Showing posts with label స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే. Show all posts
Showing posts with label స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే. Show all posts

22 March 2021

Sthuthi neeke yesu raja mahima స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే

స్తుతి నీకే యేసు రాజా మహిమ నీకే యేసు రాజా (2)
స్తోత్రం నీకే యేసు రాజా ఘనత నీకే యేసు రాజా
హోసన్నా ...హోసన్నా.. హల్లెలూయా హోసన్నా (2)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు త్వరలోనే రానున్నాడు 
నిత్య జీవమును మన అందరికిచ్చి పరలోకం తీసుకెళ్తాడు (2)  ||హోసన్నా||

1. మధ్యాకాశములో ప్రభువును కలిసెదము
పరిశుద్ధుల విందులో పాలు నొందెదము (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు (2)
తేజోవాసులతో స్తుతియింతుము ||హోసన్నా||

2. సంతోష గానాలతో ఉత్సహించి పాడెదము
క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము (2)
శ్రమలైన శోధనలెదురైనా (2)
ఆర్భాటముతో సన్నుతింతుము ||హోసన్నా||

3. పరిశుద్ధ హృదయముతో పరవశించి పాడెదము
ఆత్మతో సత్యముతో ఆరాధించెదము(మేము) (2)
యేసు ఒక్కడే దేవాధి దేవుడని (2)
ఎలుగెత్తి మేము చాటెదము ||హోసన్నా||
DOWNLOAD MP3 SONG HERE👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...