Showing posts with label Easter songs. Show all posts
Showing posts with label Easter songs. Show all posts

23 April 2022

Kreesthu nedu lechenu aa aa aa| క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ

222 
Christ the Lord is Risen Today

1.క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ 
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ.

2.మోక్ష మియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుఁడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ 
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ.

3.బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ 
అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ 
గెల్చి ముక్తిఁ దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ.

4.క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్లవారిఁ బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ
మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ.

5.యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 
మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ
యేసుఁడుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ 
మేము కూడఁ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ.

6.భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ 
యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ 
మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ 
నీదె నిత్యజయము ఆ ఆ ఆ హల్లెలూయ.
                        – చార్లెస్ వెస్లీ
                  అను: జాన్ అబెర్లీ

22 April 2022

Yesu punarudhanamayenu | యేసు పునరుత్థానమాయెను

220   
క్రీస్తు పునరుత్థానము
రా - తోడి, తా - ఆది
(ఛాయ: వారు భాగ్యవంతు లౌదురు)

యేసు పునరుత్థానమాయెను - చావునొంది క్రీ - స్తేను పునరుత్థానమాయెను = యేసు పునరుత్థానమాయె -  దాసులెల్ల నుతింప వింతగ - భాసురంబుగ భక్తలన్బర - వాసులుగఁ దాఁజేయు నిప్పుడు ||యేసు||

1.బేధపడి యా సిల్వమీఁదను - దుష్టాత్మ లాయన - నాదరంబుగఁ బట్టి మోదను = పాదుకొని ప్రేమన్మతిన్పరి - పంధి జనుల గావుమంచును - సాదరంబుగ వేఁడె తండ్రిని -  శత్రులను రక్షింప నిప్పుడు ||యేసు||

2.దుష్టజను లేతెంచుచున్నారు - నన్నుఁబట్టి చాలఁగ -  గష్టపెట్టఁ దలంచు కొన్నారు = విష్టపంబున సిల్వమీఁదను -  వేదన క్రూరముగ బెట్టుచు - భ్రష్టులైనను బాసిమీరఁక -  పారిపోయెదరంచు నిప్పుడు ||యేసు||

3.ఆమహిన్పరి శుద్ధవంతుఁడై - జన్మించె దేవుని -  నీయందున నీతిమంతుఁ డై = యీ మహిని బోధింప దోష వి - హీనుఁడైన నిరపరాధిని - స్వామి ద్రోహిగ నెంచి యూదులు - చంపి పూడిచిపెట్ట నిప్పుడు ||యేసు||
                         – మిక్కిలి సమూయేలు

Kreesthu lechenu halleluya | క్రీస్తు లేచెను హల్లెలూయ

219     
క్రీస్తు లేచెను
రా - యమన్ కళ్యాణి,     తా - త్రిపుట
(ఛాయ: నేనును నా యింటి వారును)

క్రీస్తు లేచెను హల్లెలూయ - క్రీస్తు నన్నులేపును = ఇద్దియె సునాద సత్యము - ఇలను చాటుడి నిత్యము||

1.మృతుల పునరుత్థాన పంటకు - ప్రథమ ఫలమగు క్రీస్తులో = మృతులు లేతురు నేను లేతును - నాదువరుసలో నిజమిది||

2.పాపమరణ నరకబలములు - ప్రభుని శక్తికి ఓడెను =  పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము||

3.మరణమా! నీముల్లు యెక్కడ? - మరణమా! జయమెక్కడ? = మరణమా! నీముల్లు విరిగెను - మహిమ క్రీస్తులో నిప్పుడు ||

4.శిలయు ముద్రయు బలిమికావలి - గలిబిలాయెను రాత్రిలో = ఇలయు పరమును కలుసుకొనియెను -  గెలుపునొందిన క్రీస్తులో ||

5.మృతులు నీదగువారలందరు - బ్రతికి లేతురు సత్యము = ప్రేతలను జీవింపచేయును - పృథివి క్రీస్తుని విజయము ||

6.స్తుతియు మహిమయు ఘనత నీకె - స్తుతికి పాత్రుడ రక్షకా = స్వంత రక్తము చిందితివి నా - స్వామి యిదెనా యంజలి ||
               – బి. సూర్య ప్రకాశరావు

21 April 2022

Halleluya yani paadudi | హలెలూయ యని పాడుఁడీ

217 
ఆయన యుగ యుగములు జీవించుచున్నాడు
రా - బిళహరి, తా - త్రిపుట
(ఛాయ: గీతములు పాడుడీ)

హలెలూయ యని పాడుఁడీ - సమాధిపై - వెలుఁ గేమొ పరికించుఁడీ = కలఁడు యేసు సజీవుఁడయి, లే - ఖనముల లవి నెరవేరెను - కలిమి మోదము గులగ, దివి నుతి - సలువ మహిమను వచ్చును ||హలెలూయ||

1.హలెలూయ యని పాఁడుడీ - యీ జగతికిఁ - కలిగె రక్షణ చూడుఁడీ = శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా -  వలి సమాజము దేవుని - బలిమి కాగక పారిపోయెను - గలిబి లాయెను నరకము ||హలెలూయ||

2.హలెలూయ యని పాడుఁడీ - చీఁకటిపైని - వెలుఁగే జయ మొందుసుండీ = యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా - యల విశ్వాసము మరలను - బలనిరీక్షణ మనకుఁ గలిగెను - బ్రతిహృదయము బలపడెన్ ||హలెలూయ||

3.హలెలూయ యని పాడుఁడీ - దుఃఖించు నో -  చెలియలారా వినుఁడీ = సొలయకుండఁగ మీర లటునిటు - చూచుచుండుట యెవరిని - ఫలము లేదిఁక బ్రతుకు యేసు - ప్రభుని వెదకుట మృతులలో ||హలెలూయ||

4.హలెలూయ యని పాడుఁడీ - యేసు ప్రభుని -  వలననే గలిగెఁగనుఁడీ = యిలయుఁ బరమును సఖ్యపడియెను - గలిగె హర్షము చావుచే - సిలువ చింతలు మాని, పొందుఁడి - కలకలంబగు మోదము ||హలెలూయ||

5.హలెలూయ యని పాడుఁడీ - మీ భూరి చిం - తలుతీరె మది నమ్ముఁడీ = బలహీనపు చిన్న మందా! - ప్రభుని చెంతకు మరలుము - కలుగు జీవము మిమ్ము నాయన - కరుణతో నడుపును సదా ||హలెలూయ||

6.హలెలూయ యని పాడుఁడీ - సంఘము సదా - నిలిచి యుండును సుమండీ = పలు తెరంగుల రిపుల వలనను - బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ కేమియు నన్ని యడ్డుల - గెలిచి వర్ధిల్లుచుండును ||హలెలూయ||

7.హలెలూయ యని పాడుఁడీ - దేవుని బోధ - కులు సర్వరాష్ట్రంబుల = నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు - యేసు రక్షణ వార్తను - వెలుఁ గువలెఁ బ్రసరింపఁ జేయుదు - రిలను ధృతితో నేర్పుతో ||హలెలూయ||

8.హలెలూయ యని పాడుఁడీ - భక్తులారా - విలపింపవలదు సుండీ = కలుగకుండుఁడి సందియంబులు - గడుచు కాలము శీఘ్రమే - కలుగు మీకు సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది ||హలెలూయ||

9.హలెలూయ యని పాడుఁడీ - గోధుమ గింజ - వలె బ్రతుకుదురు మీరల = ఇల ప్రభువు తన పంటఁ గూర్పను - నేగుదెంచును జివరను - తొలఁగఁ జేయును గురుగులను గో - ధుమలనుండి నిజంబుగా ||హలెలూయ||
                    – కడియం గాబ్రియేలు

Vijayambu vijayambu | విజయంబు విజయంబు

216  
ప్రభు పునరుత్థానము
రా - అసావేరి,  తా - త్రిపుట

విజయంబు విజయంబు - విజయంబు మా యేసు -  నిజమె మృత్యువు గెల్చి - నేఁడు వేంచేసె =  యజమానుఁ డెల్ల ప్ర - యాసము లెడఁబాప - స్వజనుల రక్షింప - సమసె సిలువమీఁద ||విజయంబు||

1.విజయంబు విజయంబు- విజయంబు మానవుల - ¹వృజిన నివృత్తిని - విభుఁ డొనరింపన్ = గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది - ²విజిత మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ||విజయంబు||

2.విజయంబు విజయంబు - విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ - బరిపాలనంబు =  ³కుజము మీఁదను బ్రాణ - త్యజనము జేసెను - ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ||విజయంబు||

3.విజయంబు విజయంబు - విజయం బిఁకను మా క - పజయము కాకుండఁ - బ్రభు యేసు క్రీస్తు =  సుజనత్వమున వైరి - ⁴వ్రజము గెల్వఁగఁజేసి -  నిజముగఁ బరలోక - నిలయంబులో నిల్పు ||విజయంబు||

4.విజయంబు విజయంబు - విజయం బనెడి పాట -  నిజ భక్తితో మనము - నేర్చిన వాని = భజియించుదము భూన - భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ - డమరత్వ మిడు మనకు ||విజయంబు||
                   – జాన్ ఫ్రాన్సిస్ స్పెన్సర్
__________________________
¹పాపము. ²జయింపబడిన. ³చెట్టు. ⁴సమూహము.

Sudathulara mee richhota | సుదతులార మీ రిచ్చోట

215 
క్రీస్తు పునరుత్థానము
రా - మధ్యమావతి, తా - త్రిపుట

సుదతులార మీ - రిచ్చోట నెవ్వరి -  వెదుకుచు నున్నారు = మృదువుగాను - జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి ||సుదతులార||

1.ఇచట లేఁడు లేచి - యున్నాఁడు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుఁడై = ప్రచురంబుగఁ దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర దేశమున మీతో ||సుదతులార||

2.మనుజ కుమారుఁ డె - క్కుడు పాపిష్ఠులచేత - మరణ మొందుట సిల్వ పైఁ = దనకుఁ దానె మూఁడవ -  దినమందు లేచుట - యును దెల్పెఁ గద మీరు - వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

3.ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుఁడింక - యేసు తెల్పిన మాటలు = ముదముతో జీవముఁ - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
               – పురుషోత్తము చౌదరి

Maranamun jayinchi lechenu | మరణమున్ జయించి లేచెను

213  
క్రీస్తు పునరుత్థాన చరిత్రము
రా - ఆనంద భైరవి,   తా - ఏక
(ఛాయ: ఓ మా తండ్రి)

మరణమున్ జయించి లేచెను - మన ప్రభువు నేఁడు - మహిమ దేహ ¹మొనరఁ దాల్చెను = ధర సమాధి బంధములను - ధన్యముగను త్రెంచి లేచి - కొఱత లన్ని తీర్చి జీవ - వరము లియ్య వసుధపైని ||మరణమున్||

1.మరియయును సలోమి మొదలగు - మగువలు సబాతు - మరు దినోదయమునఁ బ్రియ మగు =  గురుని దేహమునకుఁ బూయఁ - బరిమళంపుఁ దైలములను - సరగఁ దీసికొని సమాధి - కరుగుదెంచి కనులఁజూడ ||మరణమున్||

2.నేఁడు ప్రభుసమాధి ముఖముపై - నున్న రాయి - నెవఁడు దీయు కరుణను మనకై - ²చేడియ లిట్లనుచు వేగఁ - జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ జూచి మిగుల - విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

3.వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు - వానిఁ జూచి మిగుల భయముతోఁ = జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ - లార భయపడకు డటంచు - ³నూరడించె నుచితముగను ||మరణమున్||

4.కొరత పైని మరణ మొందిన - నజరేయుఁ డేసు - కొరకు మిగుల వెదకు చుండిన = ⁴తరుణులార మీ ప్రభుండు - తిరిగి బ్రతికె నిక్క మిద్ది - సరగపేతు రాది శిష్య - సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||

5.మానితముగ మీకిట ముందు - ప్రభు వనిన యట్లు - కానఁబడును గలిలైయ మందుఁ = గాన వెళ్లుడంచు భాసి - తానరుండు పల్క వినుచు - దీన జనులు జడిసి మిగుల - దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

6.మొదట మగ్దలేనే మరియకుఁ - గనఁబడె నటంచు - సుదతి దెల్పె శిష్య వరులకు = కొదువలేని సంతసమునఁ - గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ - బదిలమైన యత్నములకుఁ - బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||

7.అంతఃశత్రు వైన మరణమును - ప్రభువు గెల్చె - సంతసించి సన్నుతింతము = వంత లేల భక్తులార - వాస్తవముగ మనల నిటుల - నంత్య దినము నందు లేపు - నమల దేహముల నొసంగు ||మరణమున్||
                      – మురారి దావీదు
___________________________
¹చక్కగా. ²స్త్రీలు. ³ఆదరించెను. ⁴స్త్రీలారా. 

17 April 2022

Sajeevudai Lechinavada| సజీవుడై లేచినవాడా స్తుతి ఆరాధన


సజీవుడై లేచినవాడా - స్తుతి ఆరాధన నీకే
జీవన అధిపతివే - స్తుతి ఆరాధన నీకే (2)
హల్లేలూయా హోసన్నా - హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా…. హల్లేలూయా హోసన్నా ||సజీవుడై||

1.మరణం జయించినవాడా - స్తుతి ఆరాధన నీకే
పాతాళం గెలిచినవాడా - స్తుతి ఆరాధన నీకే (2)
హల్లేలూయా హోసన్నా - హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్నా - హల్లేలూయా హోసన్నా ||సజీవుడై||

2.రానైయున్న రాజుల రాజా - స్తుతి ఆరాధన నీకే
పునరుద్ధానుడైన ప్రభువా - స్తుతి ఆరాధన నీకే (2)
హల్లేలూయా హోసన్నా - హల్లేలూయా హోసన్నా
హల్లేలూయా హోసన్న - హల్లేలూయా హోసన్నా ||సజీవుడై||

Siramuvanchi mana andari | శిరమువంచి మన అందరి


శిరమువంచి మన అందరి శాపాన్ని మోసెను
కరములు చాపి మన అందరికి మోక్షాన్ని పంచెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

1.శాపపు సిలువ ఓడిపోయెను - ఓడిపోయెను ఓడిపోయెను
నరకపు బలము కూలిపోయెను - కూలిపోయెను కూలిపోయెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

2.మరణపు ముల్లును విరచి వేసెను - విరచి వేసెను - విరచి వేసెను
మహిమగ మనలను మార్చి వేసెను - మార్చి వేసెను - మార్చి వేసెను (2)
యేసుని నామములో… ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

3.నరకపు ద్వారము మూసివేసెను - మూసివేసెను - మూసివేసెను
జీవపు మార్గపు బాట వేసెను - బాట వేసెను - బాట వేసెను (2)
యేసుని నామములో - ఆ సిలువ రక్తముతో (2) ||శిరమువంచి||

Jayinchinaadu Yesu Raju | జయించినాడు యేసు రాజు


జయించినాడు యేసు రాజు - సిలువ మరణమును.
నిలిచినాడు జీవమై - ఇలలో దైవము..
లేఖనములు ప్రవచనములు - చెప్పినట్టుగా..
లేచినాడు ప్రభు తిరిగి - మూడవ దినమున..

దైవ పుత్రుడు - పరిశుద్దుడు - పరమాత్ముడు యేసు
సర్వశక్తుడు -సర్వోన్నతుడు - జయశీలుడు యేసు

1. నా సృష్టికర్తయు - నా ప్రాణదాతయు
నా జీవదాతయు - సర్వాధిపతియు
నా రక్షణ దుర్గము - నా మోక్ష ద్వారము
తను చూపిన మార్గమే - పరలోక మార్గము
నా ప్రాణము నీవే.. నా గానము నీవే - 
నా ధ్యానము నీవే - యేసయ్య (2) 

దైవ పుత్రుడు.. పరిశుద్దుడు.. పరమాత్ముడు యేసు
సర్వశక్తుడు.. సర్వోన్నతుడు.. జయశీలుడు యేసు (2)
Lyrics: V.K. Elias
Vocals: Jayasudha

Raathi Samaadhilo | రాతి సమాధిలో పాతీనా


రాతి సమాధిలో పాతీనా మన యేసు
లేచేను ఈనాడు జై జై జై (2)

1.దేవాలయము మూడు దినముల లోపల (2)
పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2)
ఆ బండ నెవరు దొర్లించకుండనే
తెరువంగ బడియుండె జై జై జై (2) ||రాతి||

2.వేకువ జామున చీకటి యుండ (2)
యేతెంచిరా కాంతలా చోటికి (2)
ఘుమ ఘుమలాడు సుగంధాలు కొనిరాగా
ముందే లేచి యుండె జై జై జై (2) ||రాతి||

3.ఆ మింట నున్న నా తండ్రి కడకు (2)
నేనిపుడేగెద నన్నంటకు (2)
తొలిసారి మరియకు కనిపించి పలికెను
ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||

13 April 2022

Mruthyunjayudaina rarajunu | మృత్యుంజయుడైన రారాజును


మత్యుంజయుడైన రారాజును - 
స్తుతించుడి స్తుతించుడి (2)
మహిమ ప్రభావములు - ఆయనకే చెల్లును - ఆయనకే చెల్లును
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)

మరణము నుండి జీవము నిచ్చిన - జయశీలుడైన క్రీస్తుని 
పూజించెదము కీర్తించెదము
పూజించెదము కీర్తించెదము 
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)

సమాధి గెలచిన రాజాధిరాజుని ఆనందంతో క్రీస్తుని
చాటించెదము కొనియాడెదము 
చాటించెదము కొనియాడెదము 
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)

సజీవుడైన శ్రీయేసు రాజును సుగుణశీలుడగు నాధుని - 
స్తోత్రించెదము సేవించెదము -
స్తోత్రించెదము సేవించెదము
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4) ||మృత్యుంజయుడైన||

30 May 2021

Mruthini Gelichina Vijayudu | మృతిని గెలిచిన విజయుడు మన

మృతిని గెలిచిన విజయుడు మనయేసుడు 
స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘనయేసుడు హల్లెలూయ (8) 

1. ఘనత నొందిన ఎందరి చరితలో - మరణముతోనే ముగిసి పోయెను 
మనుజ కొమరుడు యేసు మాత్రమే - మరణపు కోరలు త్రుంచివేసెను - త్రుంచివేసెను 

2. యేసు దేహమును సమాధినుంచియు - ముద్రలు వేసి భద్రపరచినా 
మూడవ రోజున మహిమతో లేచెను - మృత్యువు యేసుని ఆపగలిగెనా - ఆపగలిగెనా 

3. మొదటివాడుగా తాను లేచెను - నమ్మిన వారిని సయితము లేపును 
విశ్వాసికి బలము యేసు విజయమే - నిరీక్షణకు గురి పునరుత్థానమే - పునరుత్థానమే

Bhajana Cheya Rare Yesuku Jayamu | భజన చేయ రారే యేసుకు జయము

భజన చేయ రారే యేసుకు జయము పాడ రారే (2)
విజయుడైన మన యేసు మహిమ కొనియాడి పాడ రారే(2)

1.సజీవుడైన దేవుడు సమాధిలో ఇక లేడు (2)
వేసిన ముద్ర వ్యర్థమాయె - మూసిన రాయి దొరిలింపబడె (2) ||భజన||

2.నలువది రోజులిక్కడ ఉండి ధైర్యము చెప్పినవాడు (2)
శిష్యులకు తన దర్శనమిచ్చె - తోమాకు అనుమానము తీర్చె (2) ||భజన||

3.మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు చేసినవాడు (2)
చెప్పినట్లే తను లేచాడు - లేఖనములు నెరవేర్చినాడు(2) ||భజన||
DOWNLOAD MP3 SONG HERE 👇

16 August 2020

Geetham Geetham Jaya Jaya | గీతం గీతం జయ జయ గీతం

649
గీతం గీతం జయ జయ గీతం - చేయితట్టి పాడెదము
యేసురాజు లేచెన్ హల్లెలూయ జయ మార్బటించెదము 

1.చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను -  అందు వేసిన ముద్ర కావలి నిల్చెను నా - దైవ సుతుని ముందు ||గీతం||

2.వలదు వలదు యేడువ వలదు - వెళ్ళుడి గలిలయకు -  తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి  ప్రకటించుడి ||గీతం||

3.అన్న - కయప వారల సభయు అదరుచు పరుగిడిరి -  ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి ||గీతం||

4.గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయవీరుడు  రాగా - మీ మేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||

24 May 2020

Yesu Lechenu | యేసు లేచెను ఆదివారమున

218
క్రీస్తు పునరుద్ధనము
రా - మూఖారి, తా - అట

యేసు లేచెను -  ఆదివారమున - యేసు లేచెను - వేకువ జామున - యేసు లేచెను ||

1.వేకువ జామున - చీకటుండగానే = యాకాశ దూతలు - వీకతో రాగానే ||యేసు|| 

2.సమాధిపై రాతిన్ - స్వామి దూతలిద్దరు = సమముగా తీయను - యేసు లేచెనాహహ ||యేసు||

3.మృతులలో సజీవున్ - వెతకు టేలనని దూతలు వారితో - దాత లేడని తెల్పి ||యేసు||

4.స్త్రీలు వేగ వెళ్లి - శిష్యులకు దెల్ప = జింత మారిపోయి - సందేహము తొల్గ ||యేసు|| 

5.పేతురు యోహానుల్ - పరుగెత్తుకొని వచ్చి = ప్రవేశించి గుహలో పరమానంద మొంద  ||యేసు|| 

6.యేసు చచ్చి లేచె - యేసు శిష్యు లట్లే = దోసంబులకు జచ్చి - వాసిగ లేతురండి ||యేసు||
- బస్యన్ జోసఫ్
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...