkadekkado Putti | ఎక్కడెక్కడో పుట్టి

ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం - ఇది సృష్టిలోని చిత్రం (2)

1.ఒంటరి బ్రతుకును విడిచెదరు - 
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి - 
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||

2.గత కాల కీడంతా మరచెదరు -
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు -
ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని||

3.ఫలియించి భూమిని నింపెదరు - 
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ -
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||
DOWNLOAD MP3 SONG HERE 👇

03 June 2021

Nalugeyare Ammalaara Naluguru | నలుగేయరే అమ్మలార నలుగురు

నలుగేయరే అమ్మలార - నలుగురు జేరి ప్రేమ మీర
మన ప్రభువును మదినుంచుకొని మనస్సున సంతోషం నింపుకొని

1.ఇంతులు మీరందరు చేరి చేమంతులు చేత బట్టండి 
మల్లెలు దండలుగా కూర్చి పెళ్ళికూతురి సిగలో జుట్టండి 
అందమైన ఆ మోములో సిగ్గులు చూడండి చందమామ ప్రతిబింబమని పాటలు పాడండి 

2.తైలము దండిగ రాసి తలస్నానము చేయించండి
అగరు గంధము పూసి పెళ్ళికళను తెప్పించండి
పల్లకిలోని ప్రియురాలి ఊసులె చెప్పండి అల్లరిగా సాగే కథల ముడులే విప్పండి 

3.మేని ఛాయ మెరవంగ మంచి పసుపు రాయండి
సువాసనలు విరియంగ అత్తరు పన్నీరు జల్లండి
వరుని ముందు నిలవంగ సిద్ధము చేయండి ప్రియునితో చేయి కలపంగ అక్షింతలు వేయండి
DOWNLOAD MP3 SONG HERE 👇

Vivahamannadi Pavithramainadi | వివాహమన్నది పవిత్రమైనది

వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది 

1.ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు

2.ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు 

3.దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు

DOWNLOAD MP3 SONG HERE 👇

Kurisindi Navvula Vaana | కురిసింది నవ్వుల వాన వివాహ

కురిసింది నవ్వుల వాన - వివాహ శుభ సమయాన - 
నాలో కలిగే సందడి - నాలో కదిలె సవ్వడి - 
హృదయాలు స్పందించె వేళ - ఈ వేళ (2)
కురిసింది నవ్వుల వాన - వివాహ శుభ సమయాన

1.కోయిలమ్మ పాడె కమ్మనైన ఏదో రాగం - 
దాగెనమ్మ సిగ్గు దొంతరల్లో ఏదో భావం - 
ఒంటరి జీవితం జంటగ మార్చెనే - 
ఇరు హృదయాలను ఒకటిగ కూర్చెనే - 
దేవుడే కలిపిన బంధం - వీడిపోని అనుబంధం ||కురిసింది||

2.గోరుమామిడమ్మ పూచెనమ్మ అనురాగం -
మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం -
వాక్యపు వెలుగులో- బ్రతుకులు పండగా - 
దేవుడు తోడుగ మీతో నుండగా - 
సాగేటి ఈ బంధం - వీగిపోని అనుబంధం ||కురిసింది||
DOWNLOAD MP3 SONG HERE 👇

O sodara anduko ee swagatha | ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి

ఓ సోదరా అందుకో - ఈ స్వాగత కుసుమాంజలి - మేలుదొరికె నేడు చూసుకో - నీ జీవితం పండించుకో (2)

1.తల్లిదండ్రుల విడచి - తన ఇంటిని మరచి - నీతోనే లోకమై జీవించగా (2)
కలకాలం ఈ ధరలో నీతో నడువ (2) 
నీ ముందర నిలిచే సతి చేయి అందుకో 
ఓ సోదరీ అందుకో - ఈ స్వాగత కుసుమాంజలి 
వెలుగుతో నిన్ను నింపుకో - నీ జీవితం పండించుకో

2.పుట్టినింటి ఘనత - తరతరములు నిలువ - నీ భర్త గౌరవం కాపాడగా (2) 
అణుకువతో మెలుకువతో ఇంటిని తీర్చ (2) 
వినయముతో నీ పతికి అర్పించుకో 
ఓ సోదరా అందుకో - ఈ స్వాగత కుసుమాంజలి 
వెలుగుతో నిన్ను నింపుకో - నీ జీవితం పండించుకో

3.పరలోక సైన్యం - తిలకించుచుండ - పరిశుద్ధుల సంఘం ప్రార్థించగా (2) 
అనురాగం ఐక్యతతో జత కమ్మని - 
పలికింది ప్రకృతి ఈ స్వాగతం
ఓ సోదరీ అందుకో - ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో - నీ జీవితం పండించుకో
 నీ జీవితం పండించుకో.. నీ జీవితం పండించుకో..
 నీ జీవితం పండించుకో...
DOWNLOAD MP3 SONG HERE 👇

02 June 2021

Ee Parinaya Shubhavela Swagatham | ఈ పరిణయ శుభవేళ స్వాగతం

ఈ పరిణయ శుభవేళ స్వాగతం -
నవ వరుడా (వధువా) స్వాగతం (2) 
సంధించను నీ సతిన్ (పతిన్)
అందుకొనుమా స్వాగతం (2)

1.దివ్యమైన స్నేహ బంధం అలరించగా - 
నవ్యమైన ప్రేమ గీతం పలికించగా -
మరువక తండ్రి మాట మదినుంచగా - 
వరుడగు క్రీస్తు బాట పయనించగా -
మరుమల్లెలు పలికాయి స్వాగతం (2)
కలగాలని దీవెనలు స్వాగతం (2) ||ఈ పరిణయ||

2.కాలు మోపు ఇంటిలోన మణిదీపమై - 
మేలు చేసి తృప్తినొందు గుణశీలియై - 
భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై - 
కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తియై -
విరజాజులు పలికాయి స్వాగతం (2) 
వెలగాలని ఈ ధరలో స్వాగతం (2) ||ఈ పరిణయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Kalyanam Kamaneeyam ee | కళ్యాణం కమనీయం ఈ సమయం

కళ్యాణం కమనీయం - 
ఈ సమయం అతి మధురం
అ.ప: దేవా రావయ్యా - 
నీ దీవెనలీవయ్యా (2)

1.ఏదెను వనమున యెహోవ దేవా - 
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున - నవ దంపతులను - 
నీ దీవెనలతో నింపుమయా (2) ||కళ్యాణం||

2.కానా విందులో అక్కర నెరిగి - 
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే - అండగా నిలిచి - 
కొరతలు తీర్చి - నడుపుమయా (2) ||కళ్యాణం||

3. బుద్దియు జ్ఞానము సంపదలన్నియు -
 గుప్తమై యున్నవి నీయందే (2)
ఇహపర సుఖములు - మెండుగ నొసగిన - 
ఇల వర్దిల్లగ జేయుమయా(2) ||కళ్యాణం||
DOWNLOAD MP3 SONG HERE 👇

02 August 2020

Devara nee deevenalu | దేవర నీ దీవెనలు

564
దైవాశీర్వాదము
రా - శంకరాభరణము,  తా ఆది 

దేవర - నీ - దీవెనలు ధారాళముగను వీరలపై = బాగుగా  వేగమెదిగనిమ్ము - పావన యేసునిద్వారగను ||దేవర||

1.దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్  సొంపుగ నింపుగ పెంపగుచు స - హింపున వీరు సుఖించుటకై  ||దేవర||

2.ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో = శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము ||దేవర||

3.ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచుదా = మెప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకను బంపు కృపన్ ||దేవర||

4.తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగా = గాపుగ బ్రాపుగ దాపునుండి - యాపదలన్నియు బాపుచును ||దేవర||

5.సాధులుగన్ చేయుటకై - శోధనలచే నీవు శోధింపగా = కదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్ ||దేవర||

6.మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను = తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండించవే ||దేవర||

7.ఇద్దర వీరిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై = శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్ ||దేవర||

8.వాసిగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని = మా సకలేశ్వర నీ సుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్ ||దేవర||
                          - అల్లారి పెద్ద వీరాస్వామి
DOWNLOAD MP3 SONG HERE 👇

26 May 2020

Parishudha Parishudha | పరిశుద్ధ పరిశుద్ధ

20   
త్ర్యేక దేవుని స్తుతి
రా - శంకరాభరణము,  తా - అట

   పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = వరదూత లైన నిన్ - వర్ణింప గలరా ||పరిశుద్ధ||

1.పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ = నిరుపమ బలబుద్ధి - నీతి  ప్రభావా  ||పరిశుద్ధ||

2.పరిశుద్ధ తనయుడ - నర రూప ధారుడ = నరులను రక్షించు - కరుణాసముద్రా ||పరిశుద్ధ||

3.పరిశుద్ధ మగునాత్మ - వరము లిడు నాత్మ = పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ||పరిశుద్ధ||

4.జనక కుమారాత్మ - లను నేక దేవా = ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా ||పరిశుద్ధ||
                          - యెషయా వీర మార్టిన్
____________________________
Parishudha parishudha - parishudha prabhuva = Vara dhuthalaina nin varnimpa galara ||parishudha||

1.Parishudha janakuda - paramathma rupuda = Nirupama Bala budhi - neethi prabhava ||parishudha||

2.Parishudha thanayuda - Nararupa dharuda = Narulanu rakshinchu - karuna samudra ||parishudha||

3.Parishudha magu naathma - varamu lidu naathma = Paramananda prema - bhakthula kiduma ||parishudha||

4.Janaka kumarathma - lanu neka deva = Ghana mahima chellunu - dhanara nithyamuga ||parishudha||
                     - Yeshaia veera Martin
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...