Showing posts with label Athyantha Sundarudunu Yellari. Show all posts
Showing posts with label Athyantha Sundarudunu Yellari. Show all posts

02 July 2021

Athyantha Sundarudunu Yellari | అత్యంత సుందరుండును ఎల్లరి

1.అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా - కల్వరి యేసు నాథుడు

పల్లవి: కల్వరి నాథుడా - నన్ను జయించితి
రక్షింప మృతుడైన - కల్వరి యేసు నాథుడా

2.గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరి నాథుడా

3.శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా

4.తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను - దయాకల్వరి నాథుడా

5.మహిమ పూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరి ప్రభూ

6.స్పటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము - మహిమ కల్వరి నాథుడా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...