Showing posts with label ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ. Show all posts
Showing posts with label ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ. Show all posts

08 November 2022

Yelo yelo yelo antu | ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ


ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు  
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా 
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే 
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు 
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు 
నిన్నే కోరి నిన్నే చేరి 
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు 

1.లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా -
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు 
ఘనమైన ఒక వేడుక   
ఆ గొల్లలేగా - దరువేసే చూడు 
మెస్సయ్య - పుట్టాడనీ          
మన మెస్సయ్య - పుట్టాడనీ    

2.వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ -
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు 
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు 
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే 

3.ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా - 
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు 
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు 
యేసయ్య మనకుండగా 
మన యేసయ్య మనకుండగా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...