Showing posts with label Thambura sithara nadamutho maa. Show all posts
Showing posts with label Thambura sithara nadamutho maa. Show all posts

07 October 2022

Thambura sithara maa | తంబుర సితారతో మా ప్రభుని

తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము
తన నివాసముగ - మమ్ము సృష్టించిన నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము

1.ఆది ఆదాము - మరణ శాసనము
మా శరీరమున్ - ఏలుచుండగా
అమరుడవై ప్రభూ - భువికేతెంచి
మరణపు ముల్లు విరిచి - మరణమున్
గెలిచిన మా ప్రభువా (2) ||తంబుర||

2.పాపము నుండి - చీకటి నుండి
ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి
తన ఆలయముగ చేసిన ప్రభుకు
స్తుతి మహిమ - ఘనత
సీయోనులో అర్పించెదమెప్పుడు ||తంబుర||

3.పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి
నరకపు శిక్ష - తొలగించె మానుండి
పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ
నిర్మించెను యిలలో - గృహముగా
తన ఆత్మ ద్వారా ||తంబుర||

4.ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది
సజీవమైన రాళ్ళే ప్రజలు
ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి
ఆద్యంతరహితుడై - నడుపును
మోక్షపురికి మమ్ము ||తంబుర||

5.మన్నయినది - వెనుకటివలెనే
మరల భూమికి తప్పక చేరున్
మానవ సంపద - కీర్తి మహిమలు
గతించి పోవునిల సీయోను
మరువకు నీ ప్రభుని ||తంబుర||

6.లెబానోను వీడి - నాతోరమ్ము
లోకపు ఆశలు గతించిపోవును
హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
హెబ్రోను చేరుదము
ప్రభువును ఆరాధించెదము ||తంబుర||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...