Showing posts with label పాపిని కృప జూపవయ్యా. Show all posts
Showing posts with label పాపిని కృప జూపవయ్యా. Show all posts

పాపిని కృప జూపవయ్యా Paapini krupa jupavayya

329 
క్షమాపణ వేడుట 
రా - కమాసు, తా - త్రిపుట 

పాపిని కృప జూపవయ్యా - దాపు జేరితిని యేసయ్యా = పాప భారము క్రింద శ్రమపడి - కృంగియున్నాను యేసయ్యా ||పాపి||

1.వేష భాషలతోడ నిండి - మోసపోయితిని యేసయ్యా = దోసిలొగ్గి నిన్ను చేరితి - దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపి||

2.నీతి లేని నాదు జీవిత - మేల నికనయ్యా యేసయ్యా = నీతి గరపి బ్రోవు మయ్యా - నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపి||

3.నీదు సిలువలోని ప్రేమ - నెంచదర మౌన? యేసయ్యా = నాదు కలుష మంత బాపి - కనికరింపు మా యేసయ్యా ||పాపి||

4.నీదు రక్తధారలేయిల - పాపికాశ్రయము యేసయ్యా = నీతిమంతుల జేయుమయ్యా - నీతిసూర్యుండా యేసయ్యా ||పాపి||

5.దాపుగోరినవారలకు నీ - ప్రాపుజూపితివి యేసయ్యా = పాపశాపము బాపి నిత్య - జీవమిడవయ్యా యేసయ్యా ||పాపి||

6.శాంతి గోరువార లెల్లనీ - చెంతకరగినచో యేసయ్యా - చింతలెల్ల దీర్చగలవు - శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపి||

7.పరమరక్షక నీదు ప్రేమ - నెరుగ తరమౌన యేసయ్యా = పరుల మైన మమ్ము బ్రోవ - వేచియున్నావా యేసయ్యా ||పాపి||

8.నాదు హృదయము నీదెసుమ్మా - నీవె గైకొనుమా యేసయ్యా = శుద్ధ హృదయము జేసి నను నీ - సుతునిగా జేయు యేసయ్యా ||పాపి||

- సిరిపురపు కృపానందము