Showing posts with label 132 రండి పాడ దూతలారా. Show all posts
Showing posts with label 132 రండి పాడ దూతలారా. Show all posts

26 December 2021

Randi pada dhuthalara | రండి పాడ దూతలారా

132 Angles from the realms of glory

1. రండి పాడ దూతలారా - నిండు సంతోషంబుతో
యేసుని జన్మంబు గూర్చి - ఈ భూలోకమంతట
రండి నేడు పుట్టినట్టి - రాజు నారాధించుడి.

2. మందగాయు గొల్లలార! - మనుష్యులతో నేడు 
వాసంబు జేయుచున్నాఁడు - వాసిగాను దేవుండు 
రండి నేడు పుట్టినట్టి - రాజు నారాధించుడి.

3. జ్ఞానులారా! మానుడింక - యోచనలం జేయుట 
మానుగాను వెదకుడేసున్ - చూచుచు నక్షత్రమున్ 
రండి నేడు పుట్టినట్టి - రాజు నారాధించుడి.

4. పరిశుద్ధులారా! మీరు - నిరీక్షించుచుండిన 
యేసు ప్రభువాలయంబు - యేతెంచెను చూడుడి 
రండి నేడు పుట్టినట్టి - రాజు నారాధించుడి.

5. పశ్చాత్తాప మొందియున్న - పాపులార! మీకు వి 
ముక్తి గల్గె; శక్తి నొంది - రక్తి నేసుంజేరుడి 
రండి నేడు పుట్టినట్టి - రాజు నారాధించుడి.
                                - జేమ్స్ మంట్ గోమరి
                              అను: ఒంగోలు దావీదు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...