Showing posts with label Simphany songs. Show all posts
Showing posts with label Simphany songs. Show all posts

27 May 2021

Samayamu Ledannaa Mari Ledannaa | సమయము లేదన్నా మరి లేదన్నా

సమయము లేదన్నా మరి లేదన్నా 
పోతే మరలా తిరిగి రాదన్నా (2)
 యేసన్న నేడో రేపో వచ్చేనన్నా (2)
భూమిమీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా 

1. హృదయంలో యేసుని చేర్చుకున్న -
పరలోక భాగ్యమే నీదగునన్నా (2)
నీ పాపజీవితం విడువకయున్న -
పాతాళగుండమే నీగతియన్నా (2)
రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో -
నేడన్నది ఉండగానే దారి తెలుసుకో(2)
చేయకాలస్యము - తెరువు నీ హృదయము (2)

2.ఆకాశం పట్టజాలని దేవుడన్నా -
కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా (2)
లోక పాపమంత వీపున మోసాడన్నా -
మానవాళి శాపం రూపుమాపాడన్నా (2)
నీ హృదయపు వాకిట నిలుచున్నాడు -
నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు(2)
 చేయకాలస్యము - తెరవు నీ హృదయము (2)

3.యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో -
నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా (2)
గడ్డిపువ్వు లాంటిది నీ జీవితమన్నా -
ఎపుడు ముగిసిపోతుందో తెలియదన్నా(2)
బూరధ్వనితో ఆర్భాటముతో మేఘరూఢుడై -
తీర్పు తీర్చ యేసురాజు రానున్నాడు(2)
చేయకాలస్యము - తెరువు నీ హృదయము(2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Yesu Nee Sakshiga Nanu Nilpinavaya | యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా

యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా 
గురిలేని నా బ్రతుకు దరిచేర్చినావయా
నీ సేవ చేయగా - నీ సిల్వ మోయగా (2)
                                                 ||యేసు||
1. ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప(2)
మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప (2)
                                                ||యేసు||
2. సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప (2)
నిత్యం స్తుతినొందదగిన నీ నామము ప్రణుతింప (2)
                                                ||యేసు||
3. నాలో నీ సిల్వ ప్రేమ లోకానికి చూపింప (2)
రాకడకై కనిపెట్టుచు నీ కొరకే జీవింప(2)
                                                 ||యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Yehova Ninnu Poliyunna Vaarevvaru | యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు

యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు 
యేసువా నీకు సాటియైన వారెవ్వరు (2)

1.సృష్టికి ఆధారుడా అద్వితీయుడా - 
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా (2)
అందరిలో సుందరుడా కాంక్షనీయుడా(2) 
వందనములకర్హుడా పూజ్యనీయుడా (2)
                                         ||యెహోవా||
2.పాపికొరకు ప్రాణమిడిన ప్రేమరూపుడా - 
లోక శాపమును మోసిన సిలువధారుడా(2) 
మరణపుకోరలు పీకిన విజయవీరుడా (2)
శరణన్నచో కరుణ చూపు పరంధాముడా (2)
                                         ||యెహోవా||
3. ఆదియు అంతములేని అగ్నినేత్రుడా - 
ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా (2)
కన్యక కడుపునబుట్టిన పరమపుత్రుడా (2)
అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా(2)
                                         ||యెహోవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Sthuthiyinchedanu sthuthi paathruda | స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను

స్తుతియించెదను స్తుతి పాత్రుడా నిను -
భజియించెదను భయ భక్తితోను (2)
 
అ.ప: వందనమయ్యా యేసయ్యా - 
         నీకే ప్రణుతులు మెస్సీయా ||స్తుతి||
 
1.నీ గుణగణములు పొగడను తరమా -
నీ ఘనకీర్తిని పాడ నా వశమా (2)
పరలోక సైన్యపు స్తుతిగానములతో (2)
దీనుడ నా స్తుతి అంగీకరించుమా ||వందన||
 
2.నీ ఉపకారములు లెక్కింపగలనా -
నీ మేలులన్నియు వర్ణింపనగునా (2)
నా హృదిగదిలో నివసింపగోరిన (2)
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా ||వందన||
 
3.నీ సిల్వప్రేమను వివరింప శక్యమా -
నీ సన్నిధి లేక జీవింపసాధ్యమా (2)
ఆరాధించెద ఆత్మతో నిరతం (2)
నీ క్షేమముతో నింపుమా సతతం ||వందన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Shathru Bhayama Mithruda Rakshakundu || శత్రు భయమా మిత్రుడా రక్షకుండు

శత్రు భయమా మిత్రుడా రక్షకుండు నీతో ఉండగా
స్తోత్ర గీతాలు పాడవా - యేసే ఉండ నీకు అండగా 

1.మరణపు ముల్లును విరచి విజయుడైనాడు
 ఎన్నటికీ ఉండకుండా మ్రింగి వేసినాడు 
 రాకడలో నమ్మినవారిని తిరిగి లేపుతాడు
 వెయ్యేండ్లు రాజ్యము చేయ వరములీయువాడు 

2.నమ్మిన నీలో నాలో ఆత్మనుంచినాడు 
 నెమ్మదితో ఇల జీవించ వాక్యమిచ్చినాడు 
 అపవాదిని కాళ్ళక్రింద అణచి ఉంచినాడు
 జయవీరుడు యేసురాజు మనలో ఉన్నాడు 

3.వెలలేని తన రక్తములో విమోచించినాడు 
 ఎవడు నిన్ను అపహరింపను వీలులేదు నేడు
 మరణమైన జీవమైన దూతలు ప్రధానులైన 
 క్రీస్తు ప్రేమనుండి నిన్ను వేరు చేయలేవు
                            - డా. ఎ.డి. శిఖామణి

Sriyesu Maa Raaja Shalemu Raaja | శ్రీయేసు మా రాజా షాలేము రాజా

శ్రీయేసు మా రాజా - షాలేము రాజా (2)
ధన్యులను చేయగా నరులను పరము విడచి - ధరకు వచ్చితివా
మరియమ్మ గర్భమున.. మరియమ్మ గర్భమున 

1.నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము - ప్రభు నీవే ద్వారము (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2) - 
పరమ దారి నీవయ్యా..  ||శ్రీయేసు||

2.జీవాహారము జీవజలము జీవాధిపతివి నీవే -జీవింప జేసితివి (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2)- 
పరమ దారి నీవయ్యా ..  ||శ్రీయేసు||

3.గొప్ప కాపరి మంచి కాపరి ప్రాణమిచ్చితివి - ప్రధాన కాపరివి (2)
నీవుగాక వేరె మాకు దారి లేదయ్యా (2)
పరమ దారి నీవయ్యా ..  ||శ్రీయేసు||
                             - డా. ఎ.డి. శిఖామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

Naa Neethikadharameeve || నా నీతికాధారమీవే ఓ నీతిమంతుడా

నా నీతికాధారమీవే ఓ నీతిమంతుడా 
నీ నీతి నాకొసగినావా నీ రక్తధారలలోనా 

1. నా రక్షణాకాధారమీవే నా శిక్ష భరియించినావా
 నిరీక్షణకాధారమీవే సంరక్షకుడా నా యేసూ 

2. నా జ్ఞానానికాధారమీవే లోక జ్ఞానము వెర్రితనమే
 నా ప్రాణానికాధారమీవే నీ ప్రాణము నాకిచ్చినావా 

3. నా క్షేమానికాధారమీవే నీ సౌఖ్యమే విడచినావా
 నా పోషణకాధారమీవే నీ కాయమునర్పించినావా
 - డా. ఎ.డి. శిఖామణి

Sthuthi Sthothrarhudu Yesu Raaja || స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా


స్తుతి స్తోత్రార్హుడా యేసురాజా 
అందుకో నా పూజ ఓ ఘనతేజా - హల్లెలూయా (8) 

1. సర్వాధిపతి సర్వోన్నతుడా - సకలముచేసిన సృష్టికర్తవు 
సర్వశక్తిగల సర్వేశ్వరుడా - సతతము నీవే స్తోత్రార్హుడవు 

2. సృష్టికి కారణభూతుడవీవే - రక్షణకర్తా నిరీక్షణ నీవే
ఆదరించుమా ఆత్మ స్వరూపా- అనవరతము నీవే స్తోత్రార్హుడవు 

3. పరిశుద్దుడవు ప్రభుడవు నీవే - నిర్దోషుడవు నిష్కల్మషుడా
పాపిని నన్ను కాపాడితివి - నిరతము నీవే స్తోత్రార్హుడవు 
                                      - డా. ఎ.డి. శిఖామణి

Sri Yesu Needu Naamamandu | శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన


శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
 ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా వందనం 

1. నీ నామమందు ప్రార్థించి పొందినాము గొప్ప రక్షణ
 రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను 
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు 

2. విశ్వాససహితమైన ప్రార్థన విజయ మిచ్చునన్నావయా 
తండ్రి సముఖమునకు చేర ప్రార్థన నీ నామముంచినావయా 
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు 

3. పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్ట నేర్పినావయా
 సందేహపడక విధేయతతో ప్రార్థింపజూపినావయా
 బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు
                                        _ డా. ఎ.డి. శిఖామణి

Randi Randi Yesu Pilichenu | రండి రండి యేసు పిలిచెను

రండి రండి యేసు పిలిచెను ఆత్మరక్షణ పొందగను
ప్రేమతోడ నిన్ను చేరెను పరమ శాంతి నీకీయగను(2)

 అ.ప: పొందుము తక్షణం - రక్షణ భాగ్యము (2)

1. ఏది నీజాతి ఏ వంశమైనా ఏ కులము నీదేమతమైనా(2)
ఏకముగా చెడిపోయిన మీరు ఏకముగ ఇల కూడి రండి (2)
                                             ||రండి రండి||
2. నిన్ను నన్ను రక్షించుటకై యేసుప్రభువు శిక్షింపబడెను (2)
మరణముల్లును విరిచివేసెను మరలలేచి నిన్ను పిలిచెను (2)
                                             ||రండి రండి||
3. నీదుపాపము ఒప్పుకొనుము యేసుక్రీస్తుని అంగీకరించుము (2)
తన రుధిరములో నిన్ను కడుగును నీతిమంతునిగా మార్చివేయును(2)
                                             ||రండి రండి||
                                        _డా.ఎ.డి. శిఖామణి

DOWNLOAD MP3 SONG HERE 👇

Yesayya Priyamaina Maa Rakshaka | యేసయ్యా ప్రియమైన మా రక్షకా

యేసయ్యా ప్రియమైన మా రక్షకా -
నీదు ప్రేమకై స్తుతియింతుము (2)
నిన్ను పూజింతుము - నిన్ను సేవింతుము (2)
నిన్ను మనసార స్మరియింతుము ||యేసయ్యా||

1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను (2)
నీదు శరీరము బలిగా చేసి (2) విలువైనవారిగా చేసితివి (2) ||యేసయ్యా||

2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి(2)
నీ కరుణను ఇల వర్షింపజేసి(2) సిలువ పై ప్రాణము వీడితివి(2) ||యేసయ్యా||
- డా.ఎ.డి. శిఖామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

Nanu Preminchina Yesayya | నను ప్రేమించిన యేసయ్యా నిన్ను


నను ప్రేమించిన యేసయ్యా - 
నిన్ను నేను స్తుతింతునయ్యా 
నాకాదరణానందము నీవే - 
నను రక్షించిన ఓ రక్షకుడా 

1.బలహీనుడను బహు పాపిని - 
ధనహీనుడను దరిద్రుడను (2)
ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు (2)
ఎంత ప్రేమ నీది (2) - 
లోకానికి ఒక వింతైనది ||నను||

2.వీధులలో పడి మోసావు - 
భారమైన సిలువ నీవు (2)
నాదు పాపపు మోపంతా నీ వీపుపై మోసావు (2)
దాపు జేరిన నన్ను (2) - 
దయతో మన్నించినావా ||నను||

3.మరణమును జయించినావు - 
మృత్యువును ఓడించినావు (2)
మరణ ఛాయలోనున్న నాకు జీవమిచ్చినావు (2)
ఏమి నీకు అర్పింతునయ్యా (2) - 
నా వందనం అందుకోవయా  ||నను||
______________________________
Nanu Preminchina Yesayya
Ninnu nenu sthuthinthunayya
Naakadarananandamu neeve
Nanu rakshinchina o rakshakuda ||Nanu||

Balaheenudanu bahu papini - 
Dhanaheenudanu dharidhrudanu (2)
Yemi chuchi nannu vedaki rakshinchinavu(2)
Yenth prema needi (2)
Lokaanike oka vinthainadi ||Nanu||

Veedulalo padi mosaavu - 
Bharamaina siluva neevu (2)
Naadu Paapapu mopantha - nee veepupai mosaavu (2)
Daapu jerina nannu (2)
Dayatho manninchinaavaa ||Nanu||

Maranamunu jayinchinavu -
Mruthyuvunu odinchinavu (2)
Maranachayalo nunna naaku jeevamichchinaavu (2)
Emi neeku arpinthunaya (2)
Naa vandanam andukovayaa ||Nanu||
- Dr. A.D. Shikhamani
DOWNLOAD MP3 SONG HERE 👇

Ennelo Ennela Kannulo Ennela | ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా

ఎన్నెలో ఎన్నెలా - కన్నుల్లో ఎన్నెలా 
ఏసయ్యను నమ్ముకుంటే - ఎన్నెలో ఎన్నెలా(2)
ఆ సామిని కొలుసుకుంటే - బతుకంతా ఎన్నెలా 

1.పరలోకం నుండి దొరా నరలోకం వచ్చిండు (2)
మన సీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు (2) ||ఎన్నెలో||

2.సెంతజేరినోళ్ళకంత సింతలన్ని బా పెనంట(2)
ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసెనంట (2) ||ఎన్నెలో||

3.సొరగానికి దారిసూప అడుగుబెట్టె భూమిమీద(2)
మరణానికి బుద్ది సెప్ప కన్నుమూసే సిలువ మీద (2) ||ఎన్నెలో||

4.సక్కనయ్య మోముజూడ సిక్కులన్ని తీరిపోవు (2)
మక్కువతో శరణువేడ బతుకంతా మనలగాయు(2) ||ఎన్నెలో||
DOWNLOAD MP3 SONG HERE 👇
ఎంత మధురము - యేసువాక్యము 
నా జీవితకాలమంత నన్ను నడుపును (2)
 
1.అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును (2)
కృంగినవేళ లేవనెత్తును (2) 
శోధనవేళ  జయమునిచ్చును ||ఎంత||
 
2.ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును (2)
చింతలైనను మాన్పివేయును (2)
చెంతజేరిన సంతోషమిచ్చును ||ఎంత||
 
3.చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును (2)
వింతప్రేమను బయలుపరచును (2)
వెంబడించిన మేలుకలుగును ||ఎంత||
DOWNLOAD MP3 SONG HERE 👇

Inthati Premanu Vinthaga Chupanu | ఇంతటి ప్రేమను వింతగ చూపను

ఇంతటి ప్రేమను వింతగ చూపను - ఎంతటివాడనయా (2)
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా 

అ.ప: కరుణామయా - దయాహృదయా (4)

1. కరగని కఠిన పాషాణం నా హృదయమును గెలిచితివా (2)
తరగని నీ ప్రేమను చాటను (2) - నన్నిల నీవు పిలచితివా ||కరుణా||

2. ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగను చేసితివా (2)
చెరగని నీదు గ్రంధమునందు (2) - నా పేరును నీవు రాసితివా ||కరుణా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Medunna Middhunna Pedda | మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా


మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా -
నీలో యేసన్న లేకున్నా -నీకున్నదంతా సున్నా (2)

1.సిరి ఉందని తూలనాడినా - 
బలముందని విర్రవీగినా (2)
తీర్పునందు చిక్కెదవన్నా - 
మార్పునొంద త్వరపడుమన్నా (2) ||మేడున్నా||

2.అందముతో అతిశయించినా - 
సుందరునని గర్వించినా (2)
చివరకు ఇది మన్నగునన్నా - 
ఆపై నీ గతి ఏమన్నా (2) ||మేడున్నా||

3.చదువులలో శిఖరమెక్కినా - 
పదవులలో పైకి ఎదిగినా (2)
హృదయం ప్రభుకీయకున్నా - 
నరకమే గతి ఇది నిజమన్నా (2) ||మేడున్నా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Yugamula Paryanthamu | యుగముల పర్యంతము నా స్తోత్రముల

యుగముల పర్యంతము - నా స్తోత్రములకర్హుడు(2)
జగములనేలుచున్న జనతైక ప్రియ కుమారుడు (2)

1. ఆప్తుడు దేదీప్యుడు - ఆపదలో సహాయుడు(2)
నిత్యుడు సత్యుడు(2)
సృష్టికి ఆధారుడు - నా యేసుడు.. నా యేసుడు
                                        ||యుగముల||
2. నిరతము నా దుర్గము - నాదు రక్షణ కేడెము(2)
కునుకడు నిద్రించడు (2)
ఎన్నడు ఎడబాయడు - నా యేసుడు.. నా యేసుడు
                                           ||యుగముల||
3. అల్ఫయు ఓమేగయు - అద్యంత రహితుడు(2)
కరుణామయుడు కమనీయుడు(2) 
కలువరినాధుడు - నా యేసుడు.. నా యేసుడు
                                           ||యుగముల||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...