Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

10 May 2023

Langaresinava na navaku | లంగరేసినావా నా నావకు

లంగరేసినావా నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు - పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు

అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి - తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి - ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక - అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక

1.చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడి గుండం - నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే - నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ||అలలను||

2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే - సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే - వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే - నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ||అలలను||

3 జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి - జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి - నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి - క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీవైపు ఊ.. ఊ. చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు ||అలలను||
– sis. Kanthi Kala Garu 

11 December 2022

Loka rakshakudu manakoraku | లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను


లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను 
మన పాప శాపములన్ని తొలగింపను 
ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను … 
లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను 

కన్య కుమారుడుగా మనకై పుట్టెను 
లోక రాజులందరికి దడ పుట్టించెను 
సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను 

దావీదు సుతినిగా మన కొరకొచ్చేను 
గొల్యాతులందరు ఇక కూలిపోవును 
ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును 

రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్! 
తన రాజ్యమున ఇక మనలన్! 
శాశ్వతముగా నిలువనిచ్చెన్!

ఆశ్చర్యములను చేసెన్! 
ఆలోచనను ఇచ్చెన్!
బలమును చూపి నిత్యము నిలచి!
సమాధానము నొసఁగెన్…!

ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు…
అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను …
నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును …

07 December 2022

Laali laali laalamma | లాలి లాలి లాలమ్మ లాలి

లాలి లాలి-లాలమ్మ లాలి - లాలి- లాలి
శ్రీమరియమ్మ పుత్ర నీకే లాలి

బెత్లేహేము పుర వాస్తవ్యలాలి భూలోక
వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి

పశుల తొట్టె - నీకు పాన్పాయెను లాలి
ఇపుడు పాపులమైన - మా
హృదయములలో పవళించుము

పొత్తి వస్త్రములే నీకు-పొదుపాయెను లాలి
మాకు మహిమ - వస్త్రము లియ్యను
నీవు మహిలో పుట్టితివా

పశువుల పాకే - నీకు వసతి గృహమాయె
మాకు మహిమ - సౌధము లియ్యను
నీవు మనుష్యుడవైతివా

తండ్రి కుమార - పరిశుద్ధాత్మలకే స్తోత్రం  
ఈ నరలోకమునకు - వేం చేసిన
శ్రీ బాలునకే సోత్రం

03 April 2022

Loka paapamunu mosukellina | లోక పాపమును మోసుకెళ్లిన

లోక పాపమును మోసుకెళ్లిన - దేవుని గొర్రెపిల్ల (2)
నీ రక్తమే పాప పరిహారం - నీ దేహమే జీవ ఆహారం
నీ వాక్యమే మాకు ఆధారం - నీ నామమే రక్షణకు మూలం
నీ విజయమే మాకును విజయం 

1. మొదటి ఆదాముతో - పాపము జనియి౦చెను -మరణము సంక్రమించెను (2)
ఆ పాపం పోవాలంటే - ఈ మరణం తోలగాలంటే - 
మా వల్ల కానెకాదు - పరిశుద్దుడె రావాలి….
ప్రభువా కడపటి ఆదామైనావు…
కలువరి బలిపీఠమునెక్కావు…
నీ ప్రాణమే బలిగా అర్పించి…
మా ప్రాణాలను కాపాడావు - మరణాన్నే మింగివేశావు ||నీ రక్తమే||

2. నీవు పొందిన దెబ్బలచె - మాకు స్వస్థత నిచ్చావే మాకోసం చీల్చబడినావే…(2)
సూరూపమెమిలేక కురుపివైనావయ్యా-నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయెనా…
ప్రభువా నిశ్చయముగ మా రోగాలు…
భరీయించావు నీ దేహములో…
మా వ్యసనములన్నిటి సహీయించి…
మా శాపగ్రాహివైనావు - ఆరోగ్యమే మాకు ఇచ్చావు. || నీ రక్తమే||

3. శ్రీమంతుడవు నువ్వు - సృష్టంతటిలో నువ్వు అయినా తగ్గించుకున్నావ (2)
నివు సృస్టించిన ఈ భువికి - దీనుడవై దిగివచ్చావే మము ధనవంతులుగా చేయ - దారిద్ర్యతనొ౦దావె…
ప్రభువా నీ తగ్గింపుకు సమమెది?…
నీ అద్బుత క్రుపకు మితియేది?..
నీ ప్రేమకు ఇలలో సాటెది?…
నీవంటి రక్షకుడు ఏడి - నీ లాంటి ప్రేమ ఘనుడేడి || నీ రక్తమే||

25 December 2021

Laali laali laalamma laali | లాలి లాలి లాలమ్మ లాలీ

122
క్రీస్తుని మహిమ
రా – మాద్యమావతి, తా – అట

లాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు ||లాలి||

1.పరలోక దేవుని తనయుఁడో యమ్మా - పుడమిపై బాలుఁడుఁగఁ - బుట్టెనో యమ్మా ||లాలి||

2.ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ - మహి పాలనముఁ - జేయు మహితుఁడో యమ్మా ||లాలి||

3.ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా - ఆదాము దోషమున - కడ్డు పడె నమ్మా ||లాలి||

4.యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా - యూదు లాతని తోడ - వాదించి రమ్మా ||లాలి||

5.నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా - గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలి||
   – తిరువళ్ళూరి స్టీవెన్

Lokamanthata velugu prakashinchenu | లోకమంతట వెలుగు ప్రకాశించెను

119
యేసు లోకమునకు వెలుగు
రా - ముఖారి, తా - ఆది

లోకమంతట వెలుగు ప్రకాశించెను - యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు - లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ||లో||

1.నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను - చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు - వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ||లో||

2.ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను - చంద్రుడైన నక్కరలేదు = ఆ పట్టణములో దేవుని మహిమయే - ప్రకాశించుచున్నది యెపుడు - ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే దీపమై వెలుగుచుండు ||లో||

3.మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక -  మీరు వెలుగు సంబంధులు = మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే - మరుగై యుండక నరులందరికి - వెలుగై యుందురనె యేసుండు ||లో||

4.చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును -  చూచిరి ధన్యులై = లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద - ప్రకాశించెను గొప్ప వెలుగును - ప్రభువు యేసుకు జేయని పాడరే ||లో||
  - ఆర్. దేవదాసు

27 August 2021

Le chal muje Le chal muje | ले चल मुझे ले चल मुझे

ले चल मुझे – ले चल मुझे
तू है जहा ले चल मुझे
ले चल मुझे -ले चल मुझे
तेरे सिंहासन के पास ले चल मुझे

मै तेरे पास आता हूँ – पवित्र दिल से
आराधना मै करता हूँ – प्रेमी मन से (2)
तुझे ढूँढता हुआ – तुझे चाहता हुआ
मुझे खीच ले मै दौडूंगा (2) ||ले चल||

तेरे पवित्र स्थान में – तू मुझे ले चल
तुझे देखना मै चाहता हूँ – हर घड़ी हर पल (2)
तुझे ढूँढता हुआ – तुझे चाहता हुआ
मुझे खीच ले मै दौडूंगा (2)

जैसे हिरनी पानी के लिए
प्यासा मै भी हु तेरे लिए
तुझे ढूँढता हुआ, तुझे चाहता हुआ
मुझे खीच ले मै दौडूंगा (2)

17 August 2021

Lechi Sthuthinpa Bunudi | లేచి స్తుతింప బూనుడి

47       
ప్రాతస్తవము
రా – పంతువరాళి, తా - అట
 (చాయ: ఇడుగో గొర్రెల కాపరి)

లేచి స్తుతింపఁ బూనుఁడి - లోకేశ్వరుని - లేచి స్తుతింపఁ బూనుఁడి = లేచి స్తుతించెదము చూచుచు మనలను - బ్రోచి ప్రేమతోఁ గరము - జాచి కాపాడు విభుని ||లేచి||

1.రాత్రి జాముల యందున - రంజిలఁదన - నేత్రము తెరచినందున = మైత్రితో దేవ దయకు - పాత్రుల మైతిమి - ¹శ్రోత్రముల కింపుసఁబ - విత్ర గీతము పాడుచు ||లేచి||

2.నిదురఁబోయిన వేళను - నిర్మలమైన - హృదయము మనకు నియ్యను - ముదముతో నిదురఁబొంది - యుదయాన లేచితిమి - సదయుఁడైన క్రీస్తు - పదముల దరిఁజేర ||లేచి||

3.²నిగమ వేద్యుఁడు మనలనుఁ - దనలోన నీ - పగలు కాపాడఁబూనెను = దిగులు బొందక పనులు - తెగువతోఁ జరుపుకొనుచు - వగపుతో లేచి మ్రొక్కి - మిగుల శుద్దాత్మనడిగి ||లేచి||

4.పాఠములయందు - నిర్భయముగ - దాటివెలసి యుందు = సూటిగ నీదు రెక్కల - చాటుగను నిలుపు మనుచు - నీటుగా నెల్లవార - నిత్యము ప్రేమనేల ||లేచి||
__________________________
¹చెవులు. ²వేదము నెరిగినవాడు.

07 April 2021

Lechinadura Samadhi Gelichinadura | లేచినాడురా సమాధి గెలిచినాడురా

687
లేచినాడురా సమాధి గెలిచినాడురా (యేసు) (2)
లేచినాడురా - సమాధి గెలిచినాడురా

అప: లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్టు ||లేచి||

1.భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు (2)
ముద్రవేసి రాత్రియంత (2) - నిద్రలేక కావలియున్న 

2.ప్రభువు దూత పరమునుండ - త్వరగా దిగి రాతిని పొర్లించి (2)
భళిర దానిపై కూర్చుండె (2) - భయమునొంద కావలివారు 

3.పొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధములు (2)
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు (2)- రుద్దుదామని వచ్చి చూడ 

4.చూడవెళ్లిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
లేడు(2) 
గలలియ ముందుగ పోతున్నాడు(2) - అపుడె లేచినాడని

5.చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు (2)
చచ్చినను నను లేపుతాడు (2)- చావు అంటే భయపడరాదు 

6.నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు(2)
నేను చేప్పు మాటలెరుగు(2)- నేను బ్రతికే బ్రతుకు నెరుగు 

7.నేను లేచిన యేసునందు - మానక మది నమ్ముకొందు (2) తాను నాలోయుండినందున (2)- దయను జేర్చు మోక్షమందు 

8.పాపభారము లేదు మనకు - మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2) - మరువకండి యేసు ప్రభుని 

9.యేసు నందే రక్షణ భాగ్యం - యేసు నందే నిత్య జీవం (2)
యేసు నందే ఆత్మ శాంతి (2)- యేసు నందే మోక్ష భాగ్యం 

10.పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు (2)
పాపులను ప్రేమించానాడు (2)- ప్రాణదానము చేసినాడు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...