Showing posts with label I. Show all posts
Showing posts with label I. Show all posts

31 March 2025

Idi rakshana krupa kaalam ఇది రక్షణ కృపకాలం

 
ఇది రక్షణ కృపకాలం — ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక – మనస్సు మార్చుకోనీవిక (2)

1. రాజ్యముల రాజ్యముల్ – జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్ – ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2. దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే – యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన - అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు – భక్తులకు హింసలు ||ఇది||

4. క్రైస్తవుడా మేలుకో – సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు – ఆత్మయందే బలపడు ||ఇది||

01 June 2023

Ide na korika navajivana ఇదే నా కోరిక నవజీవన


ఇదే నా కోరిక - నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక||
1.యేసు లాగ ఉండాలని - యేసుతోనే నడవాలని (2)
నిలవాలని గెలవాలని - యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక||

2.ఈ లోకంలో పరలోకము - నాలోనే నివసించాలని (2)
ఇంటా బయట యేసునాథునికే - కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక||

3.యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని (2)
క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||

Inthalone kanabadi anthalone ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే


ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే - అల్పమైన దానికా ఆరాటం
త్రాసుమీద ధూళి వంటి ఎత్తలేని నీటివంటి - స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏదీ కాదు నీ సొంతం - దాటిపోవును ఇల నీ సంపదలన్నియు

1.బంగారు కాసులున్న అపరంజి మేడలున్న
అంతరించి పోయెను భువినేలిన రాజులు
నాది నాది అంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా

2.మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో
ఆశ్రయించు యేసుని అనుకూల సమయంలో
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో

31 May 2023

Intha kaalam needu krupalo ఇంత కాలం నీదు కృపలో


ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||

1.ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||

2.నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||

21 May 2023

Ishrayelu deva na sthuthula ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును (2)
ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)

ఆరాధనా నీకే ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా - ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు||

1.నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా (2)
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే (2) ||ఆరాధనా||

2.నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి -
స్తుతుల సింహాసనము నీకు వేయగా (2)
ఆనంద తైలముతో నన్నభిషేకించి -
స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) ||ఆరాధనా||

3.నా కొరకు సీయోనును సిద్ధపరచి -
మహిమతో తిరిగి రానైయుంటివే (2)
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి -
శాశ్వత జీవము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||

09 June 2022

Edugo gorrelakapari sodarulaara | ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా

163 
యేసు గొఱ్ఱెల మంచి కాపరి
రా - పంతువరాళీ, తా - చాపు

    ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా - యిడుగో గొఱ్ఱెలకాపరి = కడగానరాని - కారడవిలో నలసట - పడెడు గొఱ్ఱెలను - పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||

1.చెదిరిపోయిన గొఱ్ఱెనై - దొడ్డికిఁబోవ - ¹ముదములేని వాడనై = మృదుమధురంపు నీ - ²నాదమా లించక కర్త - ³కొదిఁగి యుండక మూఢ - హృదయుఁడనైతి ||నిడుగో||

2.దూరంబునకుఁబోతిని - జనకుని కృపా - సారంబుఁ ⁴గొననైతిని = ⁵కారు మూర్ఖపుపిల్ల - గా సంచరించినా - ⁶కూరిమి యిలుఁబాసి - దారి దొలగిపోతి ||నిడుగో||

3.తనదు గొఱ్ఱెను జూచెను - బోయఁడు తండ్రి - తనశిశువును గాంచెను = కనికరమెదలో నిం - డినవారలై నన్ను - వన ⁷గిరికటకాదు - లను వెంబడించిరి ||ఇడుగో||

4.ప్రాణావసర మప్పుడు - యేకాకినై - క్షీణించి యున్నప్పుడు = ⁸త్రాణార్థమగు ⁹నెనరు - త్రాళ్లతో ననుగట్టి - నాణెంబుగా దెచ్చి - నన్ను రక్షించెను ||ఇడుగో||

5.చెడుగు మెకములవల్లను - బాధలనొంది - కడుమలినమై యుండను = కడిగి గాయములన్ని - గట్టి శుభ్రముచేసి - ¹⁰తడయక నాయింట - నిడి నెమ్మది యొసంగె ||నిడుగో||

6.ప్రభుయేసు నా బోయఁడు-  యీతఁడె భూమి - ¹¹నభము లేలెడి ¹²రాయఁ డు = శుభమైన తనదివ్య - ¹³శోణిత మొసఁగియ - ¹⁴వ్విభుఁడు ప్రేమించి దీ - వించి స్వస్థముఁజేసె ||నిడుగో||

7.నన్ను దొడ్డిని బెట్టెను - పోయినగొఱ్ఱె - తెన్ను వెదకిపట్టెను = సన్నంపు పచ్చిక - యున్ను జీవనపూట - లున్నుఁ గల్గెడిచోట్ల - నన్నుంచి రక్షించె ||నిడుగో||

8.నేను మూర్ఖపుగొఱ్ఱెనై - లోబడకుంటి - మానసమున వెర్రినై = పూని యిప్పుడు కాచే - వాని శబ్దము ప్రేమ - తో నాలింపుచు దొడ్డి - నానందముననుందు ||నిడుగో||

9.చెడ్డబిడ్డనై యుంటిని - యిటునటుబోవ - ¹⁵నెడ్డెతనముఁ గొంటిని = ¹⁶మెడ్డులేకిపుడు ప్రే - మింతు నా ప్రియజనకు - దొడ్డ శబ్దము వాంఛిం - తును ముక్తి ¹⁷నిలయంబు ||ఇడుగో||
                          – పురుషోత్తమ చౌదరి
 -------------------------------
¹సంతోషము. ²శబ్దము. ³లోబడి. ⁴పుచ్చుకొను. ⁵మోట. ⁶ప్రేమగల ఇల్లువిడిచి. ⁷పర్వతప్రక్కలు. ⁸బలమైన.  ⁹ప్రేమ. ¹⁰ఆలస్యముచేయక. ¹¹ఆకాశము. ¹²రాజా. ¹³రక్తము. ¹⁴ప్రభువు. ¹⁵మోటతనము. ¹⁶ఆటంకము. ¹⁷నివాసము.

23 April 2022

Idhigo naa shishuyulara | ఇదిగో నా శిష్యులారా యెఱుక

224  
క్రీస్తు కడపటి హెచ్చరిక
రా - ముఖారి,  తా - ఆది

ఇదిగో నా శిష్యులారా - యెఱుక లుంచుఁడి = మోక్ష -  ¹సదనమున కేను బోదు - సంతోషించు(డి ||ఇదిగో||

1.యెరూషలేమందుండి మీ - రెదురు చూడుఁడి -  మీపైఁ - బరిశుద్ధాత్మయు దిగివచ్చి - పనులు దెల్పును ||ఇదిగో||

2.దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మీతో - మక్కువైయుండఁ బరిశు - ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||

3.నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు = నాతో - సర్వకాలము నిత్య - సామ్రాజ్యము నేల ||నిదిగో||

4.ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుఁడి =  నాదు సకలాజ్ఞలందు నిదియె - సార మనుకొనుఁడి ||యిదిగో||

5.ఏదైననా పేరిటమీ - రించుక వేఁడినను = మీకు - మోదముతోడదాని - ముందే చేయుదును ||ఇదిగో||

6.ఉల్లము లందుఁ గలఁత - లెల్ల విడువుఁడి = నేను -  మళ్లి వచ్చెడి విధము - మరువకుండుఁడి ||యిదిగో||
                 – పురుషోత్తము చౌదరి

28 March 2022

Idi rakshana krupa kaalam | ఇది రక్షణ కృపకాలం

ఇది రక్షణ కృపకాలం - ప్రభు త్వరగా రా సమయం 
ఇక ఆలస్యం లేదిక - మనస్సు మార్చుకోనీవిక (2)

1.రాజ్యముల రాజ్యముల్ - జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్ - ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2.దేశమంతా క్షామమే - జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే - యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన - అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు - భక్తులకు హింసలు||ఇది||

4.క్రైస్తవుడా మేలుకో - సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు - ఆత్మయందే బలపడు ||ఇది||

20 February 2022

Idhigo shubhada rakshanamu | ఇదిగో శుభద రక్షణము

160
క్రీస్తును గూర్చి ప్రవచనములు
రా - పంతురాళీ, తా - అట 
(ఛాయ: ఇడుగో గొఱ్ఱెల కాపరి)

ఇదిగో శుభద రక్షణము - దేవుఁడు పంపె - నిదిగో శుభద రక్షణము = ¹సదమలంబగు పూర్వ - సత్యవాక్యమునందు -  మృదువుగా దీర్ఘ ద - ర్శుల చేతఁ బలుకఁబడె ||ఇదిగో||  

1.²అలపిశాచముతోడను - దేవుఁడు తొల్లిఁ - బలుకు వాక్యము జాడను = ³పొలతి సంతతి నిన్ను - తలఁగొట్ట బుట్టునని - తెలియఁజేసెను మోషె - దీర్ఘ దర్శన వాక్య ||ఇదిగో||  

2.ఘన దివ్య బలిచేయను - పాపములెల్లఁ - ⁴దునిమి పుణ్యము లియ్యను = ⁵ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని - మును దానియేలు బ - ల్కెను దీర్ఘ దర్శనము ||ఇదిగో|| 

3.యూద రాజ్యములోపట - బెత్లేమనెడి - యూరఁ గ్రీస్తుడు బుట్టుట = ఆదిలోన మీకా - యను దీర్ఘ దర్శిచే - మోదమునఁ దెల్పబడె - ముందు వేదమునందు ||ఇదిగో|| 

4.మన దోషముల కొఱకునై - యేసుని కాయ - మది గాయముల ⁶హ్రస్వమై = మన రక్షకుని పాట్లు - గనినట్టుల యెషయ్య - మును దెల్పె దీర్ఘద - ర్శన వాక్యముల నిచ్చి ||ఇదిగో||
 -  పురుషోత్తమ చౌదరి
------------------------------------------------
¹మిక్కిలి పరిశుద్ధమైనది. ²ఆ. ³స్త్రీ. ⁴నాశనము చేసి. ⁵చక్కగా. ⁶క్షీణించి.

27 August 2021

I have decided to follow

I have decided to follow Jesus;
I have decided to follow Jesus;
I have decided to follow Jesus;
No turning back, no turning back.

The world behind me, the cross before me;
The world behind me, the cross before me;
The world behind me, the cross before me;
No turning back, no turning back.

Though none go with me, still I will follow;
Though none go with me, still I will follow;
Though none go with me, still I will follow;
No turning back, no turning back.

My cross I’ll carry, till I see Jesus;
My cross I’ll carry, till I see Jesus;
My cross I’ll carry, till I see Jesus;
No turning back, no turning back.

Will you decide now to follow Jesus?
Will you decide now to follow Jesus?
Will you decide now to follow Jesus?
No turning back, no turning back

It is well with my soul

Grander earth has quaked before
Moved by the sound of His voice
Seas that are shaken and stirred
Can be calmed and broken for my regard

Through it all, through it all
My eyes are on You
Through it all, through it all
It is well 

Through it all, through it all
My eyes are on You
It is well with me

Far be it from me to not believe
Even when my eyes can’t see
And this mountain that’s in front of me
Will be thrown into the midst of the sea

Through it all, through it all
My eyes are on You
Through it all, through it all
It is well

So let go my soul and trust in Him
The waves and wind still know His name (3)
The waves and wind still know His name

It is well with my soul
It is well with my soul
It is well with my soul
It is well with my soul (3)

It is well it is well with my soul (3)
Ahhhhhhh

Through it all, through it all
My eyes are on You Lord
Through it all (3)

I am guilty Ashamed of what

I am guilty
Ashamed of what I’ve done, what I’ve become
These hands are dirty
I dare not lift them up to the Holy One

You plead my cause, you right my wrongs
You break my chains, you overcome
You gave your life, to give me mine
You say that I am free
How can it be? Yeah
How can it be? Yeah

I’ve been hiding
Afraid I’ve let you down
[Album version:] Inside I doubt, that you still love me
[Video version:] Inside I doubt, that you could love me
But in your eyes, there’s only grace now

You plead my cause, you right my wrongs
You break my chains, you overcome
You gave your life, to give me mine
You say that I am free
How can it be? Yeah
How can it be? Yeah

Though I fall, you can make me new
From this death, I will rise with you
Oh, the grace reaching out for me, yeah
How can it be, how can it be?

You plead my cause, you right my wrongs
You break my chains, you overcome
You gave your life, to give me mine
You say that I am free, yeah

You plead my cause, you right my wrongs
You break my chains, you overcome
You gave your life, to give me mine
You say that I am free
How can it be? Yeah
How can it be? Yeah

20 August 2021

Idigo Neethi Bhaskarundu | ఇదిగో నీతి భాస్కరుండు

84          
నీతి సూర్యుఁడు
రా – బేహాగ్,  తా – ఏక
          
ఇదిగో నీతి భాస్కరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి = మది తమో గుణంబులణపై - సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

1.ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ - మెవని మనుజ రూపమాయె = నవవినీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి || ఇదిగో ||

2.నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో – దురితఋణము దీర్చునెవఁడో = పరమపురుషు డేసుఁడతఁడె - నిరతజీవ మొసగునిపుడె || ఇదిగో ||

3.కలుష మెల్ల బాపదలఁచి - కలువరి గిరివరకు నడచి - యలవికాని ముక్తి గూర్చన్ = సిలువమీద బలియై మరణ - బలమునణఁచి తిరిగిలేచె||ఇదిగో||

4.మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె - హృదయరసము లతిశయించి = సాధుగుణముగలిగి యేసు - పాదములను గొలుతు నిపుడె || ఇదిగో॥

5.జనగణముల జీవమతఁడె - ధనఘనముల దాతయతఁడె - యనుభవమున నెఱుఁగుమతని = యనుపమ ప్రేమా మృతంబు - ననవరతా నందకరము || ఇదిగో ||
                            – చెట్టి భానుమూర్తి

22 June 2021

Idi Devuni Vijayamu | ఇది దేవుని విజయము

ఇది దేవుని విజయము సాతనుని పతనము (2)
సిలువలో నెత్తుటి ధారలు - సాతానునికే చితి మంటలు - హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2) ||ఇది||

1. మోహపు చూపుల మనిషి మోముపై - ఉమ్మి వేసెను, ఉమ్మి వేసెను - 
మోసపు తలపుల మనిషి శిరస్సుపై ముళ్ళ కిరీటం, ముళ్ళ కిరీటం - 
పాపా తనువున కొరడా దెబ్బలు - శాప కరముల కఠిన శీలలు - 
అపవాదికే అంత్య క్రియలు ప్రభు యేసుకే విజయ గీతికలు ||ఇది||

1. లోక పాపమును శోక భారమును - సిలువ వేయుటే తండ్రి చిత్తము - 
పాప క్షమాపణ శాప విమోచన సాధించుటయే తనయుని త్యాగము - 
మానవాళికి మోక్ష మార్గము - మానవాత్మలకు రక్షణ భాగ్యం(2) - సిలువ సునాదం పునారుద్దానం - పరిశుద్ధాత్ముని ఘన సాక్ష్యం  ||ఇది||

27 May 2021

Inthati Premanu Vinthaga Chupanu | ఇంతటి ప్రేమను వింతగ చూపను

ఇంతటి ప్రేమను వింతగ చూపను - ఎంతటివాడనయా (2)
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా 

అ.ప: కరుణామయా - దయాహృదయా (4)

1. కరగని కఠిన పాషాణం నా హృదయమును గెలిచితివా (2)
తరగని నీ ప్రేమను చాటను (2) - నన్నిల నీవు పిలచితివా ||కరుణా||

2. ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగను చేసితివా (2)
చెరగని నీదు గ్రంధమునందు (2) - నా పేరును నీవు రాసితివా ||కరుణా||
DOWNLOAD MP3 SONG HERE 👇

09 May 2021

Idi devuni nirnayamu ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది

ఇది దేవుని నిర్ణయము -మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు - ప్రభు స్థిరపరచిన కార్యము (2) 
ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది దేవుని||

1.ఈ జగతి కన్నా మునుపే - ప్రభు చేసెను ఈ కార్యము (2) 
ఈ ఇరువురి హృదయాలలో - కలగాలి ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది దేవుని||

2.వరుడైన క్రీస్తు ప్రభువు - అతి త్వరలో రానుండెను (2) 
పరలోక పరిణయమే - మనమెల్లరము భాగమే (2) 
మనమెల్లరము భాగమే ||ఇది దేవుని||
______________________________
Idi Devuni Nirnayamu - Manushyulakidhi Asadhyamu (2)
Yedenu Vanamandhu - Prabhu Sthiraparachina Karyamu(2) 
Prabhu Sthiraparachina Kaaryamu ||Idi Devuni||

Ee Jagathi Kanna Munupe - Prabhu Chesenu Ee Kaaryamu (2) 
Ee Iruvuri Hrudayalalo - Kalagali Ee Bhavamu (2) 
Nindaali Santhoshamu ||Idi Devuni||

Varudaina Kreesthu Prabhuvu - Athi Thvaralo Raanundenu (2) 
Paraloka Parinayame - Manamellaramu Bhagame (2) 
Manamellaramu Bhagame ||Idi Devuni||

DOWNLOAD MP3 SONG HERE 👇

09 October 2020

Idhi Shubhodayam Kreesthu | ఇది శుభోదయం క్రీస్తు

ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం 
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం (2) 

1. రాజులనేలే రారాజు - వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు - నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో - జయము జయము జయమహో ||ఇది||

2. గొల్లలు జ్ఞానులు ఆనాడు - ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు - పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో ప్రతి ధ్వనించెను ఆ దివిలో  ||ఇది||
----------------------------------------------
Idi shubhodayam kreesthu janmadinam
Idi loka kalyanam meri punya dinam (2)

Rajulanele raraju velasenu - pashuvula paakalo
Papula paalaita rakshakudu - navvenu thalli kougililo
Bhayamu Ledu manakilalo - Jayamu jayamu jaya maho. ||Idi shubho||

Gollalu jnanulu aanadu - pranamilliri bhaya bhakthitho
Pillalu peddalu eenadu - pujinchiri prema geethitho
Jayanadame ee bhuvilo - Prathidhwninchenu aa divilo.||Idi shubho||
DOWNLOAD MP3 SONG HERE 👇

16 August 2020

Aidu Gayamu Londinava | ఐదు గాయము లొందినావా

192    
క్రీస్తు మరణ శ్రమల ధ్యానము
రా - ముఖారి, తా - అట 
(ఛాయ: ఎంతో దుఃఖము)

ఐదు గాయము లొందినావా - నా కొఱకైదు - గాయము లొందినావా = ఐదుగాయముల నా - యాత్మదలంప నా కారాట మెచ్చినదే - నీ - మైదీగె నావంటి - మర్త్యుల పాల్జేసి  - మరణ మొందితివి గదే  ||ఐదు||

1.గార మైననీ శ - రీర రక్త మిలను - ధారయై కారినదా - నా = నేరమా యయ్యది - భారమై నీ పైని - ఘోరమై యొరిగినదా  ||ఐదు||

2.అందమౌ నీ తనువు - కంది రక్త స్వేద బిందువులై రాలెనే - యీ = చంద మూహింప నా - డెందమ్ము భీతిచే గొందలమై తూలెనే ||ఐదు||

3.ఎల్ల పాపము మోయు - అల్ల దేవుని గొట్టె - పిల్లవు నీవేగదా - నా = వల్లనా నీ కింత - యల్లాట పుట్టెనే - చెల్ల తాళునే  నాయెద ||ఐదు||

4.భంగమౌనట్టి దు - ష్ఫాపులగావ నీ - ప్రాణమర్పించితివా - యీ సంగతి జూడ నీ - సాహస మింక నే - భంగి నీ జగతి మరవ ॥ఐదు|| 

5.ఆయాసమైన నీ - యాపద లెల్ల నే - నాలోచింపగా నాత్మలో - నెడ = బాయక తద్దివ్య - పాదసరోజముల్ - భాసిల్లు నా యాత్మలో  ||ఐదు|| 

6. తల్లి కైనమరి తండ్రికైన నన్న - దమ్ముల కైన లేదే - కన్న = పిల్లల కైన నీ - ప్రేమ పోల్చుద - మన్న - బృధివిలో గానరాదే ||ఐదు||

7.ఈ ప్రీతి నీ యోర్మి - నీ మాహాత్మ్యం బిల - నెవ్వరూ హింతు రొగి - నో = హో ప్రభువా తద్ద - యోత్కట గాంభీర్య - మూహింప నీకే తగు ||ఐదు||
                                   - బేతాళ జాన్

Idigo Nee Raju Vachuchunde | ఇదిగో నీరాజు వచ్చుచుండె

631

ఇదిగో నీరాజు వచ్చుచుండె - సీయోను కుమారి  సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||

1.నీదురాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చు చుండె ||ఇదిగో|| 
 
2.రక్షణగలవాడుగ - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం - వచ్చు చుండె ||ఇదిగో|| 

3.స్వాతికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకె - వచ్చుచుండె ||ఇదిగో||

4.దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ||ఇదిగో||

5.ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో 
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ||ఇదిగో||

6.దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె ||ఇదిగో||

7.యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ||ఇదిగో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Immanuyelu Rakthamu | ఇమ్మానుయేలు రక్తము

343
నూతన జన్మము 
There is a fountain filled with blood
 
1. ఇమ్మానుయేలు రక్తము - 
    ఇంపైన యూటగు 
    ఓ పాపి ! యందు మున్గుము - 
    పాపంబు పోవును

        ||యేనుండు నాకు మారుగా 
          ఆ సిల్వఁ జావఁగా 
           శ్రీ యేసు రక్త మెప్పుడు 
           స్రవించు, నాకు గా ||

2. ఆ యూట మున్గి దొంగయు 
    హా ! శుద్ధు డాయెను 
    నేనట్టి పాపి నిప్పుడు 
    నేనందు మున్గుదు

3. నీయొక్క పాప మట్టిదే 
    నిర్మూల మౌటకు
    రక్షించు గొఱ్ఱె  పిల్ల ! నీ
    రక్తంబె చాలును . 

4. నా నాధు రక్తమందున 
    నే నమ్మి యుండినన్ 
    నా దేవుని నిండు ప్రేమ 
    నే నిందు  జూచెదన్ . 

5. నా యా యుష్కాల మంతట 
    నా సంతసం బదే 
    నా క్రీస్తుయొక్క రొమ్మునన్
    నా గాన మిద్దియే. 
  - విలియం కానార్
    అను: ఎల్. హార్మస్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...