Showing posts with label Prabhu goppa karyamulu lyrics. Show all posts
Showing posts with label Prabhu goppa karyamulu lyrics. Show all posts

09 April 2023

Prabhu goppa karyamulu | ప్రభు గొప్ప కార్యములు చేసెనని

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
 
ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము

1.దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము
||ప్రభు||

2.సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము ||ప్రభు||

3.మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో ||ప్రభు||

4.నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం ||ప్రభు||

5.ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము ||ప్రభు||

6.మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్ ||ప్రభు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...