Showing posts with label U. Show all posts
Showing posts with label U. Show all posts

28 April 2024

Uhinchalenayya vivarinchalenayya ఊహించలేనయ్యా వివరించలేనయ్యా


ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||

1.నా మనసు వేదనలో - నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||

2.నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||

27 August 2023

Unnavu naathodu unnavu ఉన్నావు నాతోడు ఉన్నావు


ఉన్నావు నాతోడు ఉన్నావు నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉన్న నా దైవమా (2)

నా ఆధారమైయున్న నా యేసయ్య నా కొండయు కోటయు నీవేనయా..

నా దాగు స్తలమ నా యేసయ్యా నిను నేను ఆరాదింతును ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ||ఉన్నావు||

1.నా కష్ట సమయంలో నా తోడున్నావు - నను ఓదార్చి బలపరచి నిలబెట్టావు (2)
విడువను యెడబాయను అని అభయమిచ్చిన కృపామయా (2) ||ఆరా||

2.నా దీన స్థితి లో సంపన్న స్థితిలో సమృద్ధినిచ్చి సహాయము చేసితివి (2)
నిత్యము నన్ను కాపాడుచు నీ - కృపలో దాచిన కృపామయ్యా (2) ||ఆరా||

06 March 2022

Uhinchaledhayya dheevisthavani |ఊహించలేదయ్య దీవిస్తావని

ఊహించలేదయ్య దీవిస్తావని
ఊహించనే లేదయ్య కరుణిస్తావని
కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును
నమ్మకముగా యదార్ధతతో నీ కృపలో నే సాగెదన్

1. నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాధరించిన నా తండ్రివై
నా తోడువై నా నీడవై నా కడుపు నింపిన నా తల్లివై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య

2. ఆ వేదనలో ఆ శోధనలో నా చెంత చేరిన నా దైవమై
నీ జాడలో ఆ కల్వరిలో నా చింత తీర్చిన నా దైవమై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య

02 January 2022

Unnanaya Nenunnanaya | ఉన్నానయ నేనున్నానయ

ఉన్నానయ నేనున్నానయ 
నీ ప్రేమ వలనే ఇలా వున్నానయ 
ఉంటానయ నేనుంటానమా 
నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయ 

నా మనసంతా నీవే నా బ్రతుకంతా నీవే 
నా ప్రతి శ్వాస నీవే నా ప్రతి ధ్యాస నీవే 

నీ కృపా నాయెడల లేనిచో 
క్షణమైన నేనుండలేనయా 
నీ హస్తం నా తోడు రానిచో 
ఒక అడుగైనా నే వేయలేనయా
నీ కృపను చూపావు అభయము నిచ్చావు 
కనుపాపవలె కాపాడుచున్నావు 

నీవు నన్ను ప్రేమించడానికి 
ఏ మంచి నాలోన లేదయా 
నీవు నన్ను హెచ్చించడానికి 
కారణమేమిము లేదయా 
అయినా ప్రేమించావు నన్ను హెచ్చించావు 
విడువక నా యెడల కృపాచూపుచున్నావు

23 December 2021

Unnathamaina nee krupa | ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము

ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ 
నాపై నిలిపినావు యేసయ్యా (2)
ఎంతటిదానను నీ దయ పొందుటకు 
నీ పాదములను చేరి ఆరాధించుటకు (2)
నను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ (2)

కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణడా 
సదా నిలుచును నీ కృప (2)
దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించవు (2)
నా కోట నీవే నా కేడెము నీవే (2)

లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా 
నా చేరువైనది నీవేనాయ్య (2)
నిను విడువను ఎన్నడూ ఎడబాయానన్నావు (2)
ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు (2)

నీ వాక్యమే దేవా నా పదములకు 
దీపమాయెను అనుదినము (2)
ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే (2)
ఆరాధించెద నా జీవిత కాలము (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

12 December 2021

Udayinchinadu kreesthudu | ఉదయించినాడు క్రీస్తుడు

107 
'నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు'
రా - సురటి  
తా - త్రిపుట

ఉదయించినాఁడు - క్రీస్తుఁడు నేఁడు - ఉదయించినాఁడు = విదితయౌ మరియ ¹నందనుఁడై యిమ్మానుయేల్ = ²సదయుఁడై చెడియున్న ³పృథివికి - ⁴నొదవ ⁵సమ్మద మల పిశాచికి - ⁶మద మణంగను సాధు జనముల - హృదయముల ⁷ముద మెదుగునట్లుగ ||నుదయించి||

1.ఏ ⁸విభునివలన - నీ జగ మయ్యె - నా విభుఁ డీయిలను = దైవత్వమగు మను - ష్యావతారముఁ దాల్చె = జీవులకు జీవనముపై తగ - దేవుఁడును దా నొక్కఁడు చిర-జీవియగు ప్రభు పాపి జీవులఁ - గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||యుదయించి||

2.యూదుల నడుమన్ - బెక్కగు భేదా - భేదముల్ బొడమన్ = వాదించి ప్రభు రాకఁ - గాదంచు మది నెంచి = మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ ⁹మద్ఘనుఁ డౌ - దయాళుఁడు ప్రాణ మీడుటకు ||నుదయించి||
                              - పురుషోత్తమ చౌదరి
_________________________________
¹కుమారుఁడు. ²కృపగలవాఁడు. ³భూమి. ⁴కలుగునట్లు. ⁵సంతోషము. ⁶గర్వము అణగులాగున. ⁷సంతోషము పెరుగునట్లు. ⁸ప్రభుని. ⁹నా.

30 September 2021

Uhinchalenu Prabhu Nee Mamathanu | ఊహించలేను ప్రభూ నీ మమతను


ఊహించలేను ప్రభూ నీ మమతను 
వివరించలేను యేసు నీ ప్రేమను 
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా 
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 

1.ఈ లోక గాయాలతో నిను చూడగా - లోతైన నీ ప్రేమతో కాపాడగా 
కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు - అలుపంటు రాదే సదా నీ కనులకు 
ప్రతి దినం ప్రతీ క్షణం - నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 

2. నాలోని ఆవేదనే నిను చేరగా - నా దేవ నీ వాక్యమే ఓదార్చగా 
ఘనమైన నీ నామమే కొనియాడనా - విలువైన నీ ప్రేమనే నే పాడనా 
ఇదే వరం నిరంతరం -నీతోనే సాగిపోనా - నా యేసయ్య

10 October 2020

Unnadu Devudu Naku Thodu | ఉన్నాడు దేవుడు నాకు తోడు

ఉన్నాడు దేవుడు నాకు తోడు 
విడనాడడెన్నడు ఎడబాయడు (2) 
కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||

1. గాఢాంధకారములో సంచరించినా - 
కన్నీటి లోయలో మునిగి తేలినా (2)
కరుణ లేని లోకము కాదన్ననూ (2)
కన్నీరు తుడుచును - నను కొన్నవాడు ||ఉన్నాడు||

2. యెహోవ సన్నిధిలో నివసింతును - 
చిరకాలమాయనతో సంతసింతును (2)
కృపా మధుర క్షేమములే - నా వెంటె ఉండును (2)
బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||
________________________________
Unnadu devudu naaku thodu - vidanaadadennadu yedabaayadu (2)
Kashtalalona nashtalalona 
vedhanalona shodhanalona ||unnadu||

1.Gadhandhkaaramulo sancharinchina
Kanneeti loyalo munigi thelina (2)
Karuna leni lokamu kadannanu (2)
Kanneeti thuduchunu Nanu konnavadu ||unnadu||

2.Yahova sannidhilo nivasintunu
Chirakalamaayanatho Santhasinthunu (2)
Krupa madhura kshemamule naavente undunu (2)
Brathuku kalamanthayu harshintunu ||unnadu||
DOWNLOAD MP3 SONG HERE 👇

26 July 2020

Oohinchaleni Melulatho Nimpina | ఊహించలేని మేలులతో

ఊహించలేని మేలులతో నింపినా - 
నా యేసయ్యా నీకు నావందనం
వర్ణించ గలనా నీ కార్యముల్ - 
వివరించ గలనా నీ మేలులన్ ||ఊహి||

1.మేలులతో నా హృదయం తృప్తి పరచినావు
రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతియింతును
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా 
స్తుతియింతును నీ నామంబును ||ఊహి||

2.నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువ నిచ్చినావు
నీ కృపతో నన్ను ఆవరించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||ఊహి||
DOWNLOAD MP3 SONG HERE 👇

11 July 2020

Unna paatuna vachu | ఉన్న పాటున వచ్చు

315
ఉన్న విధముననే నీ యొద్దకు వచ్చుచున్నాను
రా - ముఖారీ, తా - త్రిపుట

ఉన్న పాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధి కో రక్షకా = యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపు పైబడి - యున్న విదె నడలేక తొట్రిలు - చున్న వాడను నన్ను దయ గను ||యున్న||

1.కారుణ్య నిధి యేసు - నారక్షకా నీ శ - రీర రక్తము చిందుట = భూరి దయతో నన్ను నీదరి - జేర రమ్మని పిలుచుటయు ని - ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు - నాయెడ ||యున్న||
 
2.మసి బొగ్గువలె నా మా - నస మెల్ల గప్పెదో - ష సమూహములు మచ్చలై = ¹అసితమగు ప్రతిడాగు తుడువను - ²గసటు గడిగి పవిత్ర పరపను - ³నసువు ⁴లిడు నీరక్తమే యని - ⁵మసల కిప్పుడు సిలువ నిదె గని ||యున్న||

3.వెలపట బహు యుద్ద - ములు లోపటను భయము - కలిగే నెమది దొల గెను = పలు విధము లగు ⁶సందియంబుల - వలన బోరాటములచే నే - న లసి యిటునటు గొట్టబడి దు - ర్బలుడనై గాయములతో నిదె ||యున్న||

4.⁷కడు బీదవాడ ⁸నం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడి యున్నాను = ⁹సుడివడిన నా మదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి భాగ్యము - బడయవలసిన వన్ని నీ చే - ¹⁰బడయుటకు నా ¹¹యొడ యుడా యిదె ||యున్న||

5.నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని = ¹²కేవలంబగు ప్రేమచేతను - నీవు నన్ను క్షమించి చేకొని - ¹³భావశుద్ధి ¹⁴నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||

6.దరిలేని యానంద - కరమైన నీప్రేమ - ¹⁵తరమే ¹⁶వర్ణన చేయను = ¹⁷తెరవు కడ్డంబైన యన్నిటి- విఱుగ గొట్టెను ¹⁸గాన నే నిపు ¹⁹డరుదుగా నీ వాడ నవుటకు - మఱి నిజము నీవాడ నవుటకే  ||యున్న||
                           - పురుషోత్తము చౌదరి
_________________________________
¹నల్లవి. ²మైల. ³ప్రాణములు. ⁴ఇచ్చుట. ⁵ఆలస్యము చేయక. ⁶సందేహములు. ⁷మిక్కిలి. ⁸గ్రుడ్డివాడను. ⁹సొమ్మసిల్లిన. ¹⁰పొందుట.  ¹¹కర్త. ¹²ముఖ్యమైన. ¹³మనస్సు శుచిగా. ¹⁴చేసి. ¹⁵శక్యమా. ¹⁶స్తుతి. ¹⁷మార్గము. ¹⁸కనుక. ¹⁹ప్రియముగా.
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...