Showing posts with label Deva Kumara Deenopakara. Show all posts
Showing posts with label Deva Kumara Deenopakara. Show all posts

19 August 2021

Deva Kumara Deenopakara | దేవ కుమారా దీనోపకారా

70                 దేవకుమారునికి స్తోత్రము
రా – శంకరాభరణము                      తా - ఆది
                  
దేవ కుమారా – దీనోపకారా = నా వంక దయఁ జూప = నా వంక దయఁ జూప – నా యన్న రారా ॥దేవ॥

1. వృక్షముఁ బాసిన – పక్షి నేనయ్యా = అక్షీణ కరుణచే - రక్షింపవయ్యా ॥దేవ ॥

2. పాపుల పాలిటి – పరమదయాళూ పరమ దయాళూ = దీవించు నీ దయ – దీనునికిపుడు ॥దేవ ॥

3. వినుతింతు సద్గుణ – విమల విచారా = ననుఁ బ్రోవవే యేసు – నామావతారా || దేవ ॥

4. భజనఁ జేసెద నిన్ను – నిజ రక్షకుండ = విజయముఁ జేయవే – నజరేతు వాడా || దేవా||

5. కనికర మత్యంత – కరుణయుఁగలదు = నిను నమ్ము వాని చే – తిని వీడ వలదు || దేవ ||

6. మహనీయ గుణమణి – మండిత దేవా = ఇహబాధ బాపవే – ఇమ్మానుయేలా || దేవ ॥
                                    - మిక్కిలి నమూయేలు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...