Showing posts with label కట్టెలపై నీ శరీరం కనిపించదు. Show all posts
Showing posts with label కట్టెలపై నీ శరీరం కనిపించదు. Show all posts

16 April 2022

Kattelapai nee shareeram | కట్టెలపై నీ శరీరం కనిపించదు

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై||

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా||

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...