Showing posts with label నాది నాది అంటూ వాదులాట నీకెందుకు. Show all posts
Showing posts with label నాది నాది అంటూ వాదులాట నీకెందుకు. Show all posts

06 July 2021

Naadhi Naadhi Antu Vaadulaata | నాది నాది అంటూ వాదులాట నీకెందుకు

నాది నాది అంటూ వాదులాట నీకెందుకు 
ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు 
ఇహలోక ఆశలెందుకు - పైనున్న వాటినే వెదకు 

1. నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే
నేడు నీకు ముందున్నది రేపు కానరాకపోవునే
క్షణికమైనవాటి కొరకు ప్రాకులాట నీకెందుకు 
అక్షయ దైవరాజ్యమే నిలుచును తుదవరకు 

2. నీ దగ్గర ధనముంటే నీ చుట్టు మనుష్యులుంటారు
నీ లోపల బలముంటే నిను మావాడని అంటారు
నీ ధనము నీ బలగం నీ చావునాపలేవు 
తప్పకుండ ఒకనాడు మట్టిలోన కలుస్తావు 

3. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు 
నీ యొక్క స్వంతనీతి శిక్షను తప్పించలేదు
గడ్డిపువ్వులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం
యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్ధకం
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...