Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

01 June 2026

స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము Sthothrarpana narpinthamu japa dhupamu

283
పరిశుధ్ధ సామభక్త్వము 

స్తోత్రార్పణ నర్పింతము - జప - ధూపము వేసి కీర్తింతము - పాత్రుం డైన శ్రీ యేసుఁడు - పరమ - భోజనాంశమైనందున ||స్తోత్రార్పణ||

1.కృతజ్ఞతా స్తోత్రంబులన్ - దేవ - కృపార్థంబై చేయుదము = క్షీతి నాతండు బలి నియ్యఁగాఁ - పుట్టె - నూతనంపు నిబంధన ||స్తోత్రార్పణ||

2.పాపము లన్ని హరించెను - మా - ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ దీనిఁ దలంచుచు - నిఁక - నెన్నఁడు యేసుని భజింతము ||స్తోత్రా||

3.చావు నుండి రక్షించెను - స - జీవులలో లెక్కించెను = దేవుని కిఁక నర్పింతము స - జీవార్పణ బలిగను ||స్తోత్రా||

3.పుణ్యరక్త శరీరముల - లోఁ - పాలొందు మన మందరము = అన్యులము కానేరము - దై - వాన్యోన్యంబు నొందినాము ||స్తోత్రా||

4.మరణ శ్రమల స్మరింతము - ప్రభు - తిరిగి వచ్చు పర్యంతము = ధర నా యేసు మరణంబును - యింకఁ చిరకాలంబుఁ జాటింతము ||స్తోత్రా||
- సమూయేలు పాక్యానాధము

సుఖ మిచ్చెగద మాకు Sukha micche gada maaku

255
దేవుని వాక్యానందం
రా - మోహన, తా - అట 

సుఖ మిచ్చెగద మాకు - ప్రభుయేసువా నీ - సురుచిరమగు వాక్కు = నిఖిలకల్మష వనమునకు దవ - శిఖి శిఖిలవలె గాల్చు నీదగు - ముఖవికాసిత వాక్యములు బహు - సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||

1.జగతిలోపల మెండుగ - నుండిన వివిధ - మగు శాస్త్రములు జూడఁగ = మిగుల గందరగోళమై మరి - యొకటి కొకటి విరుద్ధముగ మ - ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి - తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||

2.నీ వాక్యముల భావము - నమ్మిన పాపి - జీవుల కది జీవము = కేవలం బగు ధర్మశాస్త్రము - దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు - ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||
- పురుషోత్తము చౌదరి 

31 May 2026

సమకూర్చుము తండ్రి క్రైస్తవ Samakurchumu thandri kraisthava

261
ఐక్యత 
(చాయ: తన యక్రమములకు)
రా - ఖరహర ప్రియ,  తా - ఆది 

సమకూర్చుము తండ్రి - క్రైస్తవ - సభలో నైక్యతను - ద్వరలోఁ = దమ ప్రియ కొమరుఁడు - శ్రమలకుఁ బూర్వం - బమితాసక్తితో - నడిగిన విధ మున ||సమ||

1.దేశము రక్షణకై - తండ్రి - దేవుని మహిమార్థం = నిజముగ - వాసిగఁ గూర్పను - భాసుర ఐక్యం - బాశతో నిన్నిటు - నడుగుచునుండఁగ ||సమ||

3.యేసుని నామమున్ - మమ్ముల - నేకముజేయు మిఁకఁ - దండ్రి = నీ సిలువను జూ - చుచు మే మిలలో - వాసిగఁ బ్రేమతో - వర్థిల్లుటకై ||సమ||
- సరెళ్ళ సమూయేలు సుబ్బయ్య 

సంఘ శిరసై వెలయు ప్రభువా Sangha sirasai velayu prabhuva

263
క్రీస్తు సంఘమునకు శిరస్సు
రా - బేహగ్,    తా - ఆది 

సంఘ శిరసై వెలయు ప్రభువా - సత్యకృప సంపూర్ణ ప్రభావా = సర్వ క్రైస్తవ సంఘ మహి మా - స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ||

1.సంఘ యస్థిభారము వివే - సంఘ జీవాధారము నీవే = సర్వ జనరక్షణము నీవే - సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ||

2.తరణి చుట్టు తారాగ్రహములు - పరివృత్తంబై తిరుగు రీతిని = తల యె క్రీస్తయ తనువే భక్తులై - తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ||

3.నూతనాత్మ నూతన జన్మ - నీతి సేవా నిరతియు గలిగి = నిత్య మాతనియందు నిలచి - నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ||

4.ఆత్మశుద్ధి - అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి = ఆత్మఫలములు జాపన నేర్చిన - యను భవంబే క్రైస్తవంబు ||సంఘ||

5.విశ్వసింతుము నిన్నే మేము - విమల జీవ ప్రదాయకుండ = వరుడనీవై వరదుడ వీవై - విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ||
- చెట్టి భానుమూర్తి 

30 November 2025

Sudinam janulaku సుదినం సర్వజనులకు సమాధానం

సుదినం సర్వ జనులకు 

సుదినం సర్వజనులకు - సమాధానం - సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు - 2 llసుదినంll

1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం ఆ.. ఆ.. (2)
పరముకు పధమై అరుదించె - వెలుగై యేసుడు ఉదయించె (2) llసుదినంll

2. కన్నీటితో నిండిన కనులన్ - యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. (2)
ఉదయించెను కాంతిగనాడు - విరజిమ్మెను శాంతిని నేడు (2) llసుదినంll

3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ.. (2)
త్వరలో వచ్చును ఆ ఱేడు - సిద్ధపడుమ ఇక యీనాడు - (2) llసుదినంll

15 May 2025

Sthutinchi paadedam స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా


స్తుతించి పాడెదం - స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం - ఉదయ సాయంత్రము
స్తుతుల సింహాసనం మీదాసీనుడా 
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||

1. గతకాలమంతా నీవు - మము కాచి కాపాడావు - వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు - మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||

2. కరుణా కటాక్షములను - కిరీటములుగాను - ఉంచావు మా తలపై (2)
పక్షిరాజు యవ్వనమువలె - మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||
Download 👇

15 March 2025

Siluvalo baliyaina సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల

పల్లవి: సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు

1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే

2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా

3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా

4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి

5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా

6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా

7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూ

13 October 2024

Santhshamutho nichedu varini సంతోషముతో నిచ్చెడు వారిని

 575
క్రైస్తవ దాతృత్వము 
రా -సౌ రాష్ట్ర,  తా - ఆది 
(చాయ: మనసా నందము బొందుటకన్నను)

సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుఁడు ప్రేమించున్ = వింతగ వలసిన - దంతయు నొసంగును - వినయ మనసుగల - విశ్వాసులకును ||సంతోషముతో||

1.అత్యాసక్తితో నధికప్రేమతో - నంధకార జను లందఱకు = సత్య సువార్తను - జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు ||సంతోషముతో||

2.వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు - బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||

4.దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిఁ దీర్చుటకై = నిక్కపు రక్షణ - నిద్ధరలో నలు - ప్రక్కలలోఁ బ్రక -టించుట కొఱకై ||సంతోషముతో||

5.ఇయ్యండీ మీ కీయం బడు నని - యియ్యంగల ప్రభు యే సనెను = ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియ్యవలెను మన - యీవుల నిఁకను ||సంతోషముతో||

6.భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు - యుక్త మటంచు ను = దారతతో - శక్తికొలఁది మన భుక్తి నుండి యా - సక్తితో నిరతము - నియ్య వలెను ||సంతోషముతో||
మోచర్ల రాఘవయ్య

23 July 2023

Sannuthinchedanu sathathamu సన్నుతించెదను సతతము


 సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము 
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును 
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును

1.శ్రేష్టమైనవి కలిగించెను నష్టము 
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము 
ధనము దరిచేర్చెను నాశనము 
పరపతి చూపించెను దుష్టత్వము

2.నిలుపుకొనెదను నీ మాదిరి వినయము 
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము

10 May 2023

Saarepathu urilo సారేపతు ఊరిలో ఒక విధవరాలు

హొయ్ ల హొయ్ హొయ్ ల – హొయ్ ల హొయ్ ల హొయ్ హొయ్ ల

సారేపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)
కరువు కాలమొచ్చేను – బ్రతుకే కష్టమాయెను (2)
కట్టెలు ఏరుచుండెను – చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను ||హొయ్||

1.తొట్టిలో కొంచెమే పిండి వుంది ..!
బుడ్డిలో కొంచెమే నూనె వుంది ! (2)
రొట్టెలురెండు చేసుకుని – తిందామంటూ తలచుకొని ||హొయ్||

2.కరువులో ఏలీయా అచటికొచ్చెను – రొట్టెలు చేసి తెమ్మనెను (2)
నో నో అనక పోయెను రొట్టెలు ఏలీయా కిచ్చెను
ఆశీర్వాదం పొందెను – కరువులో హాయిగ బ్రతికెను ||హొయ్||

సారేపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను (2)
కరువు కాలమొచ్చేను- బ్రతుకే కష్టమాయెను(2)
కట్టెలు ఏరుచుండెను- చిత్రం అక్కడ జరిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను ||హొయ్||

07 April 2023

Siluvalo vreladu prabhuve | సిలువలో వ్రేలాడు ప్రభువే

సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||

కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||

తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||

పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువ||

లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||

ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువ|| దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||

శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువ||

మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువ||

నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను

Siluvalo vreladuchunna yesuni | సిలువలో వ్రేలాడుచున్న యేసుని


సిలువలో వ్రేలాడుచున్న యేసుని చూడు
పాపులకై ప్రాణం విడచిన యేసుని చూడు (2)
నీకోసమే నాకోసమే /
మనలను రక్షించుట కోసమే (2)
॥సిలువలో॥

1.నా పాపములన్ని నా శాపములన్నీ
సిలువలో నీ రక్తముతో కడిగినావు (2)
ఏ పాపము లేని నీవు లోక పాపములను (2)
సిలువలో మాకై విడిపించావు (2)
॥సిలువలో॥

2.ద్రోహినైన నన్ను నా పాప దోషాలు
సిలువలో నీవే తొలగించావు (2)
ఏ దోషములేని నీవు లోక దోషములను (2)
సిలువలో మాకై భరియించావు (2) ||సిలువలో||

3.నా మరణ శిక్షకై నా పాప క్షమాపణకై
కలువరి సిలువలో ప్రాణం అర్పించావు (2)
ఏ శిక్షలేని నీకు లోక శిక్షలన్నిటికై (2)
సిలువలో ఘోరంగా మరణించావు (2) ||సిలువలో||
రచన: K.ప్రేమ్ కుమార్

12 March 2023

Samarpinchedanu samasthamu | సమర్పించెదను సమస్తము

సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
  
1.శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోకజ్ఞానము ఆయెను వెర్రితనము ధనము దరిచేర్చెను నాశనము పరపతి చూపించెను దుష్టత్వము 
 
2.నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము

02 March 2023

Soundarya Seeyonulo lyrics|సౌందర్య సీయోనులో

Soundarya Seeyonulo - సౌందర్య సీయోనులో Hosanna Ministries 2023 new Album Song-3 Pas.ABRAHAM

బహు సౌందర్య సీయోనులో - స్తుతి సింహాసనాసీనుడా (2)
నా యేసయ్య ని ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కొలువయానే
నను జీవింపచేసే ని వాక్యమే - నా కిలలోన సంతోషమే ||బహు||
 
1.పరిశుద్ధతలో మహనీయుడవు - నీ వంటి దేవుడు జగమునలేడు (2)
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ - నీకేనా హృదయార్పణ (2)||బహు||
 
2.ఓటమి నీడలో క్షేమములేక - వేదన కలిగిన వేళలయందు (2)
నీవు చూపించిన ని వాత్సల్యత - నా హృదయాన నవ జ్ఞపికా (2)||బహు||

3.ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు - చల్లని ని చూపే ఔషధమే (2)
ప్రతి అరుణోదయం ని ముఖదర్శనం - నాలో నింపెను ఉల్లాసమే (2)||బహు||

Edo asha nalo neethone| ఏదో ఆశ నాలో నీతోనే| Stotraganam | స్తోత్రగానం

Stotraganam - స్తోత్రగానం Hosanna Ministries 2023 new Album Song-4

ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ (2)
ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మితిలేని
ప్రేమా చూపించినావు శ్రుతిచేసి నన్ను
పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే||ఏదో||
 
1.పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్యా ||ఏదో||
 
2.నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము తేజోమయా నా
యేసయ్యా ||ఏదో||

11 December 2022

Sarvonnatha sthalamulalo lyrics | సర్వోన్నత స్థలములలోన


సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ - ఆయనకిష్టులకు ఇలలో సమాధానమే
అని పరలోక సైన్య సమూహం పాడి కొనియాడే ప్రభువుని నామం
మనకు రక్షాకుండు ఉదయించినాడని ప్రకటన చేసిరి ||సర్వోన్నత||

1.మరియ భయపడుకు నీవనీ - దేవదేవుని కనేటి ధన్యతే నీదనీ (2)
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి - నీవు గర్భము ధరియింతువన్నారు (2)
లోక పాపాలు పరిహరింప దేవుడు ధరకే ఏతెంచెను
మనము కోల్పోయినా మహిమ తిరిగి దయచేయునూ సంతోషమే (సర్వోన్నత)

2.మంద కాపరులకు శుభవార్తను - దూత తెలిపెను ఆ రాత్రి వేళలో (2)
మనకొరకురక్షకుడుపుట్టియున్నాడు మనము ఎదురు చూసే దేవుడు వేంచేసెను (2)
మన ఆశలు నెరవేర్చె మహాదేవుడు - రాజరాజసుతుడు
మనకు పరలోక రాజ్య ప్రవేశమును దయచేయ దేవుడే దిగివచ్చెను ||సర్వోన్నత||

13 November 2022

Samarpinchedhanu samasthamu |సమర్పించెదను సమస్తము

సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును

శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము

నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము

09 October 2022

Sthuthiyinchi keerthinchi | స్తుతియించి కీర్తించి ఘనపరతును


స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||  

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి -
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||  

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి -
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||  

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||

30 September 2022

Samrpinchedanu samasthamu|సమర్పించెదను సమస్తము


సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును, 
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును   

1.శ్రేష్టమైనవి కలిగించెను నష్టము 
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము 
ధనము దరిచేర్చెను నాశనము 
పరపతి చూపించెను దుష్టత్వము  

2.నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...