Showing posts with label 028 మహిమ సర్వోన్నత మైన. Show all posts
Showing posts with label 028 మహిమ సర్వోన్నత మైన. Show all posts

14 August 2021

Mahima Sarvonnathamaina | మహిమ సర్వోన్నత మైన దైవమునకి

28
దేవుని మహిమ
రా – ఆనందభైరవి,  తా – ఝంపె

మహిమ సర్వోన్నత - మైన దైవమునకి - మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ప్రభో||మహిమ||

1.నిన్ను స్తోత్రించుచు - నిన్ను బూజించుచు - నిన్ను మహిమపర్చుచు - న్నాము లోక ప్రభో ||మహిమ||

2.ప్రభువైన దేవుండా - పరమండలపు రాజా - ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

3.వినయంబుతో నీదు - ఘన మహిమార్థంబై - వందనము లర్పించి విను - తింతుము సత్వభో ||మహిమ||

4.జనితైక పుత్రుడగు - ఘన క్రీస్తేసు ప్రభు దే - వుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

5.ధర పాపములమోయు - వరపుణ్య శీలుండా - కరుణించి మా బీద - మొరలాలించుము ప్రభో ||మహిమ||

6.తండ్రియైన దేవుని - దక్షిణ భాగమున గూ - ర్చుండి యున్నావు కృప - జూపుమి సత్రభో ||మహిమ||

7.పరిశుద్ధుడవు నీవే - పరమ ప్రభుడవు నీవే - దురితాత్ములను గాన - మరణంబైతివి ప్రభో ||మహిమ||

8.పరమ జనకుని మహిమన్ - పరిశుద్ధాత్మైక్యంబై - సరణి మాకై యున్న - సర్వోన్నత ప్రభో ||మహిమ||
                                         - బేతాళ జాన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...