Showing posts with label O vinumu sodara. Show all posts
Showing posts with label O vinumu sodara. Show all posts

16 May 2026

ఓ వినుము సోదర పరమ O vinumu sodara


ఓ .... వినుము సోదర పరమ గురుని బోధ -నమ్మిన తొలగు నరక బాధ
(2)
కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి (2)
జగమునందు ఎందెందు వెదకినా నీతిపరుడు లేడు - దేవుని వెదకు వారు లేరు (2) || ఓ .... వినుము ||

1. పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి  .. (2)
ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి -నరకపు బాధ గొప్పదండి (2) || ఓ .... వినుము ||

2.నరకమనగా పూదోట కాదది అగ్నిగుండమండి...(2)
అగ్నిఆరదు కాలెడివారికి చావు రాదు సుమ్మి -విడుదల పొందలేరు అండి (2) || ఓ .... వినుము ||

3.ఏమి చేసి ఆ నరక బాధ తప్పించు కొందురండి (2)
వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్ధము సుమ్మండి - పాపము బాపలేవు అండి (2) || ఓ .... వినుము ||

4. ఆదిదేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు  (2)
రెండు వేయిల ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు-నరుడై తాను పుట్టినాడు (2) || ఓ .... వినుము || 

5.ఆకాశమందున సూర్యుని వలెనె దేవుడొక్కడండీ (2)
నరుడై పుట్టిన దేవుని  నామము యేసు స్వామి సుమ్మి - వెలుపల వెదకి దండగండి  (2) || ఓ .... వినుము ||

6.యెల్ల వ్యాధులను చిటికలోన  ఏసన్న బాగుచేసే (2)
కుంటిని గుడ్డిని మూగవారల ముట్టి బాగుచేసే -చచ్చిన వారి కూడా లేపే (2) || ఓ .... వినుము || 

7.పాపము బాపను జగతిలోనాకధికారమున్నదనెను (2)
పాపాత్ముల పాపముబాపి క్రొత్త బుధ్దినిచ్చే - వారిని మంచివారిచేసే (2) || ఓ .... వినుము ||

8. నరులను మోక్షము చేర్చే మార్గము నేనే అనినాడు (2)
నేను గాక వేరొకరు ముక్తిని ఇవ్వజాలరనెను -నేనే శాంతినిత్తుననెను (2) || ఓ .... వినుము ||

9. యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు (2)
గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు -స్వామిని చంప వెదకినారు (2) || ఓ .... వినుము ||

10.ఎంతవారికైనా ననుజంపను సాధ్యముకాదనెను .. (2)
నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను -చచ్చి తిరిగిలేతుననెను (2) || ఓ .... వినుము ||

11. ప్రేమ చూపు స్వామిని దుష్టులు బందించివేసిరయ్యో  (2)
ఇనుప కొక్కెముల చేర్మకోలలు చేతపట్టినారు - వాటితో గురుని కొట్టిరయ్యో(2) || ఓ .... వినుము ||

12.గురుని మోముపై పిడికిలితో పల్గుద్దిరి జనులయ్యో (2)
మొఖముపైన వెండ్రుకలు పెరికిరి  నెత్తురుబిగిచిందే - మొఖమున ఉమ్మివేసిరయ్యో(2) || ఓ .... వినుము ||

13.ఇనుపముళ్ళ కీరీటమల్లి ఆ జాలిలేని జనులు (2)
గురుని శిరముపై  పెట్టి కొట్టిరి  - గురుడు తల్లడిల్లే జివ్వున రక్తమోదిగి కారే (2) || ఓ .... వినుము ||

14. పరమ గురుని ఒక తరకు కొయ్యపై పండబెట్టినారు ..(2)
కాళ్లలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి- మరి వ్రేలాడదీసిరయ్యో(2) || ఓ .... వినుము ||

15. అంతట యేసు స్వామి బాధతో అరచి కేకపెట్టి .. (2)
నీకు బదులుగా అయ్యలారా యేసయ్య మరణమాయె - అధిగని భూమి దద్దరిల్లే (2)  || ఓ .... వినుము ||

16. పాపమెరుగని యేసు స్వామిని పాప నరులమూక . .(2)
చిత్రహింసలు పెట్టి ప్రక్కన ఈటె పొడిచిరయ్యో -నెత్తురు నీరు కలిసి పారే (2) || ఓ .... వినుము ||

17. యేసు స్వామి సామాధిలోపల మూడుదినములుండె (2)
చావు గెలచు తాజెప్పినట్టు బల్మహిమతోడ లేచే - స్వర్గపు తలపు యేసు తెరచే (2) || ఓ .... వినుము ||

18.దిగులికేల ఓయమ్మలార ఏసన్న దరికి చేరి (2)
పాపము బాపుము  గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్ష పురము చేర్చు  (2) || ఓ .... వినుము ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...