Showing posts with label స్తుతియించి కీర్తించి ఘనపరతును. Show all posts
Showing posts with label స్తుతియించి కీర్తించి ఘనపరతును. Show all posts

09 October 2022

Sthuthiyinchi keerthinchi | స్తుతియించి కీర్తించి ఘనపరతును


స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||  

గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి -
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||  

అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి -
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||  

పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...