Showing posts with label Srungara nagaramandu lyrics. Show all posts
Showing posts with label Srungara nagaramandu lyrics. Show all posts

18 November 2020

Srungara Nagaramandu | శృంగార నగరమందు

శృంగార నగరమందు జయగీతము - పాడెదము సీయోను వరుని చేరి 

1. ఆనందమిచ్చిన ప్రియుని చేరి - ఆదరణ పొందెదము 
    అచ్చట అలంకార మహిమ - 
    కిరీటము పొంది ప్రియునిలో హర్షించెదం||శృంగార||

2. దుఃఖించు వారు స్తుతిపాట  పాడుచు -  
    స్తుతి వస్త్రములతో అచట ఉన్నత సీయోను తిన్నని - 
    వీధిలో హర్షించి పాడెదం                     ||శృంగార||

3. ముండ్ల కిరీటము పొందిన నిజయేసు - 
    పరిశుద్ధుని చూతము అచ్చట ముద్రపొందిన -  
    శుద్దుల తెల్లంగి ధరించి స్తోత్రించెదం     ||శృంగార||

4. భూలోక పాలన క్రొత్త పాట పాడి - 
    ప్రేమతో హర్షించెదం శాంతి సౌఖ్యంబులతోడ - 
    ప్రభువుతో నుండి భూ ఆశల్ విడచెదము ||శృంగార||

5. ఆయన చెప్పిన గురుతులన్నియు - తప్పక 
    జరుగుచుండె - ఆయన వచ్చువేళ తెలియదు 
    ఎప్పుడో - ఆయత్తముగా యుందము  ||శృంగార||

6. సిలువను మోసిన పరిశుద్ధ ప్రభుయేసు -
     చెంగుపట్టుకొందము అచ్చట మచ్చ డాగులేని - 
     ప్రభుని వెంబడించి -జయగీతముల్ పాడెదం 
                                                         ||శృంగార||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...