Showing posts with label మనసున్న మంచిదేవా. Show all posts
Showing posts with label మనసున్న మంచిదేవా. Show all posts

26 September 2021

Manasunna manchi deva lyrics | మనసున్న మంచిదేవా

మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా -
మనసు మలినమైన నాకై - మనిషిగా దిగి వచ్చావా (2)
నా మది నీ కోవెలగా మలచుకోవయా -
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా 
 
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము -
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2)
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా ||నా మది||
 
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను -
వంచన చేసి నడుపును తప్పు బాటను (2)
అంతరంగమును పరిశీలించు యేసయ్యా -
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ||నా మది||
 
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి -
దీన మనస్సుతో నీకడ శిరము వంచితి (2)
పూర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా -
తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా మది||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...