Showing posts with label నీ దయలో నేనున్నా ఇంత కాలం. Show all posts
Showing posts with label నీ దయలో నేనున్నా ఇంత కాలం. Show all posts

10 September 2023

Nee dayalo nenunna నీ దయలో నేనున్నా ఇంత కాలం

నీ దయలో నేనున్నా ఇంత కాలం
నీ కృపలో దాచినావు గతకాలం (2)
నీ  దయలేనిదే నేనెమౌదునో తెలియదయ్యా ||నీ దయలో||

1.తలిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ వుంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయలేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచి వుంచావని
నా శేష జీవితాన్నే నీతోనే గడపాలని ||నీ దయలో||   

2. నేలరాలిన నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలను అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలే నాలాశ్రయ దుర్గము
ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...